నిర్గమకాండం Chapter 35 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 35 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 35 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 35:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవి.

నిర్గమకాండం 35:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మొదటి ఆరు రోజులు మీరు పని చెయ్యాలి. ఏడవ రోజు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఆ రోజు పని చేసే ప్రతివాడూ మరణ శిక్షకు పాత్రుడు.

నిర్గమకాండం 35:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్రాంతి దినాన మీరు మీ ఇళ్ళలో ఎలాంటి వంటకాలు వండుకోకూడదు.”

నిర్గమకాండం 35:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో ఇంకా ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినది ఏమిటంటే,

నిర్గమకాండం 35:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు,

నిర్గమకాండం 35:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీలం, ఊదా, ఎర్రరంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు, తుమ్మకర్ర,

నిర్గమకాండం 35:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీపాలు వెలిగించడానికి నూనె,

నిర్గమకాండం 35:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు,

నిర్గమకాండం 35:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, చెక్కిన రత్నాలు తీసుకురావాలి.

నిర్గమకాండం 35:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా, నైపుణ్యం, జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి.

నిర్గమకాండం 35:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పనులేవంటే, ఆయన నివాసం, నివాస మందిరం ఉండే గుడారం, దాని పైకప్పు, కొలుకులు, పలకలు, అడ్డ కర్రలు, స్తంభాలు, దిమ్మలు.

నిర్గమకాండం 35:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందసం పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణా పీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర,

నిర్గమకాండం 35:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామగ్రి, సన్నిధి రొట్టెలు,

నిర్గమకాండం 35:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెలుగు కోసం దీప స్థంభం, దాని సామగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలు, దీపాలకు నూనె.

నిర్గమకాండం 35:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర.

నిర్గమకాండం 35:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి, గంగాళం, దాని పీట.

నిర్గమకాండం 35:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు, ప్రవేశ ద్వారానికి తెర.

నిర్గమకాండం 35:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నివాస మందిరం కోసం, ఆవరణ కోసం మేకులు, వాటికి తాళ్లు.

నిర్గమకాండం 35:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పవిత్ర స్థలం లో సేవ చేయడానికి నేసిన వస్త్రాలు, అంటే, యాజకుడుగా సేవ చెయ్యడానికి అహరోనుకు, అతని కొడుకులకూ పవిత్ర వస్త్రాలు అనేవి.”

నిర్గమకాండం 35:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా మోషే ఎదుట నుండి వెళ్ళిపోయారు.

నిర్గమకాండం 35:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఎవరి హృదయం వాళ్ళను ప్రేరేపించినట్టు వాళ్ళంతా సన్నిధి గుడారం కోసం, దానిలోని సేవ అంతటికోసం, పవిత్ర వస్త్రాల కోసం అర్పణలు తెచ్చి యెహోవాకు సమర్పించారు.

నిర్గమకాండం 35:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమ హృదయాల్లో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారం వస్తువులు తీసుకువచ్చారు.

నిర్గమకాండం 35:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా, నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు వీటిలో ఏవేవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకువచ్చారు.

నిర్గమకాండం 35:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరూ యెహోవాకు కానుకలు తెచ్చారు. సేవలో ఏ పని కోసమైనా ఉపయోగపడే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దాన్ని తెచ్చారు.

నిర్గమకాండం 35:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నైపుణ్యం గల స్త్రీలు తమ చేతులతో వడికిన నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకు వచ్చారు.

నిర్గమకాండం 35:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేర్పు గల స్త్రీలు తమ జ్ఞానహృదయంతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు.

నిర్గమకాండం 35:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాయకులు ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, వెలగల రాళ్ళూ రత్నాలు,

నిర్గమకాండం 35:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు.

నిర్గమకాండం 35:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషేను చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలు ప్రజల్లో తమ మనస్సులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణను బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు.

నిర్గమకాండం 35:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు,

నిర్గమకాండం 35:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి.

నిర్గమకాండం 35:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.

నిర్గమకాండం 35:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు.

నిర్గమకాండం 35:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.

నిర్గమకాండం 35:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”

Available Bible Translations

American Standard Version
Exodus 35 (ASV) »
King James Version
Exodus 35 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 35 (GW) »
World English Bible
Exodus 35 (WEB) »
Louis Segond 1910
Exode 35 (LSG) »
Luther Bibel 1912
Exodus 35 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 35 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 35 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 35 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 35 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 35 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 35 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 35 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 35 (AVD) »
תנ ך עברי מודרני
שמות 35 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 35 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 35 (VIE) »
Reina Valera Antigua
Éxodo 35 (RVA) »
La Sacra Bibbia
Esodo 35 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 35 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 35 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 35 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 35 (SV1917) »
Библия на русском
Исход 35 (RUSV) »
Українська Біблія
Вихід 35 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 35 (KAR) »
Българска Библия
Изход 35 (BULG) »
Biblia Takatifu
Kutoka 35 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 35 (SOM) »
De Heilige Schrift
Exodus 35 (NLD) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List