నిర్గమకాండం Chapter 28 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 28 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 28 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 28:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నాకు యాజకత్వం చేయడానికి నీ సోదరుడు అహరోనును అతని కొడుకులు నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ దగ్గరికి పిలిపించు.

నిర్గమకాండం 28:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి గౌరవం, వైభవం కలిగేలా నీ సోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి.

నిర్గమకాండం 28:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోను నాకు యాజక సేవ జరిగించేలా నీవు అతణ్ణి ప్రత్యేక పరచడం కోసం అతని దుస్తులు కుట్టించాలి. నేను జ్ఞానాత్మతో నింపిన నిపుణులు అందరికీ ఆజ్ఞ జారీ చెయ్యి.

నిర్గమకాండం 28:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కుట్టవలసిన దుస్తులు ఇవి. వక్ష పతకం, ఏఫోదు, నిలువుటంగీ, రంగు దారాలతో కుట్టిన చొక్కా, తల పాగా, నడికట్టు. అతడు నాకు యాజకుడై యుండేలా వారు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు ప్రతిష్ఠిత దుస్తులు కుట్టించాలి.

నిర్గమకాండం 28:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కళాకారులు బంగారు, నీల, ధూమ్ర, రక్త వర్ణాలు గల నూలును సన్ననారను దీనికి ఉపయోగించాలి.

నిర్గమకాండం 28:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బంగారం నీల ధూమ్ర రక్త వర్ణాల ఏఫోదును పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చెయ్యాలి.

నిర్గమకాండం 28:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు భుజాలకు సరిపడేలా రెండు పై అంచుల్లో కూర్చిన పట్టీలు దానికి ఉండాలి.

నిర్గమకాండం 28:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏఫోదుపై ధరించడానికి పనితనంతో చేసిన నడికట్టు ఏకాండంగా ఉండి, బంగారంతో, నీల, ధూమ్ర, రక్త వర్ణాల నూలుతో, పేనిన సన్ననారతో కుట్టాలి.

నిర్గమకాండం 28:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను అంటే వారి పుట్టుక క్రమం చొప్పున

నిర్గమకాండం 28:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక రత్నం మీద ఆరు పేర్లు, రెండవ రత్నం మీద తక్కిన ఆరు పేర్లను చెక్కించాలి.

నిర్గమకాండం 28:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముద్ర మీద చెక్కిన పనిలాగా ఆ రెండు రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కి బంగారు కుదురుల్లో వాటిని పొదగాలి.

నిర్గమకాండం 28:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలీయులకు స్మారక సూచకమైన ఆ రెండు రత్నాలను ఏఫోదు భుజాలపై నిలపాలి. ఆ విధంగా అహరోను తన రెండు భుజాలపై యెహోవా సన్నిధిలో జ్ఞాపక సూచనగా ఆ పేర్లను ధరిస్తాడు.

నిర్గమకాండం 28:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బంగారు కుదురులను తయారు చెయ్యాలి.

నిర్గమకాండం 28:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేలిమి బంగారంతో రెండు అల్లిక గొలుసులను చెయ్యాలి. ఆ అల్లిక పనికి అల్లిన గొలుసులను తగిలించాలి.

నిర్గమకాండం 28:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కళాకారుని నైపుణ్యంతో న్యాయనిర్ణయ పతకాన్ని చెయ్యాలి. ఏఫోదు పని లాగా దాన్ని చెయ్యాలి. బంగారంతో, నీల ధూమ్ర రక్త వర్ణాల నూలుతో పేనిన సన్ననారతో దాన్ని చెయ్యాలి.

నిర్గమకాండం 28:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నలుచదరంగా ఉన్న ఆ పతకాన్ని మడత పెట్టాలి. దాని పొడవు జానెడు, వెడల్పు జానెడు ఉండాలి.

నిర్గమకాండం 28:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానిలో నాలుగు వరసల్లో రత్నాలుండేలా రత్నాల కుదుర్లు చెయ్యాలి. మొదటి వరస మాణిక్యం, గోమేధికం, మరకతం.

నిర్గమకాండం 28:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండో వరస పద్మరాగం, నీలం, వజ్రం.

నిర్గమకాండం 28:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడవది గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం.

నిర్గమకాండం 28:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగవ వరస గరుడ పచ్చ, సులిమాని రాయి, సూర్యకాంతం. వాటిని బంగారు కుదురుల్లో పొదగాలి.

నిర్గమకాండం 28:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్ల ప్రకారం పన్నెండు పేర్లు ఉండాలి. ముద్ర మీద చెక్కినట్టు వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ఉండాలి.

నిర్గమకాండం 28:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పతకాన్ని అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారంతో చెయ్యాలి.

నిర్గమకాండం 28:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పతకానికి రెండు బంగారు రింగులు చేసి

నిర్గమకాండం 28:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రెండు రింగులను పతకపు రెండు కొసలకు అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలించాలి.

నిర్గమకాండం 28:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు కుదురులకు తగిలించి ఏఫోదు ముందు వైపు భుజాలపై కట్టాలి.

