నిర్గమకాండం Chapter 13 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 13 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 13 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 13:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.

నిర్గమకాండం 13:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.”

నిర్గమకాండం 13:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.

నిర్గమకాండం 13:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు.

నిర్గమకాండం 13:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి.

నిర్గమకాండం 13:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఏడు రోజులపాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడవ రోజు యెహోవా పండగ ఆచరించాలి.

నిర్గమకాండం 13:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడు రోజులూ పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకూ పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు.

నిర్గమకాండం 13:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు మీ పిల్లలకు ‘నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను’ అని చెప్పాలి.

నిర్గమకాండం 13:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా, ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది.

నిర్గమకాండం 13:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయకాలంలో ఆచరించాలి.

నిర్గమకాండం 13:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత

నిర్గమకాండం 13:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.

నిర్గమకాండం 13:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి.

నిర్గమకాండం 13:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు.

నిర్గమకాండం 13:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను’ అని చెప్పాలి.

నిర్గమకాండం 13:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.”

నిర్గమకాండం 13:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. “ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో” అనుకున్నాడు.

నిర్గమకాండం 13:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.

నిర్గమకాండం 13:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే యోసేపు ఆస్తికలను వెంట తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు “దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా ఆస్తికలను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళండి” అని ఇశ్రాయేలు ప్రజలతో కచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు.

నిర్గమకాండం 13:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు.

నిర్గమకాండం 13:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు.

నిర్గమకాండం 13:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.

Available Bible Translations

American Standard Version
Exodus 13 (ASV) »
King James Version
Exodus 13 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 13 (GW) »
World English Bible
Exodus 13 (WEB) »
Louis Segond 1910
Exode 13 (LSG) »
Luther Bibel 1912
Exodus 13 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 13 (AVD) »
תנ ך עברי מודרני
שמות 13 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 13 (VIE) »
Reina Valera Antigua
Éxodo 13 (RVA) »
La Sacra Bibbia
Esodo 13 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 13 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 13 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 13 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 13 (SV1917) »
Библия на русском
Исход 13 (RUSV) »
Українська Біблія
Вихід 13 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 13 (KAR) »
Българска Библия
Изход 13 (BULG) »
Biblia Takatifu
Kutoka 13 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 13 (SOM) »
De Heilige Schrift
Exodus 13 (NLD) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List