కీర్తన Chapter 107 TELIRV Bible Verse Images

కీర్తన 107 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 107 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 107:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.

కీర్తన 107:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,

కీర్తన 107:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.

కీర్తన 107:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు.

కీర్తన 107:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది.

కీర్తన 107:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.

కీర్తన 107:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు.

కీర్తన 107:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తన 107:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

కీర్తన 107:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు.

కీర్తన 107:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.

కీర్తన 107:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు.

కీర్తన 107:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు

కీర్తన 107:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు.

కీర్తన 107:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తన 107:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు.

కీర్తన 107:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.

కీర్తన 107:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు.

కీర్తన 107:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.

కీర్తన 107:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.

కీర్తన 107:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తన 107:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.

కీర్తన 107:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు

కీర్తన 107:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.

కీర్తన 107:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.

కీర్తన 107:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి ప్రాణం కరిగిపోయింది.

కీర్తన 107:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.

కీర్తన 107:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.

కీర్తన 107:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.

కీర్తన 107:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు.

కీర్తన 107:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తన 107:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.

కీర్తన 107:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను,

కీర్తన 107:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు.

కీర్తన 107:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు.

కీర్తన 107:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి,

కీర్తన 107:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు.

కీర్తన 107:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది. ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు.

కీర్తన 107:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు,

కీర్తన 107:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు.

కీర్తన 107:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు. వారి వంశాన్ని మందవలె వృద్ధి చేశాడు.

కీర్తన 107:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు.

కీర్తన 107:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారు గాక.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 107 (ASV) »
King James Version (KJV)
Psalms 107 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 107 (GW) »
Berean Bible (BSB)
Psalms 107 (BSB) »
World English Bible (WEB)
Psalms 107 (WEB) »
French Bible (LSG)
Psaumes 107 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 107 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 107 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 107 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 107 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 107 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 107 (RVA) »
Italian Bible (RIV)
Salmi 107 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 107 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 107 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 107 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 107 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 107 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 107 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 107 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 107 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 107 (NORSK) »

TELIRV Book Selection List