2 దినవృత్తాంతాలు Chapter 13 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 13 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 13 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 13:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యరొబాము రాజు ఇశ్రాయేలును పాలిస్తున్న పద్దెనిమిదో సంవత్సరంలో అబీయా యూదావారి మీద రాజయ్యాడు.

2 దినవృత్తాంతాలు 13:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మూడు సంవత్సరాలు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా పట్టణానికి చెందిన ఊరియేలు కుమార్తె.

2 దినవృత్తాంతాలు 13:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయా 4,00,000 మంది పరాక్రమశాలులైన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. యరొబాము కూడా 8,00,000 మంది పరాక్రమశాలులను అతనికి ఎదురుగా వ్యూహపరిచాడు.

2 దినవృత్తాంతాలు 13:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యంలోని సెమరాయిము కొండ మీద నిలబడి ఇలా ప్రకటించాడు, “యరొబాము, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా వినండి.

2 దినవృత్తాంతాలు 13:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎల్లకాలం పాలించడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దావీదుతో, అతని సంతతివారితో ఎవరూ భంగం చేయలేని నిబంధన చేసి దాన్ని వారికిచ్చాడని మీకు తెలుసు గదా

2 దినవృత్తాంతాలు 13:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా దావీదు కుమారుడు సొలొమోనుకు దాసుడు, నెబాతు కొడుకు అయిన యరొబాము పనికిమాలిన దుష్టులతో చేతులు కలిపి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు.

2 దినవృత్తాంతాలు 13:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను కొడుకు రెహబాము ఇంకా బాలుడుగా, అనుభవం లేక వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధానికి వెళ్ళారు.”

2 దినవృత్తాంతాలు 13:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇప్పుడు దావీదు సంతతి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు కూడా మీ దగ్గర ఉన్నాయి.

2 దినవృత్తాంతాలు 13:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు అహరోను సంతానమైన యెహోవా యాజకులనూ లేవీయులనూ వెళ్ళగొట్టి, అన్యదేశాల ప్రజలు చేసినట్టు మీ కోసం యాజకులను నియమించుకున్నారు గదా? ఒక కోడెనీ ఏడు గొర్రె పొట్టేళ్లనీ తీసుకు వచ్చి తనను ప్రతిష్ఠించుకోడానికి వచ్చే ప్రతివాడూ దేవుళ్ళు కాని వాటికి యాజకుడై పోతున్నాడు గదా.

2 దినవృత్తాంతాలు 13:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. మేము ఆయన్ని విసర్జించలేదు. యెహోవాకు సేవ చేసే యాజకులు అహరోను సంతతివారు. లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు.

2 దినవృత్తాంతాలు 13:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ప్రతి ఉదయం, సాయంకాలం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ, సుగంధద్రవ్యాలతో ధూపం వేస్తూ, పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ, బంగారు దీపస్తంభాన్ని, ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగిస్తూ ఉన్నారు. మేము మా దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన ఆజ్ఞల ప్రకారం సమస్తాన్నీ జరిగిస్తున్నాం. కానీ మీరు మాత్రం ఆయన్ని విడిచిపెట్టారు.”

2 దినవృత్తాంతాలు 13:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆలోచించండి, దేవుడే మాకు తోడుగా, మాకు అధిపతిగా ఉన్నాడు. ఆయన యాజకులు మీ మీద ఆర్భాటం చేయడానికీ బూరలు ఊదడానికీ మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. చేసినా మీకు జయం కలగదు.”

2 దినవృత్తాంతాలు 13:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతకుముందు యరొబాము యూదావారి వెనక భాగంలో కొందరు మాటుగాళ్ళను ఉంచదువు. యరోబాము సైన్యం యూదా వారికి ఎదుటా, మాటుగాళ్ళు వారికి వెనకా ఉండేలా చేశాడు.

2 దినవృత్తాంతాలు 13:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా వారు, తమకు ముందూ వెనకా యోధులు ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు, యాజకులు బూరలు ఊదారు.

2 దినవృత్తాంతాలు 13:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యూదా వారు గట్టిగా కేకలు వేశారు. వారు కేకలు వేస్తుండగా యరొబాము, ఇశ్రాయేలు వారంతా అబీయా ఎదుటా యూదావారి ఎదుటా నిలబడ లేకుండేలా దేవుడు వారిని దెబ్బ తీశాడు.

2 దినవృత్తాంతాలు 13:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించాడు.

2 దినవృత్తాంతాలు 13:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి అబీయా, అతని ప్రజలు వారిని ఘోరంగా హతమార్చారు. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది యుద్ధ వీరులు చనిపోయారు.

2 దినవృత్తాంతాలు 13:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా ఇశ్రాయేలు వారు ఆ కాలంలో అణిగిపోయారు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణంగానే విజయం సాధించారు.

2 దినవృత్తాంతాలు 13:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయా యరొబామును తరిమి, బేతేలునూ దాని గ్రామాలనూ యెషానానూ దాని గ్రామాలనూ ఎఫ్రోనునూ దాని గ్రామాలనూ పట్టుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 13:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయా జీవించి ఉన్న కాలంలో యరొబాము మళ్ళీ బలపడలేదు, యెహోవా అతణ్ణి దెబ్బ తీయడం వలన అతడు చనిపోయాడు.

2 దినవృత్తాంతాలు 13:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయా అభివృద్ధి చెందాడు. అతనికి 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు ఉన్నారు.

2 దినవృత్తాంతాలు 13:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయా చేసిన ఇతర కార్యాల గురించీ అతని నడవడి, అతని మాటలను గురించీ అతని కాలంలో జరిగిన సంగతుల గురించీ ప్రవక్త ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో రాసి వుంది.

Available Bible Translations

American Standard Version
2 Chronicles 13 (ASV) »
King James Version
2 Chronicles 13 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 13 (GW) »
World English Bible
2 Chronicles 13 (WEB) »
Louis Segond 1910
2 Chroniques 13 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 इतिहास 13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਇਤਿਹਾਸ 13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 বংশাৱলি 13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 நாளாகமம் 13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 इतिहास 13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
2 કાળવૃતાંત 13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
٢ أخبار 13 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים ב 13 (HEB) »
Bíblia Sagrada Português
2 Crônicas 13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Sử Ký 13 (VIE) »
Reina Valera Antigua
2 Crónicas 13 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 下 13 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 下 13 (CUVT) »
Bibla e Shenjtë
2 Kronikave 13 (ALB) »
Библия на русском
2 Паралипоменон 13 (RUSV) »
Українська Біблія
2 хроніки 13 (UKR) »
Szent Biblia - Magyar
2 Krónika 13 (KAR) »
Българска Библия
2 Летописи 13 (BULG) »
De Heilige Schrift
2 Kronieken 13 (NLD) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List