ఆదికాండం Chapter 30 TELIRV Bible Verse Images

ఆదికాండం 30 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 30 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 30:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో “నాకు గర్భఫలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను” అంది.

ఆదికాండం 30:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు “నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?” అన్నాడు.

ఆదికాండం 30:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ఆమె “నా దాసి బిల్హా ఉంది గదా, ఆమెతో రాత్రి గడుపు. ఆమె నా కోసం పిల్లలను కంటుంది. ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు” అని చెప్పి

ఆదికాండం 30:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు.

ఆదికాండం 30:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది.

ఆదికాండం 30:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు రాహేలు “దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు” అనుకుని అతనికి “దాను” అని పేరు పెట్టింది.

ఆదికాండం 30:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.

ఆదికాండం 30:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు రాహేలు “దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను” అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.

ఆదికాండం 30:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేయా తనకు కానుపు ఉడిగిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.

ఆదికాండం 30:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జిల్పా యాకోబుకు కొడుకుని కన్నది.

ఆదికాండం 30:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు లేయా “ఇది అదృష్టమే గదా” అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది.

ఆదికాండం 30:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.

ఆదికాండం 30:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేయా “నేను భాగ్యవంతురాలిని. స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా” అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.

ఆదికాండం 30:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గోదుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు “నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు” అని లేయాతో అంది.

ఆదికాండం 30:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకామె “నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా” అంది. అందుకు రాహేలు “అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు” అని చెప్పింది.

ఆదికాండం 30:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్లి “నువ్వు నా దగ్గరికి రావాలి. నా కొడుకు తెచ్చిన మంత్రమూలికలతో నిన్ను కొన్నాను” అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు.

ఆదికాండం 30:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది.

ఆదికాండం 30:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు” అనుకుని అతనికి “ఇశ్శాఖారు” అని పేరు పెట్టింది.

ఆదికాండం 30:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.

ఆదికాండం 30:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు లేయా “దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను. కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు” అనుకుని అతనికి “జెబూలూను” అని పేరు పెట్టింది.

ఆదికాండం 30:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత ఆమె ఒక కూతురిని కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది.

ఆదికాండం 30:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని, ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు.

ఆదికాండం 30:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడామె గర్భవతి అయ్యి కొడుకును కని “దేవుడు నా నింద తొలగించాడు” అనుకుంది.

ఆదికాండం 30:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా ఆమె “యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక” అనుకుని అతనికి “యోసేపు” అనే పేరు పెట్టింది.

ఆదికాండం 30:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో “నన్ను పంపివెయ్యి. నా స్థలానికి, నా దేశానికి తిరిగి వెళ్తాను.

ఆదికాండం 30:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా భార్యలను, నా పిల్లలను నా కప్పగించు. నేను వెళ్ళిపోతాను, వారి కోసం నీకు సేవ చేశాను. నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా” అని చెప్పాడు.

ఆదికాండం 30:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు లాబాను అతనితో “నీ దయ నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను.

ఆదికాండం 30:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను” అన్నాడు.

ఆదికాండం 30:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు అతణ్ణి చూసి “నేను నీకేవిధంగా సేవ చేశానో, నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు.

ఆదికాండం 30:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?” అన్నాడు.

ఆదికాండం 30:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు లాబాను “నేను నీకేమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు “నువ్వు నాకేమీ ఇయ్యవద్దు, నువ్వు నాకోసం నేను చెప్పిన విధంగా చేస్తే, నేను తిరిగి నీ మందను మేపుతూ వాటి బాగోగులు చూస్తాను.

ఆదికాండం 30:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకల్లో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి.

ఆదికాండం 30:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక ముందు నాకు రావలసిన జీతం గూర్చి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకల్లో పొడలూ మచ్చలూ లేనివీ, గొర్రెపిల్లల్లో నల్లగా లేనివీ నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని చెప్పవచ్చు” అన్నాడు.

ఆదికాండం 30:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు లాబాను “మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు” అన్నాడు.

ఆదికాండం 30:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు లాబాను చారలూ, మచ్చలూ ఉన్న మేకపోతులనూ, పొడలూ మచ్చలూ గల ఆడ మేకలనూ కొంచెం తెలుపు గల ప్రతిదానినీ గొర్రెపిల్లల్లో నల్లవాటినీ అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు.

ఆదికాండం 30:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తనకూ యాకోబుకూ మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు.

ఆదికాండం 30:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు గంగ రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు.

ఆదికాండం 30:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు.

ఆదికాండం 30:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.

ఆదికాండం 30:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు ఆ గొర్రెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు.

ఆదికాండం 30:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు.

ఆదికాండం 30:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకూ బలమైనవి యాకోబుకూ వచ్చాయి.

ఆదికాండం 30:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 30 (ASV) »
King James Version (KJV)
Genesis 30 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 30 (GW) »
Berean Bible (BSB)
Genesis 30 (BSB) »
World English Bible (WEB)
Genesis 30 (WEB) »
French Bible (LSG)
Genèse 30 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 30 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 30 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 30 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 30 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 30 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 30 (RVA) »
Italian Bible (RIV)
Genesi 30 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 30 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 30 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 30 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 30 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 30 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 30 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 30 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 30 (BULG) »
Japanese Bible (JPN)
創世記 30 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 30 (NORSK) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List