నిర్గమకాండం Chapter 40 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 40 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 40 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 40:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.

నిర్గమకాండం 40:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి.

నిర్గమకాండం 40:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ శాసనాల పెట్టెను నిలబెట్టి దాన్ని అడ్డ తెరతో మూసి ఉంచాలి.

నిర్గమకాండం 40:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బల్లను లోపలికి తెచ్చి దాని మీద ఉంచవలసిన వాటిని క్రమంగా ఉంచాలి. దీప స్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలు వెలిగించాలి.

నిర్గమకాండం 40:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శాసనాల పెట్టె ఎదురుగా బంగారు ధూపవేదికను ఉంచి, మందిర ద్వారానికి తెర తగిలించాలి.

నిర్గమకాండం 40:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి గుడారం ఉన్న మందిరం ద్వారం ఎదురుగా హోమ బలిపీఠం ఉంచాలి.

నిర్గమకాండం 40:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి గుడారం, హోమ బలిపీఠం మధ్యలో ఒక గంగాళం పెట్టి, దాన్ని నీళ్ళతో నింపాలి.

నిర్గమకాండం 40:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెరల చుట్టూ ప్రహరీ నిలబెట్టి, ప్రహరీ ద్వారానికి తెర తగిలించాలి.

నిర్గమకాండం 40:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అభిషేక తైలం తీసుకుని దైవ నివాసాన్నీ, అందులోని వాటన్నిటినీ అభిషేకించాలి. దానినీ, దానిలోని సామగ్రి అంతటినీ ప్రతిష్టించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది.

నిర్గమకాండం 40:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హోమ బలిపీఠాన్ని అభిషేకించి, దాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ పీఠం పవిత్రం అవుతుంది.

నిర్గమకాండం 40:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి.

నిర్గమకాండం 40:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అహరోనును, అతని కొడుకులను సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి వెంటబెట్టుకుని తీసుకువచ్చి నీళ్లతో స్నానం చేయించాలి.

నిర్గమకాండం 40:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి పవిత్ర వస్త్రాలు తొడిగి అతడు నాకు యాజకుడుగా సేవ జరిగించడానికి అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.

నిర్గమకాండం 40:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతని కొడుకులను తీసుకువచ్చి వాళ్లకు చొక్కాలు తొడిగించాలి.

నిర్గమకాండం 40:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు కూడా నాకు యాజకులుగా ఉండేలా వాళ్ళ తండ్రిని అభిషేకించినట్టు వాళ్ళను అభిషేకించి ప్రతిష్టించు. వారి అభిషేకం తరతరాలకు నిత్యమూ నిలిచే యాజకత్వ చిహ్నంగా ఉంటుంది.”

నిర్గమకాండం 40:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఆ విధంగా చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినదంతా జరిగించాడు.

నిర్గమకాండం 40:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దైవ నివాస మందిరం నిలబెట్టాడు.

నిర్గమకాండం 40:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు దైవ నివాస మందిరం నిలబెట్టి దాని దిమ్మలు వేసి, దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలు అమర్చి, స్తంభాలను నిలిపాడు.

నిర్గమకాండం 40:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరం పైన గుడారం పరిచాడు. గుడారానికి పైకప్పు వేశాడు.

నిర్గమకాండం 40:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు శాసనాలను మందసంలో ఉంచాడు. మందసాన్ని మోసే కర్రలను పెట్టెకు దూర్చి దానిపైన కరుణా స్థానం మూత ఉంచాడు.

నిర్గమకాండం 40:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందసాన్ని యెహోవా మందిరంలోకి తెచ్చి అడ్డతెర వేలాడదీసి శాసనాల పెట్టెను కప్పాడు.

నిర్గమకాండం 40:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి గుడారంలో, దైవ సన్నిధి మందిరం ఉత్తర దిక్కున, అడ్డతెరకు బయట బల్లను ఉంచాడు.

నిర్గమకాండం 40:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సన్నిధి ఎదుట బల్ల మీద రొట్టెలను క్రమంగా పేర్చాడు.

నిర్గమకాండం 40:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో మందిరానికి దక్షిణం వైపున బల్ల ఎదుట దీపస్తంభం ఉంచాడు.

నిర్గమకాండం 40:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు.

నిర్గమకాండం 40:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచాడు.

నిర్గమకాండం 40:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యాలను కాల్చి ధూపం వేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు.

నిర్గమకాండం 40:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిర ద్వారానికి తెర ఏర్పాటు చేశాడు. అతడు దైవ సన్నిధి గుడారం ద్వారం దగ్గర హోమపీఠం ఉంచాడు.

నిర్గమకాండం 40:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా హోమ బలిపీఠం మీద హోమబలి అర్పించి నైవేద్యం సమర్పించాడు.

నిర్గమకాండం 40:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు దైవసన్నిధి గుడారానికి, హోమ పీఠానికి మధ్య గంగాళం ఉంచి శుభ్రపరచుకోవడానికి దానిలో నీళ్లు పోయించాడు.

నిర్గమకాండం 40:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ మోషే, అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.

నిర్గమకాండం 40:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు యెహోవా గుడారం లోపలికి ప్రవేశించినప్పుడు, హోమపీఠం చెంతకు వచ్చినప్పుడు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.

నిర్గమకాండం 40:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే మందిరానికి, హోమపీఠానికి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశాడు. ఆవరణ ద్వారం తెర వేశాడు. ఈ విధంగా మోషే పని మొత్తం ముగించాడు.

నిర్గమకాండం 40:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.

నిర్గమకాండం 40:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మేఘం యెహోవా సన్నిధి గుడారంపై నిలిచి ఉండడం వల్ల మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది. అందువల్ల మోషే యెహోవా సన్నిధి గుడారం లోపలి వెళ్ళలేక పోయాడు.

నిర్గమకాండం 40:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు.

నిర్గమకాండం 40:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మేఘం పైకి వెళ్ళకపోతే అది వెళ్ళే రోజు దాకా ప్రయాణం ఆపివేసే వాళ్ళు. ఇది వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి.

నిర్గమకాండం 40:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజలందరి సమక్షంలో పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది. రాత్రి సమయాల్లో మేఘంలో అగ్ని స్థంభం ఉండేది. ప్రజల ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగింది.

Available Bible Translations

American Standard Version
Exodus 40 (ASV) »
King James Version
Exodus 40 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 40 (GW) »
World English Bible
Exodus 40 (WEB) »
Louis Segond 1910
Exode 40 (LSG) »
Luther Bibel 1912
Exodus 40 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 40 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 40 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 40 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 40 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 40 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 40 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 40 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 40 (AVD) »
תנ ך עברי מודרני
שמות 40 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 40 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 40 (VIE) »
Reina Valera Antigua
Éxodo 40 (RVA) »
La Sacra Bibbia
Esodo 40 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 40 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 40 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 40 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 40 (SV1917) »
Библия на русском
Исход 40 (RUSV) »
Українська Біблія
Вихід 40 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 40 (KAR) »
Българска Библия
Изход 40 (BULG) »
Biblia Takatifu
Kutoka 40 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 40 (SOM) »
De Heilige Schrift
Exodus 40 (NLD) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List