అపొస్తలుల కార్యములు Chapter 12 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 12:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 12:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.

అపొస్తలుల కార్యములు 12:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.

అపొస్తలుల కార్యములు 12:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు.

అపొస్తలుల కార్యములు 12:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు.

అపొస్తలుల కార్యములు 12:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.

అపొస్తలుల కార్యములు 12:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి.

అపొస్తలుల కార్యములు 12:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు.

అపొస్తలుల కార్యములు 12:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 12:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.

అపొస్తలుల కార్యములు 12:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 12:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీన్ని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు.

అపొస్తలుల కార్యములు 12:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది.

అపొస్తలుల కార్యములు 12:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది.

అపొస్తలుల కార్యములు 12:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు వారు ఆమెను “నువ్వు పిచ్చిదానివి” అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, “అతని దూత అయి ఉండవచ్చు” అన్నారు.

అపొస్తలుల కార్యములు 12:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు.

అపొస్తలుల కార్యములు 12:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకూ సోదరులకూ ఈ విషయాలు తెలియజేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు.

అపొస్తలుల కార్యములు 12:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాభరాపడ్డారు.

అపొస్తలుల కార్యములు 12:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హేరోదు అతని కోసం వెతికి కనబడక పోయేసరికి కావలి వారిని ప్రశ్నించి వారికి మరణ శిక్ష విధించాడు. ఆ తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్ళి అక్కడ నివసించాడు.

అపొస్తలుల కార్యములు 12:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పట్లో తూరు, సీదోను వాసులపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి, రాజు దగ్గరకి వెళ్ళారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయాలని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్తును వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉంది.

అపొస్తలుల కార్యములు 12:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చాడు.

అపొస్తలుల కార్యములు 12:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు.

అపొస్తలుల కార్యములు 12:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.

అపొస్తలుల కార్యములు 12:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించింది.

అపొస్తలుల కార్యములు 12:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బర్నబా, సౌలు యెరూషలేములో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 12 (ASV) »
King James Version (KJV)
Acts 12 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 12 (GW) »
Berean Bible (BSB)
Acts 12 (BSB) »
World English Bible (WEB)
Acts 12 (WEB) »
French Bible (LSG)
Actes 12 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 12 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 12 (RVA) »
Italian Bible (RIV)
Atti 12 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 12 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 12 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 12 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 12 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 12 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 12 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 12 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List