2 దినవృత్తాంతాలు Chapter 34 TELIRV Bible Verse Images

2 దినవృత్తాంతాలు 34 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 దినవృత్తాంతాలు 34 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 దినవృత్తాంతాలు 34:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోషీయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 31 ఏళ్ళు పాలించాడు.

2 దినవృత్తాంతాలు 34:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు.

2 దినవృత్తాంతాలు 34:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పాలన 8 వ సంవత్సరంలో తానింకా బాలుడుగా ఉండగానే అతడు తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. తన 12 వ ఏట అతడు ఉన్నత పూజాస్థలాలనూ అషేరా దేవతాస్తంభాలనూ పడగొట్టి, చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ తీసివేసి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేయడం మొదలు పెట్టాడు.

2 దినవృత్తాంతాలు 34:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చూస్తుండగానే ప్రజలు బయలు దేవుడి బలిపీఠాలను పడగొట్టారు. వాటిపైన ఉన్న ధూప వేదికలను నరికివేశారు. అషేరా దేవత స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలనూ, పోతవిగ్రహాలనూ పగలగొట్టి పొడి చేసేశారు. వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద ఆ పొడి చల్లారు.

2 దినవృత్తాంతాలు 34:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పూజారుల ఎముకలను వాళ్ళ బలిపీఠాల మీద అతడు కాల్పించి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేశాడు.

2 దినవృత్తాంతాలు 34:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను వారి పట్టణాల్లో నఫ్తాలి వరకూ వాటి చుట్టు పక్కల ఉన్న శిథిలాల్లో కూడా బలిపీఠాలను పడగొట్టాడు.

2 దినవృత్తాంతాలు 34:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు బలిపీఠాలనూ అషేరా దేవత స్తంభాలనూ పడగొట్టి చెక్కిన విగ్రహాలను పొడి చేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటా ఉన్న ధూపవేదికలను నరికి వేసి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

2 దినవృత్తాంతాలు 34:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని పాలనలో 18 వ ఏట దేశాన్నీ మందిరాన్నీ బాగు చేయించిన తరువాత, అతడు అజల్యా కొడుకు షాఫానునూ పట్టణ అధిపతి మయశేయానునూ కార్యదర్శి యోహాహాజు కొడుకు యోవాహాజునూ తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి పంపాడు.

2 దినవృత్తాంతాలు 34:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ప్రధానయాజకుడైన హిల్కీయా దగ్గరికి వచ్చి, అంతకు ముందు దేవుని మందిరంలోకి తీసుకు వచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశాల్లోని ఇశ్రాయేలు వారిలో మిగిలి ఉన్న వారందరి దగ్గరనుంచి, యూదా బెన్యామీనీయులందరి దగ్గరనుంచి ఆ డబ్బు సమకూర్చారు.

2 దినవృత్తాంతాలు 34:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆ డబ్బుని యెహోవా మందిరపు పనిమీద ఉన్న తనిఖీదారులకు అప్పగించారు. వారు దాన్ని బాగు చేయడానికీ యూదా రాజులు నిర్లక్ష్యం చేసిన ఇళ్ళకు దూలాలను అమర్చడానికీ

2 దినవృత్తాంతాలు 34:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెక్కిన రాళ్లను జోడించడానికీ మ్రానులు కొనడానికీ యెహోవా మందిరంలో పనిచేసేవారికీ శిల్పకారులకూ ఆ డబ్బులిచ్చారు.

2 దినవృత్తాంతాలు 34:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మనుష్యులు నమ్మకంగా ఆ పని చేశారు. వారి మీద తనిఖీదారులు ఎవరంటే, లేవీ గోత్రీకుల్లో మెరారీ వంశం వారైన యహతు, ఓబద్యా, కహాతు వంశీకులు జెకర్యా, మెషుల్లాము. పని నడిపించడానికి ఏర్పాటైన లేవీయులంతా వాయిద్యాలు వాయించడంలో ఆరితేరిన వారు.

2 దినవృత్తాంతాలు 34:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బరువులు మోసేవారి మీదా ప్రతిరకమైన పని జరిగించేవారిమీదా ఆ లేవీయులను తనిఖీదారులుగా నియమించారు. లేవీయుల్లో కొంతమందిని కార్యదర్శకులుగానూ, పరిచారకులుగానూ, ద్వారపాలకులుగానూ నియమించారు.

2 దినవృత్తాంతాలు 34:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరంలోకి తెచ్చిన డబ్బును బయటికి తీసుకు వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా అందించిన ధర్మశాస్త్రగ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది.

2 దినవృత్తాంతాలు 34:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని శాస్త్రి అయిన షాఫానుతో చెప్పి ఆ గ్రంథాన్ని షాఫానుకు అప్పగించాడు.

2 దినవృత్తాంతాలు 34:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకుపోయి రాజుతో ఇలా అన్నాడు. “నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతా వారు చేస్తున్నారు.

2 దినవృత్తాంతాలు 34:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరంలో దొరికిన డబ్బుని వారు పోగు చేసి తనిఖీదారుల చేతికీ పనివారి చేతికీ అప్పగించారు.”

2 దినవృత్తాంతాలు 34:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చాడు” అని లేఖకుడు షాఫాను, రాజుకు చెప్పి, దాన్ని రాజు ఎదుట చదివి వినిపించాడు.

