కీర్తన Chapter 136 TELIRV Bible Verse Images

కీర్తన 136 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 136 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 136:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగేది ఆయన ఒక్కడే. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎడారి మార్గం గుండా ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఘనత వహించిన రాజులను ఆయన హతం చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమోరీయుల రాజైన సీహోనును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాషాను రాజైన ఓగును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళ దేశాన్ని మనకు వారసత్వ సంపదగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సొత్తుగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

కీర్తన 136:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 136 (ASV) »
King James Version (KJV)
Psalms 136 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 136 (GW) »
Berean Bible (BSB)
Psalms 136 (BSB) »
World English Bible (WEB)
Psalms 136 (WEB) »
French Bible (LSG)
Psaumes 136 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 136 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 136 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 136 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 136 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 136 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 136 (RVA) »
Italian Bible (RIV)
Salmi 136 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 136 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 136 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 136 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 136 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 136 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 136 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 136 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 136 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 136 (NORSK) »

TELIRV Book Selection List