ఆదికాండం Chapter 26 TELIRV Bible Verse Images

ఆదికాండం 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 26:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు.

ఆదికాండం 26:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. “నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు. నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు.

ఆదికాండం 26:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను.

ఆదికాండం 26:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.

ఆదికాండం 26:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలనూ, శాసనాలనూ, నా చట్టాలనూ, నా నియమాలనూ పాటించాడు” అని అతనికి చెప్పాడు.

ఆదికాండం 26:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.

ఆదికాండం 26:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు “ఆమె నా చెల్లి” అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు.

ఆదికాండం 26:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.

ఆదికాండం 26:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి “చూడు, ఆమె కచ్చితంగా నీ భార్యే, ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. దానికి ఇస్సాకు “ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను” అన్నాడు.

ఆదికాండం 26:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు అబీమెలెకు “నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా!” అన్నాడు.

ఆదికాండం 26:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ “ఈ వ్యక్తిని గానీ ఇతని భార్యను గానీ ముట్టుకునే వాడు కచ్చితంగా మరణశిక్ష పొందుతాడు” అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు.

ఆదికాండం 26:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు.

ఆదికాండం 26:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు.

ఆదికాండం 26:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి అనేక గొర్రెలూ పశువులూ సమకూడాయి. అనేకమంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు.

ఆదికాండం 26:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తండ్రి అయిన అబ్రాహాము రోజుల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మట్టి వేసి పూడ్చివేశారు.

ఆదికాండం 26:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో “నువ్వు మాకంటే బలవంతుడివి. కాబట్టి ఈ ప్రాంతం విడిచి మాకు దూరంగా వెళ్లి పో” అన్నాడు.

ఆదికాండం 26:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇస్సాకు అక్కడనుండి తరలి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు.

ఆదికాండం 26:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ళ బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు.

ఆదికాండం 26:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ళ బావి లభ్యమైంది.

ఆదికాండం 26:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో “ఈ నీళ్ళు మావే” అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు ఆ బావికి “ఏశెకు” అని పేరు పెట్టాడు.

ఆదికాండం 26:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత వాళ్ళు మరో బావి తవ్వారు. దాని కోసం కూడా అక్కడి వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి “శిత్నా” అనే పేరు పెట్టాడు.

ఆదికాండం 26:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు అక్కడ్నించి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవా జరగలేదు. కాబట్టి ఇస్సాకు “యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు. కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం” అంటూ ఆ స్థలానికి రహబోతు అనే పేరు పెట్టాడు.

ఆదికాండం 26:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అక్కడనుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు.

ఆదికాండం 26:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి భయపడవద్దు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను.”

ఆదికాండం 26:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరుమీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు.

ఆదికాండం 26:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ఫీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు.

ఆదికాండం 26:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారితో ఇస్సాకు “మీరు నామీద కక్ష కట్టి మీ దగ్గరనుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరికి వచ్చారు?” అని వారిని అడిగాడు.

ఆదికాండం 26:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు. “యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని అంటే నీకూ మాకూ మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం.

ఆదికాండం 26:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము నీకు ఎలాంటి హానీ చేయలేదు. నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్యనుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు.”

ఆదికాండం 26:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇస్సాకు వాళ్ళకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు.

ఆదికాండం 26:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెందలకడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు. తరువాత ఇస్సాకు వాళ్ళను శాంతియుతంగా సాగనంపాడు.

ఆదికాండం 26:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే రోజు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన ఒక బావిని గూర్చి అతనికి తెలియజేశారు. తాము తవ్విన బావిలో నీళ్ళు పడ్డాయని చెప్పారు.

ఆదికాండం 26:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ బావికి ఇస్సాకు “షీబా” అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకూ ఆ ఊరి పేరు బెయేర్షెబాయే.

ఆదికాండం 26:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదీతునూ, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతునూ పెళ్ళి చేసుకున్నాడు.

ఆదికాండం 26:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు ఇస్సాకు రిబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు.

Available Bible Translations

American Standard Version
Genesis 26 (ASV) »
King James Version
Genesis 26 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 26 (GW) »
World English Bible
Genesis 26 (WEB) »
Louis Segond 1910
Genèse 26 (LSG) »
Luther Bibel 1912
Genesis 26 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 26 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 26 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 26 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 26 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 26 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 26 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 26 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 26 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 26 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 26 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 26 (VIE) »
Reina Valera Antigua
Génesis 26 (RVA) »
La Sacra Bibbia
Genesi 26 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 26 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 26 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 26 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 26 (SV1917) »
Библия на русском
Бытие 26 (RUSV) »
Українська Біблія
Буття 26 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 26 (KAR) »
Българска Библия
Битие 26 (BULG) »
聖書 日本語
創世記 26 (JPN) »
Biblia Takatifu
Mwanzo 26 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 26 (SOM) »
De Heilige Schrift
Genesis 26 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List