నిర్గమకాండం Chapter 21 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 21 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 21 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 21:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు ఈ న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చెయ్యాలి.

నిర్గమకాండం 21:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరాలపాటు మీకు దాసుడుగా ఉండి, ఏడో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు,

నిర్గమకాండం 21:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్లవచ్చు. భార్యతో కలసి వస్తే వాడి భార్యను కూడా తీసుకుని వెళ్ళవచ్చు.

నిర్గమకాండం 21:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ వాడి యజమాని అతనికి భార్యగా ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు గానీ, కూతుళ్ళు గానీ పుట్టినట్టయితే ఆ భార్య, పిల్లలు ఆమె యజమానికి సొంతం అవుతారు, వాడు ఒంటరిగానే వెళ్లిపోవాలి.

నిర్గమకాండం 21:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ దాసుడు “నేను నా యజమానిని, నా భార్య పిల్లలను ప్రేమిస్తున్నాను, వాళ్ళను విడిచిపెట్టి విడుదల పొందను” అని తేటగా చెబితే

నిర్గమకాండం 21:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడి యజమాని అతణ్ణి న్యాయాధిపతి దగ్గరకి తీసుకు రావాలి. తరువాత ఆ యజమాని వాణ్ణి తలుపు దగ్గరికి గానీ, గుమ్మం దగ్గరికి గానీ తీసుకువచ్చి వాడి చెవిని సన్నని కదురుతో గుచ్చాలి. అప్పటి నుంచి వాడు ఎల్లకాలం ఆ యజమానికి దాసుడుగా ఉండిపోవాలి.

నిర్గమకాండం 21:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తన కూతురిని దాసిగా అమ్మేస్తే దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా వెళ్లిపోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు.

నిర్గమకాండం 21:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమెను భార్యగా ఉంచుకోదలచే ఆమె యజమానికి ఆమె నచ్చక పోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకు అవకాశం ఇవ్వాలి. యజమాని ఆమె పట్ల అన్యాయం జరిగించిన కారణంగా ఆమెను విదేశీయులకు అమ్మే హక్కు అతనికి ఉండదు.

నిర్గమకాండం 21:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యజమాని తన కొడుక్కి ఆమెను ఇస్తే తన కూతుళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడో అదే విధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి.

నిర్గమకాండం 21:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కొడుకు మరొకామెను చేసుకున్నా మొదటి ఆమెకు తిండి, బట్ట, సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు.

నిర్గమకాండం 21:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ మూడు విషయాల్లో ఏది తక్కువ చేసినా వెల ఏమీ చెల్లించకుండా ఆమె విడుదల పొందవచ్చు.

నిర్గమకాండం 21:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.

నిర్గమకాండం 21:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఉద్దేశపూర్వకంగా కాక, అనుకోకుండా వాడి ద్వారా ఆ హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాను.

నిర్గమకాండం 21:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఒకడు తన పొరుగువాడిపై కోపంతో, కుయుక్తితో వాణ్ణి చంపేసి నా బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందాలని చూస్తే వాణ్ణి బయటకు లాగి చంపాలి.

నిర్గమకాండం 21:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన తండ్రిని, తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.

నిర్గమకాండం 21:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మినా, తన దగ్గర అక్రమంగా ఉంచుకొన్నా వాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.

నిర్గమకాండం 21:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన తండ్రిని, తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు.

నిర్గమకాండం 21:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టి గానీ, పిడికిలితో గుద్దిగానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే,

నిర్గమకాండం 21:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత గాయపడ్డవాడు లేచి తన చేతికర్ర సాయంతో తిరుగుతుంటే అతణ్ణి కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయిన కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి, అతణ్ణి పూర్తిగా బాగుచేయించాలి.

నిర్గమకాండం 21:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా ఒకడు తన దాసుణ్ణి, దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతడు తప్పకుండా శిక్షకు అర్హుడు.

నిర్గమకాండం 21:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు. ఎందుకంటే ఆ దాసులు అతని సొమ్ము.

నిర్గమకాండం 21:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే, గర్భస్రావం కాక మరి ఏ ఇతర హానీ కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించినవాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి.

నిర్గమకాండం 21:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం,

నిర్గమకాండం 21:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు,

నిర్గమకాండం 21:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ.

నిర్గమకాండం 21:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తన దాసుణ్ణి గానీ, దాసిని గానీ కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే ఆ కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.

నిర్గమకాండం 21:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన దాసుడి, దాసి దంతం ఊడిపోయేలా కొట్టినప్పుడు ఆ దంతానికి పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.

నిర్గమకాండం 21:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరిదైనా ఎద్దు పురుషుణ్ణి గానీ, స్త్రీని గానీ పొడిచి చంపితే ఆ ఎద్దును కచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాలి. అలా చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు. ఈ విషయంలో ఎద్దు యజమానికి దోషం అంటదు.

నిర్గమకాండం 21:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయక పోవడం వల్ల దాని ద్వారా పురుషుడు గానీ, స్త్రీ గానీ చనిపోతే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు దాని యజమానికి మరణశిక్ష విధించాలి.

నిర్గమకాండం 21:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరణశిక్షకు బదులు జరిమానా విధిస్తే అతడు ఆ మొత్తం చెల్లించి తన ప్రాణం దక్కించుకోవాలి.

నిర్గమకాండం 21:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఎద్దు చిన్న పిల్లవాణ్ణి గానీ చిన్న పిల్లనుగానీ పొడిచినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది.

నిర్గమకాండం 21:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎద్దు దాసుణ్ణి గానీ, దాసిని గానీ పొడిచినప్పుడు ఆ దాసుల యజమానికి ఎద్దు యజమాని 30 తులాల వెండి చెల్లించాలి. ఇంకా ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.

నిర్గమకాండం 21:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక గొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు గానీ, గొయ్యి తవ్వి దానిపై కప్పు ఉంచక పోవడం వల్ల గానీ దానిలో వేరొకరి ఎద్దు గానీ, గాడిద గానీ పడి చనిపోతే

నిర్గమకాండం 21:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు ఆ నష్టానికి బాధ్యత వహించాలి. వాటి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి. అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతం అవుతుంది.

నిర్గమకాండం 21:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకరి ఎద్దు వేరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచినప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మి దానికి వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకోవాలి. చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి.

నిర్గమకాండం 21:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయకపోతే వాడు తప్పకుండా ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి, చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది.

Available Bible Translations

American Standard Version
Exodus 21 (ASV) »
King James Version
Exodus 21 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 21 (GW) »
World English Bible
Exodus 21 (WEB) »
Louis Segond 1910
Exode 21 (LSG) »
Luther Bibel 1912
Exodus 21 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 21 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 21 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 21 (AVD) »
תנ ך עברי מודרני
שמות 21 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 21 (VIE) »
Reina Valera Antigua
Éxodo 21 (RVA) »
La Sacra Bibbia
Esodo 21 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 21 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 21 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 21 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 21 (SV1917) »
Библия на русском
Исход 21 (RUSV) »
Українська Біблія
Вихід 21 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 21 (KAR) »
Българска Библия
Изход 21 (BULG) »
Biblia Takatifu
Kutoka 21 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 21 (SOM) »
De Heilige Schrift
Exodus 21 (NLD) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List