2 దినవృత్తాంతాలు Chapter 12 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 12:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము రాజ్యం స్థిరపడి, అతడు బలపడిన తరవాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు.

2 దినవృత్తాంతాలు 12:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు యెహోవాకు అపనమ్మకంగా ఉన్నందు వలన రాజైన రెహబాము పాలనలో ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు 1, 200 రథాలు, 60,000 మంది గుర్రపు రౌతులతో యెరూషలేము మీదికి దండెత్తాడు.

2 దినవృత్తాంతాలు 12:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనితో బాటు ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు లెక్కకు మించి ఉన్నారు.

2 దినవృత్తాంతాలు 12:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షీషకు యూదాకు దగ్గరగా ఉన్న ప్రాకార పురాలను పట్టుకుని యెరూషలేము వరకూ వచ్చాడు.

2 దినవృత్తాంతాలు 12:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరికీ, షీషకుకు భయపడి యెరూషలేముకు పారిపోయి వచ్చిన యూదా అధిపతుల దగ్గరికి వచ్చి “‘మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు.

2 దినవృత్తాంతాలు 12:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు, రాజు వినయంగా తల వంచుకుని “యెహోవా న్యాయవంతుడు” అని ఒప్పుకున్నారు.

2 దినవృత్తాంతాలు 12:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూశాడు. యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చేయను. షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణ దయచేస్తాను.

2 దినవృత్తాంతాలు 12:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నన్ను సేవించడానికీ, భూరాజులకు దాసులై ఉండడానికీ ఎంత తేడా ఉందో వారు గ్రహించడం కోసం వారు అతనికి దాసులవుతారు.”

2 దినవృత్తాంతాలు 12:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తురాజు షీషకు యెరూషలేము మీదికి వచ్చి, యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ధనాగారాలన్నిటినీ దోచుకుని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకు వెళ్ళాడు.

2 దినవృత్తాంతాలు 12:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము వాటికి బదులు ఇత్తడి డాళ్ళు చేయించి వాటిని రాజనగరం ద్వారాన్ని కాసే సైనికుల అధిపతులకి అప్పగించాడు.

2 దినవృత్తాంతాలు 12:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు యెహోవా మందిరంలోకి ప్రవేశించిన ప్రతిసారీ రక్షక భటులు వచ్చి వాటిని మోసేవారు. ఆ తరువాత వాటిని మళ్లీ గదిలో ఉంచేవారు.

2 దినవృత్తాంతాలు 12:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తనను తాను తగ్గించుకోవడం వలన, యూదావారిలో కొంతమట్టుకు మంచి ఇంకా మిగిలే ఉండడం వలన, యెహోవా అతనిని పూర్తిగా నశింపజేయకుండా తన కోపాన్ని అతని మీద నుండి మళ్లించుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 12:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము రాజు యెరూషలేములో స్థిరపడి పాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 41 సంవత్సరాల వయసు వాడు. తన నామాన్ని అక్కడ ఉంచడానికి ఇశ్రాయేలీయుల గోత్రాల స్థలాలన్నిటిలో నుండి యెహోవా కోరుకొన్న పట్టణమైన యెరూషలేములో అతడు 17 సంవత్సరాలు పాలించాడు, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు.

2 దినవృత్తాంతాలు 12:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవాను వెతకడంలో స్థిరంగా నిలబడక చెడు క్రియలు చేశాడు.

2 దినవృత్తాంతాలు 12:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము చేసిన ఇతర కార్యాలన్నిటి గురించి ప్రవక్త షెమయా, దీర్ఘదర్శి ఇద్దో రచించిన గ్రంథాల్లో రాసి ఉంది. వాటిలో ఇంకా వంశావళులూ రెహబాముకూ యరొబాముకూ జరిగిన నిరంతర యుద్ధాల వివరాలున్నాయి.

2 దినవృత్తాంతాలు 12:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము తన పూర్వీకులతో కూడా కన్నుమూసినవ్పుడు అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అప్పుడు అతని కొడుకు అబీయా అతనికి బదులుగా రాజయ్యాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Chronicles 12 (ASV) »
King James Version (KJV)
2 Chronicles 12 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 12 (GW) »
Berean Bible (BSB)
2 Chronicles 12 (BSB) »
World English Bible (WEB)
2 Chronicles 12 (WEB) »
French Bible (LSG)
2 Chroniques 12 (LSG) »
German Bible (LUTH1912)
2 Chronik 12 (LUTH1912) »
Arabic Bible (AVD)
٢ أخبار 12 (AVD) »
Portuguese Bible (BSL)
2 Crônicas 12 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Sử Ký 12 (VIE) »
Spanish Bible (RVA)
2 Crónicas 12 (RVA) »
Italian Bible (RIV)
2 Cronache 12 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 下 12 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 下 12 (CUVT) »
Albanian Bible (ALB)
2 Kronikave 12 (ALB) »
Swedish Bible (SV1917)
2 Krönikeboken 12 (SV1917) »
Ukrainian Bible (UKR)
2 хроніки 12 (UKR) »
Hungarian Bible (KAR)
2 Krónika 12 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Летописи 12 (BULG) »
Japanese Bible (JPN)
歴代志下 12 (JPN) »
Norwegian Bible (NORSK)
2 Krønikebok 12 (NORSK) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List