కీర్తన Chapter 119 TELIRV Bible Verse Images

కీర్తన 119 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 119 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 119:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆలెఫ్‌ ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.

కీర్తన 119:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.

కీర్తన 119:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.

కీర్తన 119:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు.

కీర్తన 119:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది!

కీర్తన 119:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు.

కీర్తన 119:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.

కీర్తన 119:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు.

కీర్తన 119:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బేత్‌ యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?

కీర్తన 119:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.

కీర్తన 119:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

కీర్తన 119:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.

కీర్తన 119:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.

కీర్తన 119:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.

కీర్తన 119:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.

కీర్తన 119:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను.

కీర్తన 119:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గీమెల్‌ నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను.

కీర్తన 119:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.

కీర్తన 119:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు.

కీర్తన 119:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.

కీర్తన 119:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు.

కీర్తన 119:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు.

కీర్తన 119:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు.

కీర్తన 119:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు.

కీర్తన 119:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాలెత్‌ నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు.

కీర్తన 119:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు.

కీర్తన 119:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను.

కీర్తన 119:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.

కీర్తన 119:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.

కీర్తన 119:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.

కీర్తన 119:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు.

కీర్తన 119:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను.

కీర్తన 119:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హే యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను.

కీర్తన 119:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.

కీర్తన 119:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.

కీర్తన 119:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.

కీర్తన 119:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.

కీర్తన 119:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు.

కీర్తన 119:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి.

కీర్తన 119:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు.

కీర్తన 119:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వావ్‌ యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు.

కీర్తన 119:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను.

కీర్తన 119:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను.

కీర్తన 119:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను.

కీర్తన 119:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.

కీర్తన 119:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను.

కీర్తన 119:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం.

కీర్తన 119:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను.

కీర్తన 119:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జాయిన్‌. నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు.

కీర్తన 119:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.

కీర్తన 119:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు.

కీర్తన 119:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను.

కీర్తన 119:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది.

కీర్తన 119:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు.

కీర్తన 119:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను.

కీర్తన 119:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు.

కీర్తన 119:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హేత్‌ యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను.

కీర్తన 119:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు.

కీర్తన 119:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను.

కీర్తన 119:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను.

కీర్తన 119:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు.

కీర్తన 119:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.

కీర్తన 119:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని.

కీర్తన 119:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తేత్ యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.

కీర్తన 119:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.

కీర్తన 119:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.

కీర్తన 119:67 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.

కీర్తన 119:68 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.

కీర్తన 119:69 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.

కీర్తన 119:70 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను.

కీర్తన 119:71 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.

కీర్తన 119:72 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.

కీర్తన 119:73 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోద్‌ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి.

కీర్తన 119:74 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.

కీర్తన 119:75 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు.

కీర్తన 119:76 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.

కీర్తన 119:77 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక.

కీర్తన 119:78 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.

కీర్తన 119:79 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.

కీర్తన 119:80 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక.

కీర్తన 119:81 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కఫ్‌ నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.

కీర్తన 119:82 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.

కీర్తన 119:83 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.

కీర్తన 119:84 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?

కీర్తన 119:85 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.

కీర్తన 119:86 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.

కీర్తన 119:87 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు.

కీర్తన 119:88 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు.

కీర్తన 119:89 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లామెద్‌. యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.

కీర్తన 119:90 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.

కీర్తన 119:91 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.

కీర్తన 119:92 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి.

కీర్తన 119:93 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు.

కీర్తన 119:94 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.

కీర్తన 119:95 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.

కీర్తన 119:96 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు.

కీర్తన 119:97 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేమ్‌ నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.

కీర్తన 119:98 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.

కీర్తన 119:99 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.

కీర్తన 119:100 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.

కీర్తన 119:101 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.

కీర్తన 119:102 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.

కీర్తన 119:103 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.

కీర్తన 119:104 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి.

కీర్తన 119:105 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నూన్‌ నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.

కీర్తన 119:106 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.

కీర్తన 119:107 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.

కీర్తన 119:108 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు

కీర్తన 119:109 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను.

కీర్తన 119:110 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు.

కీర్తన 119:111 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను.

కీర్తన 119:112 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.

కీర్తన 119:113 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సామెహ్‌ రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.

కీర్తన 119:114 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.

కీర్తన 119:115 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.

కీర్తన 119:116 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.

కీర్తన 119:117 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను.

కీర్తన 119:118 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.

కీర్తన 119:119 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం.

కీర్తన 119:120 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను.

కీర్తన 119:121 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయిన్‌ నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు.

కీర్తన 119:122 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక.

కీర్తన 119:123 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి.

కీర్తన 119:124 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు.

కీర్తన 119:125 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి

కీర్తన 119:126 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.

కీర్తన 119:127 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి.

కీర్తన 119:128 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం.

కీర్తన 119:129 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పే నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను.

కీర్తన 119:130 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి.

కీర్తన 119:131 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను.

కీర్తన 119:132 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు.

కీర్తన 119:133 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.

కీర్తన 119:134 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు.

కీర్తన 119:135 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు.

కీర్తన 119:136 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను.

కీర్తన 119:137 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాదె యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.

కీర్తన 119:138 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు.

కీర్తన 119:139 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.

కీర్తన 119:140 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది.

కీర్తన 119:141 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.

కీర్తన 119:142 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.

కీర్తన 119:143 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

కీర్తన 119:144 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి.

కీర్తన 119:145 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఖొఫ్‌ యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.

కీర్తన 119:146 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు.

కీర్తన 119:147 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను

కీర్తన 119:148 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.

కీర్తన 119:149 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.

కీర్తన 119:150 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు.

కీర్తన 119:151 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి.

కీర్తన 119:152 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను.

కీర్తన 119:153 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రేష్‌ నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు.

కీర్తన 119:154 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు.

కీర్తన 119:155 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.

కీర్తన 119:156 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.

కీర్తన 119:157 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను.

కీర్తన 119:158 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.

కీర్తన 119:159 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు.

కీర్తన 119:160 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి.

కీర్తన 119:161 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షీన్‌ అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.

కీర్తన 119:162 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.

కీర్తన 119:163 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.

కీర్తన 119:164 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.

కీర్తన 119:165 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు

కీర్తన 119:166 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను.

కీర్తన 119:167 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం.

కీర్తన 119:168 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను.

కీర్తన 119:169 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తౌ యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి.

కీర్తన 119:170 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు.

కీర్తన 119:171 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.

కీర్తన 119:172 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది.

కీర్తన 119:173 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక.

కీర్తన 119:174 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం.

కీర్తన 119:175 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక

కీర్తన 119:176 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 119 (ASV) »
King James Version (KJV)
Psalms 119 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 119 (GW) »
Berean Bible (BSB)
Psalms 119 (BSB) »
World English Bible (WEB)
Psalms 119 (WEB) »
French Bible (LSG)
Psaumes 119 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 119 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 119 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 119 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 119 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 119 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 119 (RVA) »
Italian Bible (RIV)
Salmi 119 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 119 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 119 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 119 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 119 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 119 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 119 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 119 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 119 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 119 (NORSK) »

TELIRV Book Selection List