నిర్గమకాండం 28:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు బంగారంతో రెండు రింగులు చేసి ఏఫోదు ముందు భాగంలో పతకం లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలించాలి.

నిర్గమకాండం 28:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు రెండు బంగారు రింగులు చేసి ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుపై దాని ముందు వైపు కింది భాగంలో ఏఫోదు రెండు భుజాలకు వాటిని తగిలించాలి.

నిర్గమకాండం 28:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పతకం ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుకు పైగా ఉండేలా బిగించాలి. అది ఏఫోదునుండి విడిపోకుండా ఉండేలా వారు దాని రింగులను నీలి దారంతో కట్టాలి.

నిర్గమకాండం 28:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా అహరోను పరిశుద్ధ స్థలం లోకి వెళ్ళినప్పుడల్లా అతడు తన రొమ్ము మీద న్యాయనిర్ణయ పతకంలోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ధరించాలి.

నిర్గమకాండం 28:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు ఈ న్యాయనిర్ణయ పతకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడల్లా అవి అతని రొమ్ముపై ఉంటాయి. అతడు యెహోవా సన్నిధిలో తన రొమ్ముపై ఇశ్రాయేలీయుల న్యాయనిర్ణయాలను నిత్యం భరిస్తాడు.

నిర్గమకాండం 28:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏఫోదు నిలువుటంగీని కేవలం నీలిరంగు దారంతోనే కుట్టాలి.

నిర్గమకాండం 28:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని మధ్య భాగంలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చినిగి పోకుండా మెడ కవచం లాగా దాని రంధ్రం చుట్టూ నేతపని గోటు ఉండాలి.

నిర్గమకాండం 28:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణాల దానిమ్మ కాయ ఆకారాలను, వాటి మధ్యలో బంగారు గంటలను నిలువు టంగీ చుట్టూ తగిలించాలి.

నిర్గమకాండం 28:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక్కొక్క బంగారు గంట, దానిమ్మకాయ ఆ నిలువుటంగీ కింది అంచున చుట్టూరా ఉండాలి.

నిర్గమకాండం 28:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సేవ చేసేటప్పుడు అహరోను దాని ధరించాలి. అతడు యెహోవా సన్నిధిలో పరిశుద్ధస్థలం లోకి ప్రవేశించేటప్పుడు అతడు చావకుండేలా వాటి చప్పుడు వినబడుతూ ఉండాలి.

నిర్గమకాండం 28:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్టు దానిపై ‘యెహోవాకు పరిశుద్ధం’ అనే మాట చెక్కాలి.

నిర్గమకాండం 28:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాగాపై ఉండేలా నీలి దారంతో దాన్ని కట్టాలి. అది పాగా ముందు వైపు ఉండాలి.

నిర్గమకాండం 28:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులు అర్పించే పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో వాటిలో ఇమిడి ఉన్న దోషాలను అహరోను భరించేలా అది అహరోను నుదిటిపై ఉండాలి. వారికి యెహోవా సన్నిధిలో ఆమోదం ఉండేలా అది నిత్యం అతని నుదుటిపై ఉండాలి.

నిర్గమకాండం 28:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చెయ్యాలి. సన్న నారతో పాగాను నేయాలి. నడికట్టును కూడా బుట్టాపనిగా చెయ్యాలి.

నిర్గమకాండం 28:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు అహరోను కుమారులకు చొక్కాలు కుట్టించాలి. వారికి నడికట్లు తయారు చెయ్యాలి. వారి ఘనత, వైభవాలు కలిగేలా వారికీ టోపీలు చెయ్యాలి.

నిర్గమకాండం 28:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగించాలి. వారు నాకు యాజకులయ్యేలా వారికి అభిషేకం చేసి, వారిని ప్రతిష్ఠించి పవిత్రపరచాలి.

నిర్గమకాండం 28:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి నగ్నతను కప్పుకొనేందుకు నీవు వారికి నారతో చేసిన లోదుస్తులు కుట్టించాలి.

నిర్గమకాండం 28:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.”

Available Bible Translations

American Standard Version
Exodus 28 (ASV) »
King James Version
Exodus 28 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 28 (GW) »
World English Bible
Exodus 28 (WEB) »
Louis Segond 1910
Exode 28 (LSG) »
Luther Bibel 1912
Exodus 28 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 28 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 28 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 28 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 28 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 28 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 28 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 28 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 28 (AVD) »
תנ ך עברי מודרני
שמות 28 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 28 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 28 (VIE) »
Reina Valera Antigua
Éxodo 28 (RVA) »
La Sacra Bibbia
Esodo 28 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 28 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 28 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 28 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 28 (SV1917) »
Библия на русском
Исход 28 (RUSV) »
Українська Біблія
Вихід 28 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 28 (KAR) »
Българска Библия
Изход 28 (BULG) »
Biblia Takatifu
Kutoka 28 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 28 (SOM) »
De Heilige Schrift
Exodus 28 (NLD) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List