అపొస్తలుల కార్యములు Chapter 14 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 14:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు.

అపొస్తలుల కార్యములు 14:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు.

అపొస్తలుల కార్యములు 14:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.

అపొస్తలుల కార్యములు 14:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి కొందరు యూదుల పక్షం, మరి కొందరు అపొస్తలుల పక్షం చేరారు.

అపొస్తలుల కార్యములు 14:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు.

అపొస్తలుల కార్యములు 14:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.

అపొస్తలుల కార్యములు 14:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు.

అపొస్తలుల కార్యములు 14:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు.

అపొస్తలుల కార్యములు 14:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి,

అపొస్తలుల కార్యములు 14:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.

అపొస్తలుల కార్యములు 14:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి,

అపొస్తలుల కార్యములు 14:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు.

అపొస్తలుల కార్యములు 14:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు.

అపొస్తలుల కార్యములు 14:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి

అపొస్తలుల కార్యములు 14:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.

అపొస్తలుల కార్యములు 14:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు.

అపొస్తలుల కార్యములు 14:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.”

అపొస్తలుల కార్యములు 14:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.

అపొస్తలుల కార్యములు 14:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతియొకయ, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనాన్ని తమ వైపు తిప్పుకుని, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకుని పట్టణం బయటికి అతనిని ఈడ్చివేశారు.

అపొస్తలుల కార్యములు 14:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరుసటి రోజు బర్నబాతో కూడ దెర్బేకు వెళ్ళిపోయాడు.

అపొస్తలుల కార్యములు 14:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు.

అపొస్తలుల కార్యములు 14:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.

అపొస్తలుల కార్యములు 14:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.

అపొస్తలుల కార్యములు 14:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత పిసిదియ ప్రాంతమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు.

అపొస్తలుల కార్యములు 14:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు.

అపొస్తలుల కార్యములు 14:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకుని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు.

అపొస్తలుల కార్యములు 14:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు.

అపొస్తలుల కార్యములు 14:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 14 (ASV) »
King James Version (KJV)
Acts 14 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 14 (GW) »
Berean Bible (BSB)
Acts 14 (BSB) »
World English Bible (WEB)
Acts 14 (WEB) »
French Bible (LSG)
Actes 14 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 14 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 14 (RVA) »
Italian Bible (RIV)
Atti 14 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 14 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 14 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 14 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 14 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 14 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 14 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List