కీర్తన Chapter 71 TELIRV Bible Verse Images

కీర్తన 71 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 71 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 71:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు.

కీర్తన 71:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్ను రక్షించు. నీ నీతిని బట్టి నన్ను భద్రపరచు. శ్రద్ధగా ఆలకించి నన్ను రక్షించు.

కీర్తన 71:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు.

కీర్తన 71:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా దేవా, దుష్టుల చేతిలోనుండి నన్ను రక్షించు. కీడు చేసేవాళ్ళ, క్రూరుల పట్టులోనుండి నన్ను విడిపించు.

కీర్తన 71:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే.

కీర్తన 71:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.

కీర్తన 71:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.

కీర్తన 71:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.

కీర్తన 71:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముసలితనంలో నన్ను విడిచిపెట్టకు. నా బలం క్షీణించినప్పుడు నన్ను వదలకు.

కీర్తన 71:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం తీయాలని పొంచి ఉన్నవారు కూడబలుక్కుంటున్నారు.

కీర్తన 71:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు వాణ్ణి విడిచిపెట్టాడు, వాణ్ణి తప్పించేవాడు ఎవరూ లేరు. వాణ్ణి తరిమి పట్టుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు.

కీర్తన 71:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవా, నాకు దూరంగా ఉండవద్దు. నా దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా బయలుదేరు.

కీర్తన 71:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణం తీయాలని చూసే విరోధులు సిగ్గుపడి నశిస్తారు గాక. నాకు కీడుచేయాలని చూసేవాళ్ళు నిందలపాలై అవమానం పొందుతారు గాక.

కీర్తన 71:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.

కీర్తన 71:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.

కీర్తన 71:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువైన యెహోవా బలమైన కార్యాలను నేను వర్ణించడం మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వివరిస్తాను.

కీర్తన 71:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవా, నా బాల్యం నుండి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఇప్పటి వరకూ నీ ఆశ్చర్య కార్యాలను నేను తెలియజేస్తూనే ఉన్నాను.

కీర్తన 71:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవా, నేను తల నెరిసి ముసలివాడినైనా నన్ను విడిచిపెట్టకు. రాబోయే తరాలకు నీ బలప్రభావాల గురించి, ఇకపై పుట్టబోయే వాళ్లకు నీ శక్తియుక్తులను గురించి వివరిస్తాను.

కీర్తన 71:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవా, నీ నీతి ఎత్తయిన ఆకాశాలకన్నా ఉన్నతమైనది. ఘన కార్యాలు చేసిన దేవా, నీకు సాటి ఎవరు?

కీర్తన 71:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎన్నో కఠిన బాధలు మాకు కలిగేలా చేసిన దేవా, నువ్వు మమ్మల్ని మళ్ళీ జీవించేలా చేస్తావు. అగాధ లోయల్లో నుండి మళ్ళీ మమ్మల్ని లేవనెత్తుతావు.

కీర్తన 71:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా గొప్పతనాన్ని వృద్ధిచెయ్యి. నావైపు తిరిగి నన్ను ఆదరించు.

కీర్తన 71:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా దేవా, నేను నీ యథార్థ క్రియలను బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను.

కీర్తన 71:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదాలు, నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. నాకు హాని కలిగించాలని ప్రయత్నించే వాళ్ళు అవమానం పాలై అయోమయంలో ఉన్నారు.

కీర్తన 71:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 71 (ASV) »
King James Version (KJV)
Psalms 71 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 71 (GW) »
Berean Bible (BSB)
Psalms 71 (BSB) »
World English Bible (WEB)
Psalms 71 (WEB) »
French Bible (LSG)
Psaumes 71 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 71 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 71 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 71 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 71 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 71 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 71 (RVA) »
Italian Bible (RIV)
Salmi 71 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 71 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 71 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 71 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 71 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 71 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 71 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 71 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 71 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 71 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 71 (NORSK) »

TELIRV Book Selection List