ఆదికాండం Chapter 21 TELIRV Bible Verse Images

ఆదికాండం 21 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 21 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 21:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు.

ఆదికాండం 21:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది.

ఆదికాండం 21:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు.

ఆదికాండం 21:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు.

ఆదికాండం 21:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు.

ఆదికాండం 21:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు శారా “దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. నా సంగతి తెలిసినవారంతా నాతో కలసి సంతోషిస్తారు” అన్నది.

ఆదికాండం 21:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె ఇంకా “శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగే వారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా” అన్నది.

ఆదికాండం 21:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు.

ఆదికాండం 21:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది.

ఆదికాండం 21:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె అబ్రాహాముతో ఇలా అంది. “ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.”

ఆదికాండం 21:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలుని బట్టి చాలా వేదన చెందాడు.

ఆదికాండం 21:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే దేవుడు “ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు.

ఆదికాండం 21:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినప్పటికీ ఈ దాసీ కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను” అని అబ్రాహాముతో చెప్పాడు.

ఆదికాండం 21:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కనుక అబ్రాహాము తెల్లవారకముందే లేచి రొట్టె, నీళ్ళు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది.

ఆదికాండం 21:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది.

ఆదికాండం 21:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు” అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చింది.

ఆదికాండం 21:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు.

ఆదికాండం 21:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను” అని ఆమెకు చెప్పాడు.

ఆదికాండం 21:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకోనేలా చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ళ ఊటను చూసింది. ఆమె వెళ్ళి తోలు తిత్తిని నీళ్ళతో నింపి ఆ బాలుడికి తాగించింది.

ఆదికాండం 21:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.

ఆదికాండం 21:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది.

ఆదికాండం 21:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో అబీమెలెకూ, అతని సైన్యాధిపతి ఫీకోలూ కలసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు. “నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.

ఆదికాండం 21:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనుమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్లా, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్లా చూపించు” అన్నాడు.

ఆదికాండం 21:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు అబ్రాహాము “నేను వాగ్దానం చేస్తాను” అన్నాడు.

ఆదికాండం 21:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు “ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.

ఆదికాండం 21:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు. నాకీ సంగతి ఈ రోజే తెలిసింది” అన్నాడు.

ఆదికాండం 21:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము గొర్రెలనూ ఎడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు.

ఆదికాండం 21:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి ఏడు ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు.

ఆదికాండం 21:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో “నువ్వు ఏడు ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు. దాని అంతరార్ధం ఏమిటి?” అని అడిగాడు.

ఆదికాండం 21:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి అబ్రాహాము “ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి” అన్నాడు.

ఆదికాండం 21:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి “బెయేర్షెబా” అనే పేరు వచ్చింది.

ఆదికాండం 21:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ఫీకోలుతో కలసి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు.

ఆదికాండం 21:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.

ఆదికాండం 21:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు.

Available Bible Translations

American Standard Version
Genesis 21 (ASV) »
King James Version
Genesis 21 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 21 (GW) »
World English Bible
Genesis 21 (WEB) »
Louis Segond 1910
Genèse 21 (LSG) »
Luther Bibel 1912
Genesis 21 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 21 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 21 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 21 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 21 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 21 (VIE) »
Reina Valera Antigua
Génesis 21 (RVA) »
La Sacra Bibbia
Genesi 21 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 21 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 21 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 21 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 21 (SV1917) »
Библия на русском
Бытие 21 (RUSV) »
Українська Біблія
Буття 21 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 21 (KAR) »
Българска Библия
Битие 21 (BULG) »
聖書 日本語
創世記 21 (JPN) »
Biblia Takatifu
Mwanzo 21 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 21 (SOM) »
De Heilige Schrift
Genesis 21 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List