నిర్గమకాండం Chapter 8 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 8 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 8 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 8:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు.

నిర్గమకాండం 8:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను.

నిర్గమకాండం 8:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి.

నిర్గమకాండం 8:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి’ అని యెహోవా చెబుతున్నాడు.”

నిర్గమకాండం 8:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతో ‘నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు’ అని చెప్పు” అన్నాడు.

నిర్గమకాండం 8:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి.

నిర్గమకాండం 8:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.

నిర్గమకాండం 8:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజలను పంపిస్తాను” అని చెప్పాడు.

నిర్గమకాండం 8:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే “ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్ళలో ఉండకుండాా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే” అన్నాడు. అప్పుడు ఫరో “రేపే ఆ పని చెయ్యి” అని బదులిచ్చాడు.

నిర్గమకాండం 8:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే “మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది.

నిర్గమకాండం 8:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కప్పలు మీ నుండి, మీ ఇళ్ళ నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ళనుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి” అన్నాడు.

నిర్గమకాండం 8:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు.

నిర్గమకాండం 8:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్ళలో, బయటా, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి.

నిర్గమకాండం 8:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది.

నిర్గమకాండం 8:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు.

నిర్గమకాండం 8:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు” అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు.

నిర్గమకాండం 8:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి.

నిర్గమకాండం 8:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు

నిర్గమకాండం 8:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.

నిర్గమకాండం 8:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా మోషేతో “నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.

నిర్గమకాండం 8:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి.

నిర్గమకాండం 8:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.

నిర్గమకాండం 8:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు” అన్నాడు.

నిర్గమకాండం 8:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.

నిర్గమకాండం 8:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అని వాళ్ళతో చెప్పాడు.

నిర్గమకాండం 8:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే “అలా చేయడం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా.

నిర్గమకాండం 8:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకేమా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం” అని చెప్పాడు.

నిర్గమకాండం 8:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో “మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి” అన్నాడు.

నిర్గమకాండం 8:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే “నేను నీ దగ్గర నుండి వెళ్లి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు” అని చెప్పి

నిర్గమకాండం 8:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు.

నిర్గమకాండం 8:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి.

నిర్గమకాండం 8:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.

Available Bible Translations

American Standard Version
Exodus 8 (ASV) »
King James Version
Exodus 8 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 8 (GW) »
Berean Bible
Exodus 8 (BSB) »
World English Bible
Exodus 8 (WEB) »
Louis Segond 1910
Exode 8 (LSG) »
Luther Bibel 1912
Exodus 8 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 8 (AVD) »
תנ ך עברי מודרני
שמות 8 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 8 (VIE) »
Reina Valera Antigua
Éxodo 8 (RVA) »
La Sacra Bibbia
Esodo 8 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 8 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 8 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 8 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 8 (SV1917) »
Библия на русском
Исход 8 (RUSV) »
Українська Біблія
Вихід 8 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 8 (KAR) »
Българска Библия
Изход 8 (BULG) »
Biblia Takatifu
Kutoka 8 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 8 (SOM) »
De Heilige Schrift
Exodus 8 (NLD) »
Dansk Bibel 1871
2 Mosebog 8 (DA1871) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List