అపొస్తలుల కార్యములు Chapter 9 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 9 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 9 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 9:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు శిష్యులను హతమారుస్తానని సౌలు యింకా బెదిరింపు మాటలు పలుకుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి

అపొస్తలుల కార్యములు 9:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు.

అపొస్తలుల కార్యములు 9:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.

అపొస్తలుల కార్యములు 9:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడతడు నేల మీద పడిపోయాడు. “సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?” అనే ఒక శబ్దం విన్నాడు.

అపొస్తలుల కార్యములు 9:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ప్రభూ, నీవెవరివి?” అని అతడు అడిగినప్పుడు, ప్రభువు, “నువ్వు హింసిస్తున్న యేసుని.

అపొస్తలుల కార్యములు 9:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 9:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని మాటల్లేక నిలబడిపోయారు. వారికి ఏమీ కనబడలేదు.

అపొస్తలుల కార్యములు 9:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు.

అపొస్తలుల కార్యములు 9:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.

అపొస్తలుల కార్యములు 9:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు.

అపొస్తలుల కార్యములు 9:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు.

అపొస్తలుల కార్యములు 9:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 9:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అననీయ, “ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు.

అపొస్తలుల కార్యములు 9:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక్కడ కూడా నీ నామంలో ప్రార్థన చేసే వారిందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు.

అపొస్తలుల కార్యములు 9:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం.

అపొస్తలుల కార్యములు 9:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 9:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 9:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 9:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.

అపొస్తలుల కార్యములు 9:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు.

అపొస్తలుల కార్యములు 9:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విన్నవారంతా ఆశ్చర్యపడి, ‘యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడు కదా’ అని చెప్పుకున్నారు.

అపొస్తలుల కార్యములు 9:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదులను కలవరపరచాడు.

అపొస్తలుల కార్యములు 9:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.

అపొస్తలుల కార్యములు 9:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు.

అపొస్తలుల కార్యములు 9:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో కూర్చోబెట్టి గోడ మీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు.

అపొస్తలుల కార్యములు 9:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు.

అపొస్తలుల కార్యములు 9:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చి, “అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు నామంలో ధైర్యంగా బోధించాడు” అనీ, వారికి వివరంగా తెలియపరచాడు.

అపొస్తలుల కార్యములు 9:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ,

అపొస్తలుల కార్యములు 9:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో మాట్లాడుతూ తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు.

అపొస్తలుల కార్యములు 9:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు.

అపొస్తలుల కార్యములు 9:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.

అపొస్తలుల కార్యములు 9:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.

అపొస్తలుల కార్యములు 9:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి,

అపొస్తలుల కార్యములు 9:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే

అపొస్తలుల కార్యములు 9:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.

అపొస్తలుల కార్యములు 9:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది.

అపొస్తలుల కార్యములు 9:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు.

అపొస్తలుల కార్యములు 9:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు.

అపొస్తలుల కార్యములు 9:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు.

అపొస్తలుల కార్యములు 9:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది.

అపొస్తలుల కార్యములు 9:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.

అపొస్తలుల కార్యములు 9:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.

అపొస్తలుల కార్యములు 9:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు యొప్పేలో సీమోను అనే చర్మాలు బాగు చేసే వాని దగ్గర చాలా రోజులున్నాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 9 (ASV) »
King James Version (KJV)
Acts 9 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 9 (GW) »
Berean Bible (BSB)
Acts 9 (BSB) »
World English Bible (WEB)
Acts 9 (WEB) »
French Bible (LSG)
Actes 9 (LSG) »
German Bible (LUTH1912)
Apostelgeschichte 9 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Atos 9 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 9 (RVA) »
Italian Bible (RIV)
Atti 9 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 9 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 9 (CUVT) »
Albanian Bible (ALB)
Veprat e Apostujve 9 (ALB) »
Russian Bible (RUSV)
Деяния 9 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 9 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 9 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 9 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 9 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List