2 దినవృత్తాంతాలు Chapter 20 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 20 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 20 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 20:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు.

2 దినవృత్తాంతాలు 20:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతలో కొంతమంది వచ్చి “మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్‌ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు” అని యెహోషాపాతుకు తెలియచేశారు.

2 దినవృత్తాంతాలు 20:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు.

2 దినవృత్తాంతాలు 20:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.

2 దినవృత్తాంతాలు 20:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి,

2 దినవృత్తాంతాలు 20:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు.

2 దినవృత్తాంతాలు 20:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.”

2 దినవృత్తాంతాలు 20:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“వారు అందులో నివాసం చేసి, మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గానీ రోగం గానీ కరువుగానీ, మా మీదికి వస్తే మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే

2 దినవృత్తాంతాలు 20:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని, ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా.

2 దినవృత్తాంతాలు 20:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చేయనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు.

2 దినవృత్తాంతాలు 20:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి.

2 దినవృత్తాంతాలు 20:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు.

2 దినవృత్తాంతాలు 20:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.

2 దినవృత్తాంతాలు 20:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆసాపు సంతతివాడూ లేవీయుడు అయిన యహజీయేలు, సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకర్యా, జెకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు,

2 దినవృత్తాంతాలు 20:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.

2 దినవృత్తాంతాలు 20:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు.

2 దినవృత్తాంతాలు 20:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.”

2 దినవృత్తాంతాలు 20:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు.

2 దినవృత్తాంతాలు 20:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.

2 దినవృత్తాంతాలు 20:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు.

2 దినవృత్తాంతాలు 20:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు.

2 దినవృత్తాంతాలు 20:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు.

2 దినవృత్తాంతాలు 20:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.

2 దినవృత్తాంతాలు 20:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు.

2 దినవృత్తాంతాలు 20:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది.

2 దినవృత్తాంతాలు 20:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు.

2 దినవృత్తాంతాలు 20:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు.

2 దినవృత్తాంతాలు 20:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.

2 దినవృత్తాంతాలు 20:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు.

2 దినవృత్తాంతాలు 20:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.

2 దినవృత్తాంతాలు 20:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా.

2 దినవృత్తాంతాలు 20:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.

2 దినవృత్తాంతాలు 20:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు.

2 దినవృత్తాంతాలు 20:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి వుంది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది.

2 దినవృత్తాంతాలు 20:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది జరిగిన తరువాత, యూదా రాజు యెహోషాపాతు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు.

2 దినవృత్తాంతాలు 20:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు.

2 దినవృత్తాంతాలు 20:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు “నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు” అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Chronicles 20 (ASV) »
King James Version (KJV)
2 Chronicles 20 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 20 (GW) »
Berean Bible (BSB)
2 Chronicles 20 (BSB) »
World English Bible (WEB)
2 Chronicles 20 (WEB) »
French Bible (LSG)
2 Chroniques 20 (LSG) »
German Bible (LUTH1912)
2 Chronik 20 (LUTH1912) »
Arabic Bible (AVD)
٢ أخبار 20 (AVD) »
Portuguese Bible (BSL)
2 Crônicas 20 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Sử Ký 20 (VIE) »
Spanish Bible (RVA)
2 Crónicas 20 (RVA) »
Italian Bible (RIV)
2 Cronache 20 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 下 20 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 下 20 (CUVT) »
Albanian Bible (ALB)
2 Kronikave 20 (ALB) »
Swedish Bible (SV1917)
2 Krönikeboken 20 (SV1917) »
Ukrainian Bible (UKR)
2 хроніки 20 (UKR) »
Hungarian Bible (KAR)
2 Krónika 20 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Летописи 20 (BULG) »
Japanese Bible (JPN)
歴代志下 20 (JPN) »
Norwegian Bible (NORSK)
2 Krønikebok 20 (NORSK) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List