సామెత Chapter 3 TELIRV Bible Verse Images

సామెత 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సామెత 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సామెత 3:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

సామెత 3:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

సామెత 3:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

సామెత 3:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

సామెత 3:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

సామెత 3:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

సామెత 3:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

సామెత 3:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.

సామెత 3:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.

సామెత 3:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.

సామెత 3:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.

సామెత 3:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.

సామెత 3:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.

సామెత 3:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.

సామెత 3:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.

సామెత 3:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.

సామెత 3:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి.

సామెత 3:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.

సామెత 3:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.

సామెత 3:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.

సామెత 3:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.

సామెత 3:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.

సామెత 3:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.

సామెత 3:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.

సామెత 3:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు.

సామెత 3:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.

సామెత 3:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.

సామెత 3:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు.

సామెత 3:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.

సామెత 3:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు.

సామెత 3:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు.

సామెత 3:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు.

సామెత 3:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.

సామెత 3:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.

సామెత 3:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 3 (ASV) »
King James Version (KJV)
Proverbs 3 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 3 (GW) »
Berean Bible (BSB)
Proverbs 3 (BSB) »
World English Bible (WEB)
Proverbs 3 (WEB) »
French Bible (LSG)
Proverbes 3 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 3 (LUTH1912) »
Hebrew Bible (HEB)
משלי 3 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 3 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 3 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 3 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 3 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 3 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 3 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 3 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 3 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 3 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 3 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 3 (BULG) »
Japanese Bible (JPN)
箴言 3 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 3 (NORSK) »

సామెత (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List