సామెత Chapter 26 TELIRV Bible Verse Images

సామెత 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సామెత 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సామెత 26:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.

సామెత 26:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పిచ్చుక, రివ్వున ఎగిరిపోయే వానకోయిల ఎలా నేలకు దిగవో అలానే శాపానికి అర్హుడు కాని వాడికి శాపం తగలదు.

సామెత 26:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం.

సామెత 26:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖుడి మూఢత చొప్పున వాడికి జవాబు ఇవ్వద్దు. అలా ఇస్తే నువ్వు కూడా వాడి లాగానే ఉంటావు.

సామెత 26:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు.

సామెత 26:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం.

సామెత 26:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే.

సామెత 26:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం.

సామెత 26:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖుల నోట సామెత మత్తులో ఉన్న వాడి చేతిలో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.

సామెత 26:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిలేని వాణ్ణి, లేదా అటుగా వెళ్తూ ఉండే ఎవరో ఒకరిని కూలికి పెట్టుకునే వాడు అందరినీ గాయపరచే విలుకాడితో సమానం.

సామెత 26:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన మూర్ఖత్వాన్ని పదేపదే బయట పెట్టుకునే వాడు కక్కిన దాన్ని తినడానికి తిరిగే కుక్కతో సమానం.

సామెత 26:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.

సామెత 26:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు.

సామెత 26:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు.

సామెత 26:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం.

సామెత 26:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు.

సామెత 26:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం.

సామెత 26:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.

సామెత 26:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.

సామెత 26:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.

సామెత 26:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు.

సామెత 26:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి.

సామెత 26:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.

సామెత 26:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.

సామెత 26:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.

సామెత 26:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.

సామెత 26:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.

సామెత 26:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 26 (ASV) »
King James Version (KJV)
Proverbs 26 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 26 (GW) »
Berean Bible (BSB)
Proverbs 26 (BSB) »
World English Bible (WEB)
Proverbs 26 (WEB) »
French Bible (LSG)
Proverbes 26 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 26 (LUTH1912) »
Hebrew Bible (HEB)
משלי 26 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 26 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 26 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 26 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 26 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 26 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 26 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 26 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 26 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 26 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 26 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 26 (BULG) »
Japanese Bible (JPN)
箴言 26 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 26 (NORSK) »

సామెత (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List