సామెత Chapter 25 TELIRV Bible Verse Images

సామెత 25 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సామెత 25 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సామెత 25:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవికూడా సొలొమోను సామెతలే. యూదారాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసారు.

సామెత 25:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విషయాన్ని గోప్యంగా ఉంచడం దేవునికి ఘనత. సంగతిని పరిశోధించడం రాజులకు ఘనత.

సామెత 25:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం.

సామెత 25:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు.

సామెత 25:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది.

సామెత 25:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు.

సామెత 25:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే “ఈ పైచోటికి రా” అని అతడు నీతో చెప్పడం మంచిది కదా.

సామెత 25:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి “ఇక నువ్వేమి చేస్తావు?” అని నీతో అంటాడు కదా.

సామెత 25:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు.

సామెత 25:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు.

సామెత 25:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది.

సామెత 25:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు.

సామెత 25:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.

సామెత 25:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం.

సామెత 25:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సహనంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టగలదు.

సామెత 25:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో.

సామెత 25:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాటిమాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్లకు. అతడు విసికిపోయి నిన్ను ద్వేషిస్తాడేమో.

సామెత 25:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు.

సామెత 25:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కష్టకాలంలో విశ్వాస ఘాతకుణ్ణి ఆశ్రయించడం విరిగిన పన్నుతో, కీలు వసిలిన కాలుతో సమానం.

సామెత 25:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుఃఖితుడి ఎదుట పాటలు వినిపించేవాడు చలి రోజున పైబట్ట తీసివేసే వాడితోను సూరేకారం మీద చిరక పోసే వాడితోను సమానం.

సామెత 25:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు.

సామెత 25:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు.

సామెత 25:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది.

సామెత 25:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి.

సామెత 25:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దప్పిగొన్నవాడికి చల్లని నీరు ఎలాగో దూరదేశం నుండి వచ్చిన శుభసమాచారం అలా.

సామెత 25:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కలకలు అయిపోయిన ఊట, చెడిపోయిన నీటిబుగ్గ, ఉత్తముడు దుష్టుడికి లోబడి ఉండడం ఒకటే.

సామెత 25:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే.

సామెత 25:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే.

Available Bible Translations

American Standard Version
Proverbs 25 (ASV) »
King James Version
Proverbs 25 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 25 (GW) »
World English Bible
Proverbs 25 (WEB) »
Louis Segond 1910
Proverbes 25 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नीतिवचन 25 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕਹਾਉਤਾਂ 25 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হিতোপদেশ 25 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நீதிமொழிகள் 25 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नीतिसूत्रे 25 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નીતિવચનો 25 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 25 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَمْثَالٌ 25 (AVD) »
תנ ך עברי מודרני
משלי 25 (HEB) »
Bíblia Sagrada Português
Provérbios 25 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Châm Ngôn 25 (VIE) »
Reina Valera Antigua
Proverbios 25 (RVA) »
La Sacra Bibbia
Proverbi 25 (RIV) »
圣 经 简体中文和合本
箴 言 25 (CUVS) »
聖 經 繁體中文和合本
箴 言 25 (CUVT) »
Библия на русском
Притчи 25 (RUSV) »
Українська Біблія
Екклезіяст 25 (UKR) »
Szent Biblia - Magyar
Példabeszédek 25 (KAR) »
Българска Библия
Притчи 25 (BULG) »
聖書 日本語
箴言 25 (JPN) »
Kitaabka Quduuska Ah
Maahmaahyadii 25 (SOM) »
De Heilige Schrift
Spreuken 25 (NLD) »

సామెత (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List