2 దినవృత్తాంతాలు Chapter 33 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 33 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 33 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 33:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు.

2 దినవృత్తాంతాలు 33:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి యెహోవా వెళ్లగొట్టిన రాజ్యాల ప్రజలు చేసిన నీచమైన పనులు అనుసరించి, యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు.

2 దినవృత్తాంతాలు 33:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠాలను నిలిపి, అషేరా దేవతాస్తంభాలను చేయించి, ఆకాశనక్షత్రాలన్నిటిని పూజించి కొలిచాడు.

2 దినవృత్తాంతాలు 33:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది” అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరంలో అతడు అన్య దేవుళ్ళకు బలిపీఠాలను కట్టించాడు.

2 దినవృత్తాంతాలు 33:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరపు రెండు ఆవరణాల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలను కట్టించాడు.

2 దినవృత్తాంతాలు 33:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్‌ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

2 దినవృత్తాంతాలు 33:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో నాపేరు ఎల్లప్పుడూ ఉంచుతాను.

2 దినవృత్తాంతాలు 33:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనడానికి వారు జాగ్రత్తపడితే, మీ పూర్వీకులకు నేను ఏర్పరచిన దేశం నుంచి ఇశ్రాయేలీయులను నేను ఇక ఎన్నటికీ తొలగించను” అని దావీదుతో అతని కొడుకు సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరంలో తాను చేయించిన అషేరా చెక్కుడు విగ్రహాన్ని నిలిపాడు.

2 దినవృత్తాంతాలు 33:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారిని యెరూషలేము నివాసులనూ ఇశ్రాయేలీయుల ముందు నుంచి యెహోవా నాశనం చేసిన రాజ్యాలకంటే వారు మరింత దుర్మార్గంగా ప్రవర్తించేలా మనష్షే వారిని నడిపించాడు.

2 దినవృత్తాంతాలు 33:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు కానీ వారు పట్టించుకోలేదు.

2 దినవృత్తాంతాలు 33:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు.

2 దినవృత్తాంతాలు 33:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 33:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతని విన్నపాలు ఆలకించి యెరూషలేముకు, అతని రాజ్యానికి అతణ్ణి తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 33:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తయిన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు.

2 దినవృత్తాంతాలు 33:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు.

2 దినవృత్తాంతాలు 33:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.

2 దినవృత్తాంతాలు 33:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా ప్రజలు ఎత్తయిన స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూనే ఉన్నారు గాని అవి తమ దేవుడైన యెహోవాకే అర్పించారు.

2 దినవృత్తాంతాలు 33:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే గురించిన ఇతర విషయాలు, అతడు దేవునికి చేసిన ప్రార్థన గురించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘ దర్శకుల మాటలను గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.

2 దినవృత్తాంతాలు 33:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని ప్రార్థన, దేవునికి ఎలా మొర్రపెట్టాడో, తనను తాను తగ్గించు కొనక ముందు అతని పాపం గురించి, అతడు చేసిన ద్రోహం గురించి, కట్టించిన ఎతైన పూజా స్థలాలూ అషేరాదేవి స్తంభాలు, చెక్కిన విగ్రహాలను నిలపడం గురించి, దీర్ఘదర్శకుడలు రచించిన గ్రంథాల్లో రాసి వుంది.

2 దినవృత్తాంతాలు 33:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే చనిపోయినప్పుడు తన పూర్వీకులతో కూడ తన సొంత భవనంలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు ఆమోను అతనికి బదులు రాజయ్యాడు.

2 దినవృత్తాంతాలు 33:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమోను పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతడు 22 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పాలించాడు.

2 దినవృత్తాంతాలు 33:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన తండ్రి మనష్షే నడచినట్టు యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించాడు. తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు.

2 దినవృత్తాంతాలు 33:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన తండ్రియైన మనష్షేలాగా యెహోవా సన్నిధిలో తనను తాను తగ్గించుకోలేదు. దానికి బదులు ఇంకా ఎక్కువ పాపం చేశాడు.

2 దినవృత్తాంతాలు 33:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని సొంత భవనంలోనే అతణ్ణి చంపేశారు.

2 దినవృత్తాంతాలు 33:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే దేశప్రజలు ఆమోను రాజుమీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కొడుకు యోషీయాను అతని స్థానంలో రాజుగా నియమించారు.

Available Bible Translations

American Standard Version
2 Chronicles 33 (ASV) »
King James Version
2 Chronicles 33 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 33 (GW) »
World English Bible
2 Chronicles 33 (WEB) »
Louis Segond 1910
2 Chroniques 33 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 इतिहास 33 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਇਤਿਹਾਸ 33 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 বংশাৱলি 33 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 நாளாகமம் 33 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 इतिहास 33 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
2 કાળવૃતાંત 33 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 33 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
٢ أخبار 33 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים ב 33 (HEB) »
Bíblia Sagrada Português
2 Crônicas 33 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Sử Ký 33 (VIE) »
Reina Valera Antigua
2 Crónicas 33 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 下 33 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 下 33 (CUVT) »
Bibla e Shenjtë
2 Kronikave 33 (ALB) »
Библия на русском
2 Паралипоменон 33 (RUSV) »
Українська Біблія
2 хроніки 33 (UKR) »
Szent Biblia - Magyar
2 Krónika 33 (KAR) »
Българска Библия
2 Летописи 33 (BULG) »
De Heilige Schrift
2 Kronieken 33 (NLD) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List