అపొస్తలుల కార్యములు Chapter 27 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 27:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలునీ, మరికొందరు ఖైదీలనీ అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు.

అపొస్తలుల కార్యములు 27:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అగస్టస్ సైనిక దళంలోని ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియ లోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు.

అపొస్తలుల కార్యములు 27:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.

అపొస్తలుల కార్యములు 27:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.

అపొస్తలుల కార్యములు 27:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మురకు చేరాం.

అపొస్తలుల కార్యములు 27:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళబోతున్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు.

అపొస్తలుల కార్యములు 27:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము.

అపొస్తలుల కార్యములు 27:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతి కష్టంతో దాన్ని దాటి, ‘సురక్షిత ఆశ్రయాలు’ అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది.

అపొస్తలుల కార్యములు 27:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.

అపొస్తలుల కార్యములు 27:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పౌలు, “సోదరులారా, ఈ ప్రయాణం వలన సరకులకు, ఓడకు మాత్రమే కాక మనకూ ప్రాణహానీ, తీవ్ర నష్టం కలగబోతున్నదని నాకనిపిస్తుంది” అని వారిని హెచ్చరించాడు.

అపొస్తలుల కార్యములు 27:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.

అపొస్తలుల కార్యములు 27:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.

అపొస్తలుల కార్యములు 27:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫీనిక్సు చేరి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు.

అపొస్తలుల కార్యములు 27:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది.

అపొస్తలుల కార్యములు 27:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం.

అపొస్తలుల కార్యములు 27:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా ఓడ నడిపించాం. బహు కష్టంగా ఓడకు కట్టిన పడవను కాపాడుకోగలిగాం.

అపొస్తలుల కార్యములు 27:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుకతిప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకుపోయారు.

అపొస్తలుల కార్యములు 27:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు.

అపొస్తలుల కార్యములు 27:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.

అపొస్తలుల కార్యములు 27:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొన్ని రోజులపాటు సూర్యుడుగానీ నక్షత్రాలుగానీ కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది.

అపొస్తలుల కార్యములు 27:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు చాలాకాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, “అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది.

అపొస్తలుల కార్యములు 27:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు.

అపొస్తలుల కార్యములు 27:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,

అపొస్తలుల కార్యములు 27:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 27:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను.

అపొస్తలుల కార్యములు 27:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 27:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పద్నాలుగవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్థరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి

అపొస్తలుల కార్యములు 27:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు.

అపొస్తలుల కార్యములు 27:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 27:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు.

అపొస్తలుల కార్యములు 27:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు పౌలు “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు” అని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 27:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు.

అపొస్తలుల కార్యములు 27:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్లవారుతుండగా పౌలు, “పద్నాలుగు రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు.

అపొస్తలుల కార్యములు 27:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు” అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు.

అపొస్తలుల కార్యములు 27:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకుని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు.

అపొస్తలుల కార్యములు 27:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు.

అపొస్తలుల కార్యములు 27:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.

అపొస్తలుల కార్యములు 27:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తిని తృప్తి పొందిన తరువాత, గోదుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు.

అపొస్తలుల కార్యములు 27:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేకపోయారు, కానీ తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడను అందులోకి నడిపించాలని ఆలోచించారు.

అపొస్తలుల కార్యములు 27:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వారు గుర్తు పట్టలేకపోయారు వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు.

అపొస్తలుల కార్యములు 27:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది.

అపొస్తలుల కార్యములు 27:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఖైదీల్లో ఎవరూ ఈదుకుని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని,

అపొస్తలుల కార్యములు 27:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ,

అపొస్తలుల కార్యములు 27:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 27 (ASV) »
King James Version (KJV)
Acts 27 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 27 (GW) »
Berean Bible (BSB)
Acts 27 (BSB) »
World English Bible (WEB)
Acts 27 (WEB) »
French Bible (LSG)
Actes 27 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 27 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 27 (RVA) »
Italian Bible (RIV)
Atti 27 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 27 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 27 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 27 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 27 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 27 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 27 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 27 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List