2 దినవృత్తాంతాలు Chapter 17 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 17 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 17 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 17:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసా తరువాత అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యాన్ని బలపరచుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 17:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యూదా దేశంలోని ప్రాకార పురాలన్నిటిలో సైన్యాలను ఉంచి, యూదా దేశంలో తన తండ్రి ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిము పట్టణాల్లో కావలి దండులను ఉంచాడు.

2 దినవృత్తాంతాలు 17:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వికుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ

2 దినవృత్తాంతాలు 17:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బయలు దేవుళ్ళను పూజించకుండా తన తండ్రి దేవునిపై ఆధారపడి, ఇశ్రాయేలువారి చర్యల ప్రకారం గాక దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు.

2 దినవృత్తాంతాలు 17:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారంతా యెహోషాపాతుకు పన్ను కట్టారు. అతనికి ఐశ్వర్యం, ఘనత, సమృద్ధిగా కలిగింది.

2 దినవృత్తాంతాలు 17:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుని, ఉన్నత స్థలాలనూ దేవతా స్తంభాలనూ యూదాలో నుండి తీసివేశాడు.

2 దినవృత్తాంతాలు 17:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పాలన మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లోని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే పెద్దలను పంపాడు.

2 దినవృత్తాంతాలు 17:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారితో షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబదోనీయా అనే లేవీయులనూ, ఎలీషామా, యెహోరాము అనే యజకులనూ పంపించాడు.

2 దినవృత్తాంతాలు 17:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని యూదావారి మధ్య ప్రకటిస్తూ, యూదా పట్టణాలన్నిటిలో సంచరిస్తూ ప్రజలకు బోధించారు.

2 దినవృత్తాంతాలు 17:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా దేశం చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటి మీదికి యెహోవా భయం రావడం చేత ఎవరూ యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి తెగించలేదు.

2 దినవృత్తాంతాలు 17:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిష్తీయుల్లో కొందరు యెహోషాపాతుకు పన్ను, కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7, 700 గొర్రె పొట్టేళ్లను, 7, 700 మేకపోతులను సమర్పించేవారు.

2 దినవృత్తాంతాలు 17:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోషాపాతు అంతకంతకూ గొప్పవాడై యూదా దేశంలో కోటలనూ, సామగ్రి నిలవచేసే పట్టణాలనూ కట్టించాడు.

2 దినవృత్తాంతాలు 17:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదాదేశపు పట్టణాల్లో అతనికి విస్తారమైన సంపద సమకూడింది. అతని కింద పరాక్రమశాలురు యెరూషలేములో ఉండేవారు.

2 దినవృత్తాంతాలు 17:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరి పూర్వీకుల వంశాల ప్రకారం వీరి సంఖ్య. యూదాలో సహస్రాధిపతులకు ప్రధాని అయిన అద్నా దగ్గర 3,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

2 దినవృత్తాంతాలు 17:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తరువాత యెహోహానాను అనే అధిపతి. ఇతని దగ్గర 2, 80,000 మంది ఉన్నారు.

2 దినవృత్తాంతాలు 17:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తరువాత జిఖ్రీ కుమారుడు, యెహోవాకు తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొన్న అమస్యా. అతని దగ్గర 2,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

2 దినవృత్తాంతాలు 17:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీనీయుల్లో ఎల్యాదా అనే పరాక్రమశాలి ఒకడున్నాడు. ఇతని దగ్గర విల్లు, డాలు, పట్టుకొనేవారు 2,00,000 మంది ఉన్నారు.

2 దినవృత్తాంతాలు 17:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తరువాత యెహోజాబాదు. ఇతని దగ్గర 1, 80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.

2 దినవృత్తాంతాలు 17:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు యూదా అంతటిలో ఉన్న ప్రాకార పురాల్లో ఉంచినవారు గాక వీరు రాజు పరివారంలో ఉన్నారు.

Available Bible Translations

American Standard Version
2 Chronicles 17 (ASV) »
King James Version
2 Chronicles 17 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 17 (GW) »
World English Bible
2 Chronicles 17 (WEB) »
Louis Segond 1910
2 Chroniques 17 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 इतिहास 17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਇਤਿਹਾਸ 17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 বংশাৱলি 17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 நாளாகமம் 17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 इतिहास 17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
2 કાળવૃતાંત 17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
٢ أخبار 17 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים ב 17 (HEB) »
Bíblia Sagrada Português
2 Crônicas 17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Sử Ký 17 (VIE) »
Reina Valera Antigua
2 Crónicas 17 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 下 17 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 下 17 (CUVT) »
Bibla e Shenjtë
2 Kronikave 17 (ALB) »
Библия на русском
2 Паралипоменон 17 (RUSV) »
Українська Біблія
2 хроніки 17 (UKR) »
Szent Biblia - Magyar
2 Krónika 17 (KAR) »
Българска Библия
2 Летописи 17 (BULG) »
De Heilige Schrift
2 Kronieken 17 (NLD) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List