ఆదికాండం Chapter 50 TELIRV Bible Verse Images

ఆదికాండం 50 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 50 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 50:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు తన తండ్రి మీద వాలి ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు.

ఆదికాండం 50:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ వైద్యులు ఇశ్రాయేలు శవాన్ని సిద్ధపరచారు.

ఆదికాండం 50:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు వారికి 40 రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి అంత సమయం పడుతుంది. ఐగుప్తీయులు అతని గురించి 70 రోజులు దుఖించారు.

ఆదికాండం 50:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని గురించి దుఃఖించే రోజులు అయిపోయిన తరువాత, యోసేపు ఫరో ఇంటి వారితో మాటలాడి “మీ దయ నా మీద ఉంటే నా పక్షంగా ఫరోతో

ఆదికాండం 50:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘మా నాన్న నాతో ప్రమాణం చేయించి “ఇదిగో, నేను చనిపోతున్నాను, కనానులో నా కోసం తవ్వించిన సమాధిలో నన్ను పాతిపెట్టాలి అని చెప్పాడు కాబట్టి అనుమతిస్తే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మళ్ళీ వస్తాను అని యోసేపు అన్నాడు” అని చెప్పండి’” అన్నాడు.

ఆదికాండం 50:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ఫరో “అతడు నీ చేత చేయించిన ప్రమాణం ప్రకారం వెళ్ళి మీ నాన్నను పాతిపెట్టు” అన్నాడు.

ఆదికాండం 50:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళాడు. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులంతా ఐగుప్తు దేశపు పెద్దలంతా

ఆదికాండం 50:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు ఇంటివారంతా అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారు వెళ్ళారు. వారు తమ పిల్లలనూ తమ గొర్రెల మందలనూ తమ పశువులనూ మాత్రం గోషెను దేశంలో విడిచిపెట్టారు.

ఆదికాండం 50:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రథాలు, రౌతులు అతనితో వెళ్ళాయి. అది చాలా పెద్ద గుంపు అయింది.

ఆదికాండం 50:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు యొర్దానుకు అవతల ఉన్న ఆటదు కళ్ళం వచ్చినపుడు చాలా పెద్దగా ఏడ్చారు. యోసేపు తన తండ్రిని గురించి ఏడు రోజులు విలపించాడు.

ఆదికాండం 50:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దేశంలో నివసించిన కనానీయులు ఆటదు కళ్ళం దగ్గర ఏడవడం చూసి “ఐగుప్తీయులకు ఇది చాలా సంతాప సమయం” అని చెప్పుకున్నారు. అందుకే దానికి “ఆబేల్‌ మిస్రాయిము” అనే పేరుంది. అది యొర్దానుకు అవతల ఉంది.

ఆదికాండం 50:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు విషయంలో అతడు వారికి చెప్పినట్లు అతని కొడుకులు చేశారు.

ఆదికాండం 50:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని కొడుకులు కనాను దేశానికి అతని శవాన్ని తీసుకుపోయి మమ్రే దగ్గరున్న మక్పేలా పొలంలోని గుహలో పాతిపెట్టారు. అబ్రాహాము పొలంతో పాటు గుహను శ్మశానం కోసం కొన్నాడు. అతడు దాన్ని హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర కొన్నాడు.

ఆదికాండం 50:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడు, అతని సోదరులు, అతని తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళిన వారంతా తిరిగి ఐగుప్తుకు వచ్చారు.

ఆదికాండం 50:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి “ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేస్తాడేమో” అనుకున్నారు.

ఆదికాండం 50:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వారు యోసేపుకు ఈ కబురు పంపించారు.

ఆదికాండం 50:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మన తండ్రి తన మరణానికి ముందు మీరు యోసేపుతో, ‘నీ సోదరులు నీకు కీడు చేశారు. వారిని, వారి అపరాధాన్నీ దయచేసి క్షమించు’ అని చెప్పమన్నాడు” అని అతనితో చెప్పారు.

ఆదికాండం 50:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సోదరులు పోయి అతని ముందు సాగిలపడి “ఇదిగో మేము నీకు దాసులం” అన్నారు.

ఆదికాండం 50:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు “భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా?

ఆదికాండం 50:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.

ఆదికాండం 50:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి భయపడవద్దు. నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషిస్తాను” అని చెప్పి వారిని ఆదరించి వారితో ఇష్టంగా మాట్లాడాడు.

ఆదికాండం 50:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు, అతని తండ్రి కుటుంబం వారూ ఐగుప్తులో నివసించారు. యోసేపు 110 ఏళ్ళు బతికాడు.

ఆదికాండం 50:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరం పిల్లలను చూశాడు. మనష్షే కొడుకయిన మాకీరు పిల్లలను కూడా చూశాడు. వారిని యోసేపు ఒడిలో ఉంచారు.

ఆదికాండం 50:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు తన సోదరులను చూసి “నేను చనిపోబోతున్నాను. దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ దేశంలోనుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు” అని చెప్పాడు

ఆదికాండం 50:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతే గాక యోసేపు “దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుంచి తీసుకుపోవాలి” అని చెప్పి ఇశ్రాయేలు కొడుకులతో ప్రమాణం చేయించుకున్నాడు.

ఆదికాండం 50:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు 110 ఏళ్ల వయసువాడై చనిపోయాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరచి ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 50 (ASV) »
King James Version (KJV)
Genesis 50 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 50 (GW) »
Berean Bible (BSB)
Genesis 50 (BSB) »
World English Bible (WEB)
Genesis 50 (WEB) »
French Bible (LSG)
Genèse 50 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 50 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 50 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 50 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 50 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 50 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 50 (RVA) »
Italian Bible (RIV)
Genesi 50 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 50 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 50 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 50 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 50 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 50 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 50 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 50 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 50 (BULG) »
Japanese Bible (JPN)
創世記 50 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 50 (NORSK) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List