ఆదికాండం Chapter 41 TELIRV Bible Verse Images

ఆదికాండం 41 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 41 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 41:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు.

ఆదికాండం 41:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.

ఆదికాండం 41:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి.

ఆదికాండం 41:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు.

ఆదికాండం 41:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది.

ఆదికాండం 41:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి.

ఆదికాండం 41:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకుని అది కల అని గ్రహించాడు.

ఆదికాండం 41:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.

ఆదికాండం 41:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు “ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది.

ఆదికాండం 41:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు.

ఆదికాండం 41:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము.

ఆదికాండం 41:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు.

ఆదికాండం 41:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు” అని ఫరోతో చెప్పాడు.

ఆదికాండం 41:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.

ఆదికాండం 41:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో యోసేపుతో “నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను” అన్నాడు.

ఆదికాండం 41:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు.

ఆదికాండం 41:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ఫరో “నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను.

ఆదికాండం 41:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బలిసిన, అందమైన ఏడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.

ఆదికాండం 41:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు.

ఆదికాండం 41:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినేశాయి.

ఆదికాండం 41:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను.

ఆదికాండం 41:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి.

ఆదికాండం 41:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి.

ఆదికాండం 41:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు” అని అతనితో చెప్పాడు.

ఆదికాండం 41:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యోసేపు “ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు.

ఆదికాండం 41:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు.

ఆదికాండం 41:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు.

ఆదికాండం 41:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు.

ఆదికాండం 41:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి.

ఆదికాండం 41:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది.

ఆదికాండం 41:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది.

ఆదికాండం 41:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది.

ఆదికాండం 41:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి.

ఆదికాండం 41:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి.

ఆదికాండం 41:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి.

ఆదికాండం 41:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది” అని ఫరోతో చెప్పాడు.

ఆదికాండం 41:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది.

ఆదికాండం 41:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు.

ఆదికాండం 41:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.

ఆదికాండం 41:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు.

ఆదికాండం 41:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు.

ఆదికాండం 41:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.

ఆదికాండం 41:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ “నమస్కారం చేయండి” అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు.

ఆదికాండం 41:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో యోసేపుతో “నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు” అన్నాడు.

ఆదికాండం 41:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు.

ఆదికాండం 41:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు.

ఆదికాండం 41:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది.

ఆదికాండం 41:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు.

ఆదికాండం 41:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలవ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్నిక కొలవడం మానుకున్నారు.

ఆదికాండం 41:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కరువు కాలం ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి.

ఆదికాండం 41:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యోసేపు “దేవుడు నా కష్టాన్నంతా మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరచిపోయేలా చేశాడు” అని తన పెద్దకొడుక్కి “మనష్షే” అనే పేరు పెట్టాడు.

ఆదికాండం 41:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అని రెండో కొడుక్కి “ఎఫ్రాయిము” అనే పేరు పెట్టాడు.

ఆదికాండం 41:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి.

ఆదికాండం 41:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ళ కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది.

ఆదికాండం 41:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో “మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి” అని ఐగుప్తీయులందరితో చెప్పాడు.

ఆదికాండం 41:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది.

ఆదికాండం 41:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండడం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 41 (ASV) »
King James Version (KJV)
Genesis 41 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 41 (GW) »
Berean Bible (BSB)
Genesis 41 (BSB) »
World English Bible (WEB)
Genesis 41 (WEB) »
French Bible (LSG)
Genèse 41 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 41 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 41 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 41 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 41 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 41 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 41 (RVA) »
Italian Bible (RIV)
Genesi 41 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 41 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 41 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 41 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 41 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 41 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 41 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 41 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 41 (BULG) »
Japanese Bible (JPN)
創世記 41 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 41 (NORSK) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List