నిర్గమకాండం Chapter 10 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో “ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను.

నిర్గమకాండం 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని, యెహోవాను నేనేనని మీరు తెలుసుకొనేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకూ, మనవలకూ తెలియజేయాలి” అని చెప్పాడు.

నిర్గమకాండం 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. “హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.

నిర్గమకాండం 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను.

నిర్గమకాండం 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి.

నిర్గమకాండం 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు” అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు.

నిర్గమకాండం 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఫరో సేవకులు ఫరోతో “ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?” అన్నారు.

నిర్గమకాండం 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మోషే అహరోనులను ఫరో దగ్గరికి తీసుకు వచ్చారు. ఫరో “మీరు వెళ్లి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి. ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు?” అని అడిగాడు.

నిర్గమకాండం 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే “మేము యెహోవాకు మహోత్సవం జరిపించాలి. కాబట్టి మా కొడుకులను, కూతుళ్ళను, మందలను, పశువులను వెంటబెట్టుకుని మా పిల్లలతో, పెద్దలతో కలసి వెళ్తాం” అని బదులిచ్చాడు.

నిర్గమకాండం 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ఫరో “యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది.

నిర్గమకాండం 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా” అన్నాడు. తరువాత వాళ్ళను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు.

నిర్గమకాండం 10:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మోషేతో “మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ అంటే వడగళ్ళ ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి” అని చెప్పాడు.

నిర్గమకాండం 10:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి.

నిర్గమకాండం 10:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు.

నిర్గమకాండం 10:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు.

నిర్గమకాండం 10:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. “నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను.

నిర్గమకాండం 10:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి” అన్నాడు.

నిర్గమకాండం 10:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు.

నిర్గమకాండం 10:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.

నిర్గమకాండం 10:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.

నిర్గమకాండం 10:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు.

నిర్గమకాండం 10:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది.

నిర్గమకాండం 10:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.

నిర్గమకాండం 10:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో మోషేను పిలిపించాడు. “మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలూ, పశువులూ మాత్రం ఇక్కడే ఉండాలి. మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు” అన్నాడు.

నిర్గమకాండం 10:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే “మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వ వలసి ఉంటుంది.

నిర్గమకాండం 10:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా పశువులు, మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకూ మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లోనుంచే వాటిని తీసుకోవాలి” అని చెప్పాడు.

నిర్గమకాండం 10:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు.

నిర్గమకాండం 10:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఫరో “బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా. ఇకపై నాకు కనిపించకు. నువ్వు నాకు ఎదురు పడిన రోజున తప్పకుండా చస్తావు” అన్నాడు.

నిర్గమకాండం 10:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే “సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను” అన్నాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Exodus 10 (ASV) »
King James Version (KJV)
Exodus 10 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 10 (GW) »
Berean Bible (BSB)
Exodus 10 (BSB) »
World English Bible (WEB)
Exodus 10 (WEB) »
French Bible (LSG)
Exode 10 (LSG) »
German Bible (LUTH1912)
Exodus 10 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਖ਼ਰੋਜ 10 (PANIRV) »
Hebrew Bible (HEB)
שמות 10 (HEB) »
Portuguese Bible (BSL)
Êxodo 10 (BSL) »
Vietnamese Bible (VIE)
Xuất Hành 10 (VIE) »
Spanish Bible (RVA)
Éxodo 10 (RVA) »
Italian Bible (RIV)
Esodo 10 (RIV) »
Chinese Simplified (CUVS)
出 埃 及 记 10 (CUVS) »
Chinese Traditional (CUVT)
出 埃 及 記 10 (CUVT) »
Albanian Bible (ALB)
Eksodi 10 (ALB) »
Swedish Bible (SV1917)
2 Mosebok 10 (SV1917) »
Russian Bible (RUSV)
Исход 10 (RUSV) »
Ukrainian Bible (UKR)
Вихід 10 (UKR) »
Hungarian Bible (KAR)
2 Mózes 10 (KAR) »
Bulgarian Bible (BULG)
Изход 10 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Mosebok 10 (NORSK) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List