2 దినవృత్తాంతాలు 34:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించినప్పుడు రాజు విని తన బట్టలు చించుకుని

2 దినవృత్తాంతాలు 34:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిల్కీయాకూ, షాఫాను కొడుకు అహీకాముకూ, మీకా కొడుకు అబ్దోనుకూ, శాస్త్రి అయిన షాఫానుకూ, రాజు సేవకుడు అశాయాకూ ఇలా ఆజ్ఞాపించాడు,

2 దినవృత్తాంతాలు 34:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు వెళ్లి దొరకిన ఈ గ్రంథంలోని మాటల గురించి నాకోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చేయలేదు కాబట్టి యెహోవా మనమీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.”

2 దినవృత్తాంతాలు 34:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు హిల్కీయా, రాజు నియమించినవారూ హుల్దా అనే ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళారు. ఆమె షల్లూము భార్య. అతడు తిక్వా కొడుకు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా మనుమడు. ఆమె అప్పుడు యెరూషలేముకు చెందిన రెండవ భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు.

2 దినవృత్తాంతాలు 34:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె వారితో ఇలా చెప్పింది. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఏంటంటే,

2 దినవృత్తాంతాలు 34:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘వినండి, నేను ఈ స్థలం మీదికీ, దానిలో నివసించేవారి మీదికీ విపత్తు తీసుకు రాబోతున్నాను, యూదా రాజు ఎదుట చదివి వినిపించిన గ్రంథంలో రాసిన శాపాలన్నీ రప్పిస్తాను.

2 దినవృత్తాంతాలు 34:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు నన్ను విడిచి పెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, తమ పనులతో నాకు కోపం పుట్టించారు కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను. అది ఆరదు.’ అయితే, యెహోవా చిత్తాన్ని తెలుసుకోడానికి నాదగ్గరికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ విషయం తెలియచేయండి,

2 దినవృత్తాంతాలు 34:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియచేసేదేంటంటే,

2 దినవృత్తాంతాలు 34:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నీ మనస్సు మెత్తనిది కాబట్టి, ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా దేవుని మాటలను నీవు విని, నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను’ ఇది యెహోవా ప్రకటన.

2 దినవృత్తాంతాలు 34:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నేను నీ పూర్వీకుల దగ్గరికి నిన్ను చేరుస్తాను. నీవు ప్రశాంతంగా నీ సమాధికి చేరతావు. ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా నేను రప్పించే విపత్తు నీవు నీ కంటితో చూడవు.’” వారు రాజు దగ్గరికి ఈ సందేశం తీసికెళ్లారు.

2 దినవృత్తాంతాలు 34:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు, యూదా, యెరూషలేములలోని పెద్దలందరినీ పిలిపించాడు.

2 దినవృత్తాంతాలు 34:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజూ, యూదావారంతా, యెరూషలేము నివాసులంతా, యాజకులూ, లేవీయులూ, ప్రజల్లో గొప్పవారూ, సామాన్యులూ యెహోవా మందిరానికి వచ్చారు. ఆప్పుడు అతడు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి చదివి వినిపించాడు.

2 దినవృత్తాంతాలు 34:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు తన స్థలం లో నిలబడి, ఆయనను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలనూ శాసనాలనూ కట్టడలనూ పూర్ణమనస్సుతో పూర్ణహృదయంతో అనుసరిస్తూ ఈ గ్రంథంలో రాసిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తిస్తానని యెహోవా ముందు నిబంధన చేసుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 34:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెరూషలేములో ఉన్న వారందరినీ బెన్యామీనీయులందరినీ ఆ నిబంధనకు సమ్మతించేలా చేశాడు. యెరూషలేము నివాసులు తమ పూర్వీకుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించారు.

2 దినవృత్తాంతాలు 34:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన ప్రాంతాలన్నిటిలోనుంచి అసహ్యమైన వాటన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలీయులంతా తమ దేవుడైన యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బతికిన రోజులన్నీ వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Chronicles 34 (ASV) »
King James Version (KJV)
2 Chronicles 34 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 34 (GW) »
Berean Bible (BSB)
2 Chronicles 34 (BSB) »
World English Bible (WEB)
2 Chronicles 34 (WEB) »
French Bible (LSG)
2 Chroniques 34 (LSG) »
German Bible (LUTH1912)
2 Chronik 34 (LUTH1912) »
Arabic Bible (AVD)
٢ أخبار 34 (AVD) »
Portuguese Bible (BSL)
2 Crônicas 34 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Sử Ký 34 (VIE) »
Spanish Bible (RVA)
2 Crónicas 34 (RVA) »
Italian Bible (RIV)
2 Cronache 34 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 下 34 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 下 34 (CUVT) »
Albanian Bible (ALB)
2 Kronikave 34 (ALB) »
Swedish Bible (SV1917)
2 Krönikeboken 34 (SV1917) »
Ukrainian Bible (UKR)
2 хроніки 34 (UKR) »
Hungarian Bible (KAR)
2 Krónika 34 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Летописи 34 (BULG) »
Japanese Bible (JPN)
歴代志下 34 (JPN) »
Norwegian Bible (NORSK)
2 Krønikebok 34 (NORSK) »

2 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List