ఆదికాండం Chapter 39 TELIRV Bible Verse Images

ఆదికాండం 39 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 39 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 39:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు.

ఆదికాండం 39:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు.

ఆదికాండం 39:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు.

ఆదికాండం 39:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు.

ఆదికాండం 39:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన ఇంటి మీదా తనకు ఉన్న దానంతటి మీదా అతన్ని కార్యనిర్వహకునిగా నియమించిన దగ్గరనుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీదా ఉంది.

ఆదికాండం 39:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి, తాను భోజనం చేయడం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకొనేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బావుంటాడు.

ఆదికాండం 39:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. “నాతో సుఖపడు” అని అతనిని అడిగింది.

ఆదికాండం 39:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అతడు తిరస్కరించి “నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు.

ఆదికాండం 39:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?” అని తన యజమాని భార్యతో అన్నాడు.

ఆదికాండం 39:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు.

ఆదికాండం 39:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు.

ఆదికాండం 39:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.

ఆదికాండం 39:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవడం ఆమె చూసి,

ఆదికాండం 39:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి “చూడండి, పోతీఫరు మనలను ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను.

ఆదికాండం 39:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను పెద్దగా కేకవేయడం వాడు విని నా దగ్గర తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు” అని వారితో చెప్పింది.

ఆదికాండం 39:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని యజమాని ఇంటికి వచ్చే వరకూ ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది.

ఆదికాండం 39:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె తన భర్తతో ఇలా వివరించింది. “నువ్వు మన దగ్గరికి తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు.

ఆదికాండం 39:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పై వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.”

ఆదికాండం 39:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీ దాసుడు నాకిలా చేశాడు” అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీఫరు, కోపంతో మండిపడ్డాడు.

ఆదికాండం 39:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలను బంధించే చెరసాలలో వేయించాడు. అతడు చెరసాలలో ఉన్నాడు.

ఆదికాండం 39:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల అధిపతి అతన్ని అభిమానంగా చూసుకోనేలా చేశాడు.

ఆదికాండం 39:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు.

ఆదికాండం 39:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు.

Available Bible Translations

American Standard Version
Genesis 39 (ASV) »
King James Version
Genesis 39 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 39 (GW) »
World English Bible
Genesis 39 (WEB) »
Louis Segond 1910
Genèse 39 (LSG) »
Luther Bibel 1912
Genesis 39 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 39 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 39 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 39 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 39 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 39 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 39 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 39 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 39 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 39 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 39 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 39 (VIE) »
Reina Valera Antigua
Génesis 39 (RVA) »
La Sacra Bibbia
Genesi 39 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 39 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 39 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 39 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 39 (SV1917) »
Библия на русском
Бытие 39 (RUSV) »
Українська Біблія
Буття 39 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 39 (KAR) »
Българска Библия
Битие 39 (BULG) »
聖書 日本語
創世記 39 (JPN) »
Biblia Takatifu
Mwanzo 39 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 39 (SOM) »
De Heilige Schrift
Genesis 39 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List