కీర్తన Chapter 89 TELIRV Bible Verse Images

కీర్తన 89 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 89 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 89:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎజ్రా వంశం వాడైన ఏతాను దైవ ధ్యానం. యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.

కీర్తన 89:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు.

కీర్తన 89:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.

కీర్తన 89:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. సెలా.

కీర్తన 89:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను ప్రస్తుతిస్తాయి, పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతున్నాయి.

కీర్తన 89:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశాల్లో యెహోవాకు సాటి ఎవడు? దైవపుత్రుల్లో యెహోవాలాంటి వాడెవడు?

కీర్తన 89:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు. తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలుగొలిపే వాడు.

కీర్తన 89:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.

కీర్తన 89:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.

కీర్తన 89:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చచ్చిన దానితో సమానంగా నువ్వు రాహాబును నలిపేశావు. నీ బాహుబలంతో నీ శత్రువులను చెదరగొట్టి వేశావు.

కీర్తన 89:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు.

కీర్తన 89:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.

కీర్తన 89:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.

కీర్తన 89:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.

కీర్తన 89:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.

కీర్తన 89:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ నామాన్ని బట్టి వాళ్ళు రోజంతా ఆనందిస్తారు, నీ నీతిలో వాళ్ళు నిన్ను పొగడుతారు.

కీర్తన 89:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది.

కీర్తన 89:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా డాలు యెహోవాది. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధుడు.

కీర్తన 89:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు. నువ్విలా అన్నావు, నేను ఒక శూరుడికి కిరీటం పెట్టాను. ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను.

కీర్తన 89:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.

కీర్తన 89:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది.

కీర్తన 89:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు.

కీర్తన 89:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.

కీర్తన 89:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.

కీర్తన 89:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.

కీర్తన 89:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.

కీర్తన 89:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.

కీర్తన 89:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.

కీర్తన 89:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.

కీర్తన 89:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞలను అనుసరించకపోతే,

కీర్తన 89:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,

కీర్తన 89:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.

కీర్తన 89:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నా కృపను అతని నుంచి తీసివేయను. నామాట తప్పను.

కీర్తన 89:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.

కీర్తన 89:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది

కీర్తన 89:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.

కీర్తన 89:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. సెలా.

కీర్తన 89:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.

కీర్తన 89:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.

కీర్తన 89:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడు చేశావు.

కీర్తన 89:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దారిన పోయేవాళ్ళంతా అతన్ని దోచుకున్నారు. తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు.

కీర్తన 89:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు. అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు.

కీర్తన 89:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని కత్తిమొన తొలగించావు యుద్దంలో అతన్ని నిలవకుండా చేశావు.

కీర్తన 89:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.

కీర్తన 89:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. సెలా.

కీర్తన 89:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, ఎంతకాలం? నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా? ఎంతకాలం నీ కోపం మంటలాగా మండుతూ ఉంటుంది?

కీర్తన 89:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?

కీర్తన 89:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? సెలా.

కీర్తన 89:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభూ, నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపా కార్యాలు ఏవి?

కీర్తన 89:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభూ, నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటి నుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో.

కీర్తన 89:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ శత్రువులు నిందలు మోపుతున్నారు, నీ అభిషిక్తుని అడుగులపై వాళ్ళు నిందలు మోపుతున్నారు.

కీర్తన 89:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగు గాక. ఆమేన్‌, ఆమేన్‌.

Available Bible Translations

American Standard Version
Psalms 89 (ASV) »
King James Version
Psalms 89 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 89 (GW) »
World English Bible
Psalms 89 (WEB) »
Louis Segond 1910
Psaumes 89 (LSG) »
Luther Bibel 1912
Psalm 89 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 89 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 89 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 89 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 89 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 89 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગીતશાસ્ત્ર 89 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 89 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 89 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 89 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 89 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 89 (VIE) »
Reina Valera Antigua
Salmos 89 (RVA) »
La Sacra Bibbia
Salmi 89 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 89 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 89 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 89 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 89 (SV1917) »
Библия на русском
Псалтирь 89 (RUSV) »
Українська Біблія
Псалми 89 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 89 (KAR) »
Българска Библия
Псалми 89 (BULG) »
聖書 日本語
詩篇 89 (JPN) »
Det Norsk Bibel
Salmene 89 (NORSK) »
Biblia Takatifu
Zaburi 89 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 89 (SOM) »
De Heilige Schrift
Psalmen 89 (NLD) »
Dansk Bibel 1871
Salme 89 (DA1871) »

TELIRV Book Selection List