అపొస్తలుల కార్యములు Chapter 3 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 3:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 3:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు.

అపొస్తలుల కార్యములు 3:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.

అపొస్తలుల కార్యములు 3:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు.

అపొస్తలుల కార్యములు 3:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు.

అపొస్తలుల కార్యములు 3:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని

అపొస్తలుల కార్యములు 3:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.

అపొస్తలుల కార్యములు 3:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.

అపొస్తలుల కార్యములు 3:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.

అపొస్తలుల కార్యములు 3:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.

అపొస్తలుల కార్యములు 3:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.

అపొస్తలుల కార్యములు 3:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?

అపొస్తలుల కార్యములు 3:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ముందు ఆయనను తిరస్కరించారు.

అపొస్తలుల కార్యములు 3:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.

అపొస్తలుల కార్యములు 3:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.

అపొస్తలుల కార్యములు 3:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.

అపొస్తలుల కార్యములు 3:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.

అపొస్తలుల కార్యములు 3:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియజేసిన సంగతులను ఆయన ఇప్పుడు ఈ విధంగా నెరవేర్చాడు.

అపొస్తలుల కార్యములు 3:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.

అపొస్తలుల కార్యములు 3:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.

అపొస్తలుల కార్యములు 3:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం.

అపొస్తలుల కార్యములు 3:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే నిజంగా ఇలా అన్నాడు కదా, ‘ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.’

అపొస్తలుల కార్యములు 3:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ప్రవక్త చెప్పినదాన్ని పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమై పోతాడు.

అపొస్తలుల కార్యములు 3:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.

అపొస్తలుల కార్యములు 3:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.

అపొస్తలుల కార్యములు 3:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 3 (ASV) »
King James Version (KJV)
Acts 3 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 3 (GW) »
Berean Bible (BSB)
Acts 3 (BSB) »
World English Bible (WEB)
Acts 3 (WEB) »
French Bible (LSG)
Actes 3 (LSG) »
German Bible (LUTH1912)
Apostelgeschichte 3 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Atos 3 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 3 (RVA) »
Italian Bible (RIV)
Atti 3 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 3 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 3 (CUVT) »
Albanian Bible (ALB)
Veprat e Apostujve 3 (ALB) »
Russian Bible (RUSV)
Деяния 3 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 3 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 3 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 3 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 3 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List