ఆదికాండం Chapter 20 TELIRV Bible Verse Images

ఆదికాండం 20 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 20 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 20:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము అక్కడ నుండి బయలుదేరి దక్షిణదేశానికి తరలి వెళ్ళాడు. అలా కాదేషుకూ, షూరుకూ మధ్య ఉన్న ప్రాంతంలో నివసించాడు. కొంతకాలం గెరారులో పరదేశిగా ఉన్నాడు.

ఆదికాండం 20:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి “ఈమె నా చెల్లి” అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు.

ఆదికాండం 20:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని దేవుడు రాత్రి కలలో అబీమెలెకు దగ్గరికికు కనబడి అతనితో “చూడు, నువ్వు చచ్చినట్టే! ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న స్తీ ఒక వ్యక్తికి భార్య” అని చెప్పాడు.

ఆదికాండం 20:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు “ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా?

ఆదికాండం 20:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘ఈమె నా చెల్లి’ అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా ‘అతడు నా అన్న’ అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను” అన్నాడు.

ఆదికాండం 20:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు దేవుడు అతనికి కలలో కనబడి “అవును, నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావని నాకు తెలుసు. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డుకున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను తాకడానికి అనుమతించ లేదు.

ఆదికాండం 20:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆ వ్యక్తి భార్యను తిరిగి అతనికప్పగించు. ఎందుకంటే అతడు ప్రవక్త. నువ్వు బతికేలా అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. ఒకవేళ నువ్వు ఆమెను తిరిగి అతనికి అప్పగించకపోతే నువ్వూ, నీకు చెందినవారూ తప్పక చనిపోతారు. ఈ సంగతి నువ్వు బాగా తెలుసుకో” అని చెప్పాడు.

ఆదికాండం 20:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్లవారకముందే అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించాడు. వారికి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. వారంతా అది విని ఎంతో భయపడ్డారు.

ఆదికాండం 20:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు “నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు” అన్నాడు.

ఆదికాండం 20:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీమెలెకు అబ్రాహామును చూసి “నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి?” అని అడిగాడు.

ఆదికాండం 20:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము “ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేసాను

ఆదికాండం 20:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదీకాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది.

ఆదికాండం 20:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో ‘మనం వెళ్ళే ప్రతి స్థలం లోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే’ అని చెప్పాను” అన్నాడు.

ఆదికాండం 20:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీమెలెకు గొర్రెలనూ ఎద్దులనూ దాసులనూ దాసీలనూ రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తరువాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు.

ఆదికాండం 20:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అబీమెలెకు “చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకో” అని అబ్రాహాముతో అన్నాడు.

ఆదికాండం 20:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతడు శారాతో “చూడు, నీ అన్నకు నేను వెయ్యి వెండి నాణాలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీతో ఉన్నవారందరి ఎదుట ఈడబ్బు రుజువుగా ఉంటుంది. అందరి ఎదుటా నీకు న్యాయం జరిగింది” అన్నాడు.

ఆదికాండం 20:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకునూ, అతని భార్యనూ అతని దాసీలనూ స్వస్థపరిచాడు. వారు పిల్లలను కనగలిగారు.

ఆదికాండం 20:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్ళనుగా చేశాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 20 (ASV) »
King James Version (KJV)
Genesis 20 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 20 (GW) »
Berean Bible (BSB)
Genesis 20 (BSB) »
World English Bible (WEB)
Genesis 20 (WEB) »
French Bible (LSG)
Genèse 20 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 20 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 20 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 20 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 20 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 20 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 20 (RVA) »
Italian Bible (RIV)
Genesi 20 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 20 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 20 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 20 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 20 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 20 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 20 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 20 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 20 (BULG) »
Japanese Bible (JPN)
創世記 20 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 20 (NORSK) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List