సామెత Chapter 16 TELIRV Bible Verse Images

సామెత 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సామెత 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సామెత 16:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.

సామెత 16:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు.

సామెత 16:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.

సామెత 16:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.

సామెత 16:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.

సామెత 16:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.

సామెత 16:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు.

సామెత 16:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం.

సామెత 16:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.

సామెత 16:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు నోటి నుండి దైవిక తీర్మానం వెలువడుతుంది. తీర్పు తీర్చునప్పుడు అతని మాట న్యాయం తప్పిపోదు.

సామెత 16:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
న్యాయమైన త్రాసు, తూకం రాళ్లు యెహోవా నియమించాడు. సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు.

సామెత 16:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే.

సామెత 16:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు.

సామెత 16:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజుకు కోపం వస్తే మరణం దాపురిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఆ కోపం చల్లారేలా చేస్తాడు.

సామెత 16:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది. అతని అనుగ్రహం వసంతకాలంలో వాన కురిసే మేఘం లాంటిది.

సామెత 16:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.

సామెత 16:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు.

సామెత 16:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.

సామెత 16:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.

సామెత 16:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.

సామెత 16:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి.

సామెత 16:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.

సామెత 16:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది.

సామెత 16:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.

సామెత 16:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది.

సామెత 16:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది.

సామెత 16:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది.

సామెత 16:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.

సామెత 16:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.

సామెత 16:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు.

సామెత 16:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి.

సామెత 16:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.

సామెత 16:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.

Available Bible Translations

American Standard Version
Proverbs 16 (ASV) »
King James Version
Proverbs 16 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 16 (GW) »
World English Bible
Proverbs 16 (WEB) »
Louis Segond 1910
Proverbes 16 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नीतिवचन 16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕਹਾਉਤਾਂ 16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হিতোপদেশ 16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நீதிமொழிகள் 16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नीतिसूत्रे 16 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નીતિવચનો 16 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَمْثَالٌ 16 (AVD) »
תנ ך עברי מודרני
משלי 16 (HEB) »
Bíblia Sagrada Português
Provérbios 16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Châm Ngôn 16 (VIE) »
Reina Valera Antigua
Proverbios 16 (RVA) »
La Sacra Bibbia
Proverbi 16 (RIV) »
圣 经 简体中文和合本
箴 言 16 (CUVS) »
聖 經 繁體中文和合本
箴 言 16 (CUVT) »
Библия на русском
Притчи 16 (RUSV) »
Українська Біблія
Екклезіяст 16 (UKR) »
Szent Biblia - Magyar
Példabeszédek 16 (KAR) »
Българска Библия
Притчи 16 (BULG) »
聖書 日本語
箴言 16 (JPN) »
Kitaabka Quduuska Ah
Maahmaahyadii 16 (SOM) »
De Heilige Schrift
Spreuken 16 (NLD) »

సామెత (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List