కీర్తన Chapter 102 TELIRV Bible Verse Images

కీర్తన 102 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 102 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 102:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాధితుడి ప్రార్థన, దుఃఖంలో సోలిపోయి యెహోవా సన్నిధిలో పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు.

కీర్తన 102:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.

కీర్తన 102:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొగ లాగా నా రోజులు గతించిపోతున్నాయి. నా ఎముకలు కాలిపోతున్నట్టు ఉన్నాయి.

కీర్తన 102:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా గుండె కుంగిపోయింది. నేను వాడిన గడ్డి పరకలాగా ఉన్నాను. నేనేమీ తినలేక పోతున్నాను.

కీర్తన 102:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఆపకుండా మూలుగుతూ ఉండడం వలన చాలా చిక్కిపోయాను.

కీర్తన 102:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అడవి గూడబాతులాంటి వాణ్ణి. పాడుబడిపోయిన చోట్ల ఉండే గుడ్లగూబలాంటి వాణ్ణి.

కీర్తన 102:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాను.

కీర్తన 102:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రోజంతా నా విరోధులు నా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నన్ను నిందించేవాళ్ళు నా పేరు ఎత్తి శపిస్తారు.

కీర్తన 102:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బూడిదను అన్నం లాగా తింటున్నాను. కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను.

కీర్తన 102:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కోపాగ్నిని బట్టి నువ్వు నన్ను పైకెత్తి అవతల పారేశావు.

కీర్తన 102:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా రోజులు అదృశ్యమయ్యే నీడలా ఉన్నాయి, గడ్డిలాగా నేను వాడిపోయాను.

కీర్తన 102:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది.

కీర్తన 102:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది.

కీర్తన 102:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని రాళ్లంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని శిథిలాల దుమ్ము అంటే వారికి వాత్సల్యం.

కీర్తన 102:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, రాజ్యాలు నీ నామాన్ని గౌరవిస్తాయి, ప్రపంచ రాజులంతా నీ గొప్పదనాన్ని గౌరవిస్తారు.

కీర్తన 102:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు.

కీర్తన 102:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.

కీర్తన 102:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాబోయే తరాలకు ఇది రాసి పెట్టి ఉంటుంది, ఇంకా పుట్టని ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.

కీర్తన 102:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బందీల మూలుగులు వినడానికీ చావు ఖరారైన వాళ్ళను విడిపించడానికీ,

కీర్తన 102:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఉన్నతమైన పవిత్ర స్థలం నుంచి కిందికి చూశాడు, పరలోకం నుంచి భూమిని చూశాడు.

కీర్తన 102:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాను సేవించడానికి రాజ్యాలూ ప్రజలూ సమకూడినప్పుడు,

కీర్తన 102:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులు యెహోవా నామాన్ని సీయోనులో ప్రకటిస్తారు. యెరూషలేములో ఆయన కీర్తిని ప్రకటిస్తారు.

కీర్తన 102:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నా యవ్వనంలో నా బలం తీసేశాడు. నా రోజులు తగ్గించేసాడు.

కీర్తన 102:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.

కీర్తన 102:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.

కీర్తన 102:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.

కీర్తన 102:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.

కీర్తన 102:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సేవకుల పిల్లలు నిలిచి ఉంటారు. వారి వంశస్థులు నీ సన్నిధిలో జీవిస్తారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 102 (ASV) »
King James Version (KJV)
Psalms 102 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 102 (GW) »
Berean Bible (BSB)
Psalms 102 (BSB) »
World English Bible (WEB)
Psalms 102 (WEB) »
French Bible (LSG)
Psaumes 102 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 102 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 102 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 102 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 102 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 102 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 102 (RVA) »
Italian Bible (RIV)
Salmi 102 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 102 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 102 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 102 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 102 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 102 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 102 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 102 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 102 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 102 (NORSK) »

TELIRV Book Selection List