సామెత Chapter 17 TELIRV Bible Verse Images

సామెత 17 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సామెత 17 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సామెత 17:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది.

సామెత 17:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిమంతుడైన సేవకుడు సిగ్గు కలిగించే కొడుకు మీద అధికారం సంపాదించుకుంటాడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచు కుంటాడు.

సామెత 17:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే.

సామెత 17:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు.

సామెత 17:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు.

సామెత 17:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే.

సామెత 17:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు.

సామెత 17:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది.

సామెత 17:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.

సామెత 17:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది.

సామెత 17:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు.

సామెత 17:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.

సామెత 17:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.

సామెత 17:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.

సామెత 17:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం.

సామెత 17:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా?

సామెత 17:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.

సామెత 17:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు.

సామెత 17:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కలహాలంటే ఇష్టం ఉన్నవాడు పాపాన్ని ప్రేమించేవాడు. తన ఇంటి వాకిళ్ళు ఎత్తు పెంచేవాడు ఎముకలు విరగడానికి కారణం అవుతాడు.

సామెత 17:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు.

సామెత 17:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిలేని వాడి తండ్రికి దుఃఖమే. తెలివిలేని వాణ్ణి కన్నవాడికి సంతోషం లేదు.

సామెత 17:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి.

సామెత 17:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు.

సామెత 17:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వివేకం గలవాడు తన ముఖాన్ని జ్ఞానం కేసి తిప్పుకుంటాడు. బుద్ధిలేని వాడి కళ్ళు భూమి కొనల వైపు తిరిగి ఉంటాయి.

సామెత 17:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు.

సామెత 17:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మంచి చేసే వారిని శిక్షించడం న్యాయం కాదు. యథార్థత గల ఉదాత్తులను కొరడాలతో కొట్టడం తగదు.

సామెత 17:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు.

సామెత 17:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.

Available Bible Translations

American Standard Version
Proverbs 17 (ASV) »
King James Version
Proverbs 17 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 17 (GW) »
World English Bible
Proverbs 17 (WEB) »
Louis Segond 1910
Proverbes 17 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नीतिवचन 17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕਹਾਉਤਾਂ 17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হিতোপদেশ 17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நீதிமொழிகள் 17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नीतिसूत्रे 17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નીતિવચનો 17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَمْثَالٌ 17 (AVD) »
תנ ך עברי מודרני
משלי 17 (HEB) »
Bíblia Sagrada Português
Provérbios 17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Châm Ngôn 17 (VIE) »
Reina Valera Antigua
Proverbios 17 (RVA) »
La Sacra Bibbia
Proverbi 17 (RIV) »
圣 经 简体中文和合本
箴 言 17 (CUVS) »
聖 經 繁體中文和合本
箴 言 17 (CUVT) »
Библия на русском
Притчи 17 (RUSV) »
Українська Біблія
Екклезіяст 17 (UKR) »
Szent Biblia - Magyar
Példabeszédek 17 (KAR) »
Българска Библия
Притчи 17 (BULG) »
聖書 日本語
箴言 17 (JPN) »
Kitaabka Quduuska Ah
Maahmaahyadii 17 (SOM) »
De Heilige Schrift
Spreuken 17 (NLD) »

సామెత (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List