అపొస్తలుల కార్యములు Chapter 7 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 7:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు.

అపొస్తలుల కార్యములు 7:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే, “సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై

అపొస్తలుల కార్యములు 7:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు’ అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 7:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి వెళ్ళి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు.

అపొస్తలుల కార్యములు 7:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఇందులో అతనికి కనీసం కాలుపెట్టేంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా, అతడికి సంతానం లేనపుడు అతనికీ, అతని తరువాత అతని సంతానానికీ దీన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు.

అపొస్తలుల కార్యములు 7:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారనీ, ఆ దేశస్థులు వారిని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారనీ చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 7:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేగాక వారు బానిసలుగా ఉండబోతున్న ఆ దేశాన్ని తాను శిక్షిస్తాననీ ఆ తరువాత వారు బయటికి వచ్చి ఈ స్థలం లో తనను ఆరాధిస్తారనీ దేవుడు చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 7:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అబ్రాహాముకు సున్నతితో కూడిన ఒక నిబంధనను ఇచ్చాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్ర మూలపురుషులనూ కని వాళ్లకి సున్నతి చేశారు.

అపొస్తలుల కార్యములు 7:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆ గోత్రకర్తలు అసూయతో యోసేపును ఐగుప్తులోకి అమ్మేశారు గాని, దేవుడతనికి తోడుగా ఉండి

అపొస్తలుల కార్యములు 7:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడి బాధలన్నిటిలో నుండి తప్పించాడు. ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయనూ జ్ఞానాన్నీ అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తు మీదా తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు.

అపొస్తలుల కార్యములు 7:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత ఐగుప్తు దేశమంతటి మీదా, కనాను దేశమంతటి మీదా తీవ్రమైన కరువూ, గొప్ప బాధలూ వచ్చాయి. కాబట్టి మన పితరులకు ఆహారం దొరకలేదు.

అపొస్తలుల కార్యములు 7:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తులో తిండి గింజలున్నాయని యాకోబు తెలుసుకుని మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు.

అపొస్తలుల కార్యములు 7:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తాను తెలియజేసుకున్నాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.

అపొస్తలుల కార్యములు 7:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యోసేపు తన తండ్రి యాకోబునూ, తన సొంత వారందరినీ పిలిపించాడు. వారు మొత్తం 75 మంది.

అపొస్తలుల కార్యములు 7:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు ఐగుప్తు వెళ్ళాడు. అతడూ మన పితరులూ అక్కడే చనిపోయారు.

అపొస్తలుల కార్యములు 7:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని షెకెము అనే ఊరికి తెచ్చి హమోరు సంతతి దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు.

అపొస్తలుల కార్యములు 7:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు.

అపొస్తలుల కార్యములు 7:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చివరికి యోసేపును గూర్చి తెలియని వేరొక రాజు ఐగుప్తులో అధికారానికి వచ్చేవరకూ అలా జరిగింది.

అపొస్తలుల కార్యములు 7:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రాజు మన జాతి ప్రజలని మోసగించి, వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పారేసేలా మన పూర్వీకులను బాధించాడు.

అపొస్తలుల కార్యములు 7:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు.

అపొస్తలుల కార్యములు 7:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకుని తన స్వంత కుమారుడిగా పెంచుకుంది.

అపొస్తలుల కార్యములు 7:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు.

అపొస్తలుల కార్యములు 7:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 7:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారిలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఆ ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు.

అపొస్తలుల కార్యములు 7:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి తన ప్రజలు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు.

అపొస్తలుల కార్యములు 7:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు.

అపొస్తలుల కార్యములు 7:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు, ‘మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు?

అపొస్తలుల కార్యములు 7:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు.

అపొస్తలుల కార్యములు 7:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు.

అపొస్తలుల కార్యములు 7:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.

అపొస్తలుల కార్యములు 7:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే అది చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దాన్ని స్పష్టంగా చూడ్డానికి దగ్గరికి వచ్చినపుడు

అపొస్తలుల కార్యములు 7:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి’ అన్న ప్రభువు మాట వినబడింది. మోషే వణికిపోతూ, అటు చూడడానికి సాహసించలేక పోయాడు.

అపొస్తలుల కార్యములు 7:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు అతనితో ఇలా అన్నాడు, ‘నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం.

అపొస్తలుల కార్యములు 7:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తులో ఉన్న నా ప్రజల యాతన చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రా, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను.’

అపొస్తలుల కార్యములు 7:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“‘మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడు?’ అని వారు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు.

అపొస్తలుల కార్యములు 7:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రంలో, అరణ్యంలో నలభై ఏళ్ళు అనేక అద్భుతాలనూ మహత్కార్యాలనూ సూచక క్రియలనూ చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకుని వచ్చాడు.

అపొస్తలుల కార్యములు 7:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నాలాటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరుల్లో నుండి లేవనెత్తుతాడు’ అని ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే.

అపొస్తలుల కార్యములు 7:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ అరణ్యంలోని సంఘంలో ఉన్నదీ మనకు ఇవ్వడానికి జీవవాక్యాలను తీసుకున్నదీ ఇతడే.

అపొస్తలుల కార్యములు 7:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మన పూర్వీకులు లోబడకుండా తిరస్కరించిన వ్యక్తి ఇతడే. వారు అతనిని తోసిపుచ్చి తమ హృదయాల్లో ఐగుప్తుకు తిరిగారు.

అపొస్తలుల కార్యములు 7:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారు ‘మా ముందర నడిచే దేవుళ్ళను మాకోసం ఏర్పాటు చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు’ అని అహరోనుతో అన్నారు.

అపొస్తలుల కార్యములు 7:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు.

అపొస్తలుల కార్యములు 7:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా ‘ఇశ్రాయేలీయులారా, నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?

అపొస్తలుల కార్యములు 7:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు చేసుకున్న ప్రతిమలను అంటే మొలెకు గుడారాన్నీ, రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడం కోసం మోసుకుపోయారు. కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.’

అపొస్తలుల కార్యములు 7:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది.

అపొస్తలుల కార్యములు 7:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన పూర్వీకులు దాన్ని తీసుకుని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చారు. అది దావీదు కాలం వరకూ ఉంది.

అపొస్తలుల కార్యములు 7:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు.

అపొస్తలుల కార్యములు 7:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని సొలొమోను మందిరం కట్టించాడు.

అపొస్తలుల కార్యములు 7:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.

అపొస్తలుల కార్యములు 7:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది?

అపొస్తలుల కార్యములు 7:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవన్నీ నా చేతిపనులు కావా? అని ప్రభువు అడుగుతున్నాడు.’

అపొస్తలుల కార్యములు 7:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.

అపొస్తలుల కార్యములు 7:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు.

అపొస్తలుల కార్యములు 7:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 7:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు.

అపొస్తలుల కార్యములు 7:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి

అపొస్తలుల కార్యములు 7:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు.

అపొస్తలుల కార్యములు 7:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి

అపొస్తలుల కార్యములు 7:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు.

అపొస్తలుల కార్యములు 7:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 7:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 7 (ASV) »
King James Version (KJV)
Acts 7 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 7 (GW) »
Berean Bible (BSB)
Acts 7 (BSB) »
World English Bible (WEB)
Acts 7 (WEB) »
French Bible (LSG)
Actes 7 (LSG) »
German Bible (LUTH1912)
Apostelgeschichte 7 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Atos 7 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 7 (RVA) »
Italian Bible (RIV)
Atti 7 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 7 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 7 (CUVT) »
Albanian Bible (ALB)
Veprat e Apostujve 7 (ALB) »
Russian Bible (RUSV)
Деяния 7 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 7 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 7 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 7 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 7 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List