కీర్తన Chapter 106 TELIRV Bible Verse Images

కీర్తన 106 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 106 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 106:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.

కీర్తన 106:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు?

కీర్తన 106:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు.

కీర్తన 106:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ,

కీర్తన 106:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు.

కీర్తన 106:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము.

కీర్తన 106:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు.

కీర్తన 106:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా తన మహా పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్నిబట్టి వారిని రక్షించాడు.

కీర్తన 106:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు.

కీర్తన 106:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు.

కీర్తన 106:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు.

కీర్తన 106:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు.

కీర్తన 106:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు.

కీర్తన 106:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు.

కీర్తన 106:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు.

కీర్తన 106:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమ శిబిరంలో మోషేపైనా యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైనా అసూయపడ్డారు.

కీర్తన 106:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది.

కీర్తన 106:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది.

కీర్తన 106:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హోరేబులో వారు దూడను చేయించుకున్నారు. పోత పోసిన విగ్రహానికి మొక్కారు.

కీర్తన 106:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు.

కీర్తన 106:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను

కీర్తన 106:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు.

కీర్తన 106:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు.

కీర్తన 106:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఆయన మాట నమ్మలేదు.

కీర్తన 106:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు.

కీర్తన 106:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి,

కీర్తన 106:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చడానికి, దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారిపై చెయ్యి ఎత్తాడు.

కీర్తన 106:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు బయల్పెయోరును హత్తుకుని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు.

కీర్తన 106:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది.

కీర్తన 106:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది.

కీర్తన 106:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిత్యం తరాలన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది.

కీర్తన 106:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది.

కీర్తన 106:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు. ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు.

కీర్తన 106:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు.

కీర్తన 106:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు.

కీర్తన 106:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.

కీర్తన 106:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.

కీర్తన 106:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.

కీర్తన 106:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు.

కీర్తన 106:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు.

కీర్తన 106:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. పగవారు వారిని ఏలారు.

కీర్తన 106:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శత్రువులు వారిని బాధపెట్టారు. వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు.

కీర్తన 106:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనేక మార్లు ఆయన వారిని విడిపించాడు. అయినా వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ పాపం మూలంగా హీనదశకు వెళ్ళిపోయారు.

కీర్తన 106:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు.

కీర్తన 106:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన నిబంధన విశ్వాస్యతను బట్టి వారిని కరుణించాడు.

కీర్తన 106:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు.

కీర్తన 106:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.

కీర్తన 106:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగాలకూ స్తుతినొందు గాక. ప్రజలందరూ ఆమేన్‌ అందురు గాక. యెహోవాను స్తుతించండి.

Available Bible Translations

American Standard Version
Psalms 106 (ASV) »
King James Version
Psalms 106 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 106 (GW) »
World English Bible
Psalms 106 (WEB) »
Louis Segond 1910
Psaumes 106 (LSG) »
Luther Bibel 1912
Psalm 106 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 106 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 106 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 106 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 106 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 106 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગીતશાસ્ત્ર 106 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 106 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 106 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 106 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 106 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 106 (VIE) »
Reina Valera Antigua
Salmos 106 (RVA) »
La Sacra Bibbia
Salmi 106 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 106 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 106 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 106 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 106 (SV1917) »
Библия на русском
Псалтирь 106 (RUSV) »
Українська Біблія
Псалми 106 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 106 (KAR) »
Българска Библия
Псалми 106 (BULG) »
聖書 日本語
詩篇 106 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 106 (SOM) »
De Heilige Schrift
Psalmen 106 (NLD) »
Dansk Bibel 1871
Salme 106 (DA1871) »

TELIRV Book Selection List