నిర్గమకాండం Chapter 38 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 38 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 38 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 38:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.

నిర్గమకాండం 38:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు.

నిర్గమకాండం 38:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు.

నిర్గమకాండం 38:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు.

నిర్గమకాండం 38:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు.

నిర్గమకాండం 38:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు.

నిర్గమకాండం 38:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.

నిర్గమకాండం 38:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.

నిర్గమకాండం 38:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు.

నిర్గమకాండం 38:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు.

నిర్గమకాండం 38:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు.

నిర్గమకాండం 38:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు.

నిర్గమకాండం 38:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు.

నిర్గమకాండం 38:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండం 38:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండం 38:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు.

నిర్గమకాండం 38:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు.

నిర్గమకాండం 38:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు.

నిర్గమకాండం 38:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు.

నిర్గమకాండం 38:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి.

నిర్గమకాండం 38:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు.

నిర్గమకాండం 38:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.

నిర్గమకాండం 38:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి.

నిర్గమకాండం 38:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తలాంతులు, 730 షెకెల్.

నిర్గమకాండం 38:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1, 775 షెకెల్.

నిర్గమకాండం 38:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.

నిర్గమకాండం 38:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు.

నిర్గమకాండం 38:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
1, 575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు.

నిర్గమకాండం 38:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు.

నిర్గమకాండం 38:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు.

నిర్గమకాండం 38:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.

Available Bible Translations

American Standard Version
Exodus 38 (ASV) »
King James Version
Exodus 38 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 38 (GW) »
World English Bible
Exodus 38 (WEB) »
Louis Segond 1910
Exode 38 (LSG) »
Luther Bibel 1912
Exodus 38 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 38 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 38 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 38 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 38 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 38 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 38 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 38 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 38 (AVD) »
תנ ך עברי מודרני
שמות 38 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 38 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 38 (VIE) »
Reina Valera Antigua
Éxodo 38 (RVA) »
La Sacra Bibbia
Esodo 38 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 38 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 38 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 38 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 38 (SV1917) »
Библия на русском
Исход 38 (RUSV) »
Українська Біблія
Вихід 38 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 38 (KAR) »
Българска Библия
Изход 38 (BULG) »
Biblia Takatifu
Kutoka 38 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 38 (SOM) »
De Heilige Schrift
Exodus 38 (NLD) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List