కీర్తన Chapter 78 TELIRV Bible Verse Images

కీర్తన 78 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 78 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 78:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసాపు కీర్తన. మస్కిల్ (దైవధ్యానం) నా ప్రజలారా, నా బోధను ఆలకించండి. నేను చెప్పే మాటలు వినండి.

కీర్తన 78:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను.

కీర్తన 78:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాకు తెలిసిన సంగతులను, మా పూర్వికులు మాకు తెలిపిన సంగతులను చెబుతాను.

కీర్తన 78:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం.

కీర్తన 78:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు.

కీర్తన 78:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు.

కీర్తన 78:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి.

కీర్తన 78:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.

కీర్తన 78:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎఫ్రాయిము గోత్రం వారు విల్లంబులు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ యుద్ధం జరిగిన రోజు వెనక్కి తిరిగి పారిపోయారు.

కీర్తన 78:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.

కీర్తన 78:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన చేసిన కార్యాలూ ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలూ వారు మర్చి పోయారు.

కీర్తన 78:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు.

కీర్తన 78:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు.

కీర్తన 78:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు.

కీర్తన 78:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు.

కీర్తన 78:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు.

కీర్తన 78:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు.

కీర్తన 78:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు.

కీర్తన 78:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా?

కీర్తన 78:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు.

కీర్తన 78:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది.

కీర్తన 78:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణలో నమ్మకం పెట్టుకోలేదు.

కీర్తన 78:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడు.

కీర్తన 78:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు.

కీర్తన 78:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు.

కీర్తన 78:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశంలో తూర్పు గాలి విసిరేలా చేశాడు. తన బలంతో దక్షిణపు గాలి రప్పించాడు.

కీర్తన 78:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ధూళి అంత విస్తారంగా మాంసాన్నీ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా పక్షులనూ ఆయన వారి కోసం కురిపించాడు.

కీర్తన 78:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి వారి శిబిరం మధ్యలో వారి గుడారాల చుట్టూ రాలి పడ్డాయి.

కీర్తన 78:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కడుపారా తిన్నారు. వారు దేని కోసం వెంపర్లాడారో దాన్ని ఆయన అనుగ్రహించాడు.

కీర్తన 78:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే, వారి ఆశ తీరక ముందే, అంటే ఆహారం ఇంకా వారి నోటిలో ఉండగానే,

కీర్తన 78:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి మీద దేవుని కోపం చెలరేగింది. వారిలో బలమైన వారిని ఆయన సంహరించాడు. ఇశ్రాయేలు యువకులు కూలిపోయేలా చేశాడు.

కీర్తన 78:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ వచ్చారు. ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి ఆయన్ని నమ్మలేదు.

కీర్తన 78:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆయన వారి రోజులు తక్కువ చేశాడు. వారి సంవత్సరాలు భయంతో నింపాడు.

కీర్తన 78:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు.

కీర్తన 78:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు.

కీర్తన 78:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వారు తమ నోటితో పైపైనే ఆయన్ని స్తుతించారు. తమ నాలుకలతో ఆయన ఎదుట అబద్ధాలు పలికారు.

కీర్తన 78:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారి హృదయం ఆయన మీద నిలుపుకోలేదు. ఆయన నిబంధనను నమ్మకంగా పాటించలేదు.

కీర్తన 78:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు.

కీర్తన 78:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారు కేవలం మానవమాత్రులనీ, వీచిన తరవాత తిరిగిరాని గాలిలాంటి వారనీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.

కీర్తన 78:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.

కీర్తన 78:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు.

కీర్తన 78:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ,

కీర్తన 78:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు.

కీర్తన 78:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు.

కీర్తన 78:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి.

కీర్తన 78:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారి పంటలను చీడపురుగులకిచ్చాడు. వారి కష్టఫలాన్ని మిడతలకు అప్పగించాడు.

కీర్తన 78:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వడగండ్ల చేత వారి ద్రాక్షతీగెలను, మంచు చేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేశాడు.

కీర్తన 78:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి పశువులపై వడగళ్ళు కురిపించాడు. వారి మందలపై పిడుగులు రాలాయి.

కీర్తన 78:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు.

కీర్తన 78:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు.

కీర్తన 78:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు.

కీర్తన 78:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.

కీర్తన 78:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు.

కీర్తన 78:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు.

కీర్తన 78:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు.

కీర్తన 78:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినప్పటికీ వారు మహోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను పాటించలేదు.

కీర్తన 78:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు.

కీర్తన 78:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు.

కీర్తన 78:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని చూసిన దేవుడు ఆగ్రహించి ఇశ్రాయేలును పూర్తిగా తోసిపుచ్చాడు.

కీర్తన 78:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిలోహు పట్టణంలో మందిరాన్ని, తాను మనుషులతో కలిసి నివసించిన గుడారాన్ని విడిచిపెట్టాడు.

కీర్తన 78:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు.

కీర్తన 78:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన వారసత్వం మీద కోపించాడు.

కీర్తన 78:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అగ్ని వారి యువకులను దహించివేసింది. వారి కన్యలకు పెండ్లిపాటలు లేకుండా పోయాయి.

కీర్తన 78:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి యాజకులు కత్తిపాలై కూలిపోయారు. విధవలైన వారి భార్యలు రోదనం చేయలేక పోయారు.

కీర్తన 78:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.

కీర్తన 78:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు.

కీర్తన 78:67 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు.

కీర్తన 78:68 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు.

కీర్తన 78:69 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా ఆయన తన మందిరాన్ని కట్టించాడు.

కీర్తన 78:70 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు.

కీర్తన 78:71 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు.

కీర్తన 78:72 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 78 (ASV) »
King James Version (KJV)
Psalms 78 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 78 (GW) »
Berean Bible (BSB)
Psalms 78 (BSB) »
World English Bible (WEB)
Psalms 78 (WEB) »
French Bible (LSG)
Psaumes 78 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 78 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 78 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 78 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 78 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 78 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 78 (RVA) »
Italian Bible (RIV)
Salmi 78 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 78 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 78 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 78 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 78 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 78 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 78 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 78 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 78 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 78 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 78 (NORSK) »

TELIRV Book Selection List