నిర్గమకాండం Chapter 15 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 15:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, సముద్రంలో ముంచి వేశాడు. గొప్ప విజయం సాధించాడు.

నిర్గమకాండం 15:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాయే నా బలం, నా గానం, నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను. ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను.

నిర్గమకాండం 15:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా.

నిర్గమకాండం 15:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.

నిర్గమకాండం 15:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు.

నిర్గమకాండం 15:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది. యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది.

నిర్గమకాండం 15:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు విరోధంగా నీపై లేచేవాళ్లను నీ మహిమా ప్రకాశంతో అణచి వేస్తావు. నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు.

నిర్గమకాండం 15:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి. ప్రవాహాలు గోడలాగా నిలబడి పోయాయి. సముద్రం లోతుల్లో నీళ్ళు గడ్డకట్టిపోయాయి.

నిర్గమకాండం 15:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను’ అని శత్రువు అనుకున్నాడు.

నిర్గమకాండం 15:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసం లాగా వాళ్ళను మునిగి పోయేలా చేశావు.

నిర్గమకాండం 15:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?

నిర్గమకాండం 15:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది.

నిర్గమకాండం 15:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు.

నిర్గమకాండం 15:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది.

నిర్గమకాండం 15:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎదోము అధిపతులు భయపడతారు. మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు. కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు,

నిర్గమకాండం 15:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భయ భీతులు వారిని ఆవరిస్తాయి. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు.

నిర్గమకాండం 15:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు.

నిర్గమకాండం 15:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, శాశ్వతంగా రాజ్యం చేస్తాడు.”

నిర్గమకాండం 15:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు.

నిర్గమకాండం 15:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.

నిర్గమకాండం 15:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.

నిర్గమకాండం 15:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత మారాకు చేరుకున్నారు.

నిర్గమకాండం 15:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది.

నిర్గమకాండం 15:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు మోషే మీద సణుగుతూ “మేమేమీ తాగాలి?” అన్నారు.

నిర్గమకాండం 15:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు,

నిర్గమకాండం 15:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”

నిర్గమకాండం 15:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Exodus 15 (ASV) »
King James Version (KJV)
Exodus 15 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 15 (GW) »
Berean Bible (BSB)
Exodus 15 (BSB) »
World English Bible (WEB)
Exodus 15 (WEB) »
French Bible (LSG)
Exode 15 (LSG) »
German Bible (LUTH1912)
Exodus 15 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਖ਼ਰੋਜ 15 (PANIRV) »
Hebrew Bible (HEB)
שמות 15 (HEB) »
Portuguese Bible (BSL)
Êxodo 15 (BSL) »
Vietnamese Bible (VIE)
Xuất Hành 15 (VIE) »
Spanish Bible (RVA)
Éxodo 15 (RVA) »
Italian Bible (RIV)
Esodo 15 (RIV) »
Chinese Simplified (CUVS)
出 埃 及 记 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
出 埃 及 記 15 (CUVT) »
Albanian Bible (ALB)
Eksodi 15 (ALB) »
Swedish Bible (SV1917)
2 Mosebok 15 (SV1917) »
Russian Bible (RUSV)
Исход 15 (RUSV) »
Ukrainian Bible (UKR)
Вихід 15 (UKR) »
Hungarian Bible (KAR)
2 Mózes 15 (KAR) »
Bulgarian Bible (BULG)
Изход 15 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Mosebok 15 (NORSK) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List