2 దినవృత్తాంతాలు Chapter 8 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 8 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 8 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 8:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను యెహోవా మందిరాన్ని, తన అంతఃపురాన్నీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తరవాత

2 దినవృత్తాంతాలు 8:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను తిరిగి కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులు నివాసం ఉండేలా చేశాడు.

2 దినవృత్తాంతాలు 8:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత సొలొమోను హమాతుసొబా పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 8:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరణ్య ప్రాంతంలో ఉండే తద్మోరుకు, హమాతు దేశంలో ఖజానా ఉంచే పట్టణాలన్నిటికీ ప్రాకారాలు కట్టించాడు.

2 దినవృత్తాంతాలు 8:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా అతడు ఎగువ బేత్‌ హోరోను, దిగువ బేత్‌ హోరోను పట్టణాలకి ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడలు కట్టించాడు.

2 దినవృత్తాంతాలు 8:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాలాతునూ, తనకున్న ధాన్యం నిలవచేసే ఊళ్ళనూ, తన రథాలు, గుర్రపు రౌతులు ఉండడానికి పట్టణాలనూ కట్టించాడు. ఇంకా యెరూషలేములో, లెబానోనులో, తాను పాలించే దేశాలన్నిటిలో తనకు నచ్చిన రీతిలో పట్టాణాలన్నిటినీ సొలొమోను కట్టించాడు.

2 దినవృత్తాంతాలు 8:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులకు చెందని హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారందరిలో మిగిలి ఉన్న వారిని

2 దినవృత్తాంతాలు 8:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండా విడిచిపెట్టిన వివిధ జాతుల ప్రజలనూ సొలొమోను ఇప్పటి వరకూ తనకు కట్టు బానిసలుగా చేసుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 8:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఇశ్రాయేలీయుల్లో ఒక్కణ్ణి కూడా సొలొమోను తన దగ్గర పనిచేయడానికి దాసుడుగా నియమించుకోలేదు. వారిని సైనికులుగా, ప్రధానులుగా, తన సైన్యాధిపతులుగా రథాలకీ గుర్రపు రౌతులకీ అధిపతులుగా నియమించాడు.

2 దినవృత్తాంతాలు 8:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరిలో సమర్ధులైన 250 మంది సొలొమోను రాజు కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు.

2 దినవృత్తాంతాలు 8:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పట్టణంలో నా భార్య నివాసం చేయకూడదు. యెహోవా మందసం ఉన్న స్థలాలు పవిత్రమైనవి” అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కోసం కట్టించిన నగరానికి తీసుకు వచ్చాడు.

2 దినవృత్తాంతాలు 8:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పటినుండి సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.

2 దినవృత్తాంతాలు 8:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు అనుదిన ఏర్పాటు ప్రకారం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినాల్లో, అమావాస్య రోజుల్లో, సంవత్సరానికి మూడు సార్లు జరిగే నియామక పండగ రోజుల్లో, అంటే పొంగని రొట్టెల పండగ, వారాల పండగ, పర్ణశాలల పండగ రోజుల్లో యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.

2 దినవృత్తాంతాలు 8:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు.

2 దినవృత్తాంతాలు 8:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ విషయం గూర్చి అయినా, ఖజానాల గూర్చి అయినా రాజు యాజకులకు, లేవీయులకు చేసిన ఏర్పాటు ప్రకారం వారు అన్ని విషయాలూ జరిగించేవారు.

2 దినవృత్తాంతాలు 8:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకూ సొలొమోను ఆ పని సంపూర్ణంగా చేయించాడు. ఆ విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది.

2 దినవృత్తాంతాలు 8:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను ఎదోము దేశపు సముద్ర తీరంలో ఉన్న ఎసోన్గెబెరుకు, ఏలతుకు వెళ్ళాడు.

2 దినవృత్తాంతాలు 8:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హీరాము తన పనివారి ద్వారా ఓడలనూ ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడనుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకు వచ్చారు.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Chronicles 8 (ASV) »
King James Version (KJV)
2 Chronicles 8 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 8 (GW) »
Berean Bible (BSB)
2 Chronicles 8 (BSB) »
World English Bible (WEB)
2 Chronicles 8 (WEB) »
French Bible (LSG)
2 Chroniques 8 (LSG) »
German Bible (LUTH1912)
2 Chronik 8 (LUTH1912) »
Arabic Bible (AVD)
٢ أخبار 8 (AVD) »
Portuguese Bible (BSL)
2 Crônicas 8 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Sử Ký 8 (VIE) »
Spanish Bible (RVA)
2 Crónicas 8 (RVA) »
Italian Bible (RIV)
2 Cronache 8 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 下 8 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 下 8 (CUVT) »
Albanian Bible (ALB)
2 Kronikave 8 (ALB) »
Swedish Bible (SV1917)
2 Krönikeboken 8 (SV1917) »
Ukrainian Bible (UKR)
2 хроніки 8 (UKR) »
Hungarian Bible (KAR)
2 Krónika 8 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Летописи 8 (BULG) »
Japanese Bible (JPN)
歴代志下 8 (JPN) »
Norwegian Bible (NORSK)
2 Krønikebok 8 (NORSK) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List