అపొస్తలుల కార్యములు Chapter 4 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 4 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 4 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 4:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు.

అపొస్తలుల కార్యములు 4:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు.

అపొస్తలుల కార్యములు 4:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు.

అపొస్తలుల కార్యములు 4:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు.

అపొస్తలుల కార్యములు 4:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.

అపొస్తలుల కార్యములు 4:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 4:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు.

అపొస్తలుల కార్యములు 4:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా,

అపొస్తలుల కార్యములు 4:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా.

అపొస్తలుల కార్యములు 4:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు.

అపొస్తలుల కార్యములు 4:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది.

అపొస్తలుల కార్యములు 4:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”

అపొస్తలుల కార్యములు 4:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.

అపొస్తలుల కార్యములు 4:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.

అపొస్తలుల కార్యములు 4:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని,

అపొస్తలుల కార్యములు 4:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం.

అపొస్తలుల కార్యములు 4:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు.

అపొస్తలుల కార్యములు 4:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు.

అపొస్తలుల కార్యములు 4:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి.

అపొస్తలుల కార్యములు 4:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.

అపొస్తలుల కార్యములు 4:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు.

అపొస్తలుల కార్యములు 4:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.

అపొస్తలుల కార్యములు 4:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు.

అపొస్తలుల కార్యములు 4:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.

అపొస్తలుల కార్యములు 4:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు?

అపొస్తలుల కార్యములు 4:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.

అపొస్తలుల కార్యములు 4:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా

అపొస్తలుల కార్యములు 4:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు.

అపొస్తలుల కార్యములు 4:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా,

అపొస్తలుల కార్యములు 4:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’

అపొస్తలుల కార్యములు 4:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.

అపొస్తలుల కార్యములు 4:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు.

అపొస్తలుల కార్యములు 4:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది.

అపొస్తలుల కార్యములు 4:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.

అపొస్తలుల కార్యములు 4:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.

అపొస్తలుల కార్యములు 4:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’

అపొస్తలుల కార్యములు 4:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 4 (ASV) »
King James Version (KJV)
Acts 4 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 4 (GW) »
Berean Bible (BSB)
Acts 4 (BSB) »
World English Bible (WEB)
Acts 4 (WEB) »
French Bible (LSG)
Actes 4 (LSG) »
German Bible (LUTH1912)
Apostelgeschichte 4 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Atos 4 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 4 (RVA) »
Italian Bible (RIV)
Atti 4 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 4 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 4 (CUVT) »
Albanian Bible (ALB)
Veprat e Apostujve 4 (ALB) »
Russian Bible (RUSV)
Деяния 4 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 4 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 4 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 4 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 4 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List