ఆదికాండం Chapter 4 TELIRV Bible Verse Images

ఆదికాండం 4 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 4 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 4:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది.

ఆదికాండం 4:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు.

ఆదికాండం 4:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు.

ఆదికాండం 4:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు.

ఆదికాండం 4:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.

ఆదికాండం 4:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు?

ఆదికాండం 4:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు.

ఆదికాండం 4:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు.

ఆదికాండం 4:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు.

ఆదికాండం 4:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది.

ఆదికాండం 4:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు.

ఆదికాండం 4:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.

ఆదికాండం 4:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కయీను “నా శిక్ష నేను భరించలేనిది.

ఆదికాండం 4:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు.

ఆదికాండం 4:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.

ఆదికాండం 4:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు.

ఆదికాండం 4:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కయీను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.

ఆదికాండం 4:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హనోకు ఈరాదుకు తండ్రి. ఈరాదు మహూయాయేలుకు తండ్రి. మహూయాయేలు మతూషాయేలుకు తండ్రి. మతూషాయేలు లెమెకుకు తండ్రి.

ఆదికాండం 4:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెమెకు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. వారిలో ఒకామె పేరు ఆదా, రెండవ ఆమె సిల్లా.

ఆదికాండం 4:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.

ఆదికాండం 4:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుషుడు.

ఆదికాండం 4:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా.

ఆదికాండం 4:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను. కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.

ఆదికాండం 4:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది.”

ఆదికాండం 4:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది.

ఆదికాండం 4:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను ఆరాధించడం ఆరంభించారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 4 (ASV) »
King James Version (KJV)
Genesis 4 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 4 (GW) »
Berean Bible (BSB)
Genesis 4 (BSB) »
World English Bible (WEB)
Genesis 4 (WEB) »
French Bible (LSG)
Genèse 4 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 4 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 4 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 4 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 4 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 4 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 4 (RVA) »
Italian Bible (RIV)
Genesi 4 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 4 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 4 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 4 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 4 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 4 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 4 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 4 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 4 (BULG) »
Japanese Bible (JPN)
創世記 4 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 4 (NORSK) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List