కీర్తన Chapter 118 TELIRV Bible Verse Images

కీర్తన 118 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 118 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 118:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.

కీర్తన 118:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక.

కీర్తన 118:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక.

కీర్తన 118:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక.

కీర్తన 118:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.

కీర్తన 118:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?

కీర్తన 118:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను.

కీర్తన 118:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.

కీర్తన 118:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.

కీర్తన 118:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

కీర్తన 118:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

కీర్తన 118:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

కీర్తన 118:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు.

కీర్తన 118:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం.

కీర్తన 118:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది.

కీర్తన 118:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది.

కీర్తన 118:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను.

కీర్తన 118:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు.

కీర్తన 118:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను.

కీర్తన 118:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు.

కీర్తన 118:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు.

కీర్తన 118:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.

కీర్తన 118:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం.

కీర్తన 118:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.

కీర్తన 118:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.

కీర్తన 118:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము.

కీర్తన 118:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి.

కీర్తన 118:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను.

కీర్తన 118:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 118 (ASV) »
King James Version (KJV)
Psalms 118 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 118 (GW) »
Berean Bible (BSB)
Psalms 118 (BSB) »
World English Bible (WEB)
Psalms 118 (WEB) »
French Bible (LSG)
Psaumes 118 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 118 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 118 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 118 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 118 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 118 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 118 (RVA) »
Italian Bible (RIV)
Salmi 118 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 118 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 118 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 118 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 118 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 118 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 118 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 118 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 118 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 118 (NORSK) »

TELIRV Book Selection List