సంఖ్యాకాండం Chapter 14 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 14:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు.

సంఖ్యాకాండం 14:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు.

సంఖ్యాకాండం 14:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమాజమంతా వారితో “ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?” అన్నారు.

సంఖ్యాకాండం 14:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు “మనం ఇంకొక నాయకుణ్ణి ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

సంఖ్యాకాండం 14:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే, అహరోను ఇశ్రాయేలు ప్రజల సమావేశం ఎదుట సాగిలపడ్డారు.

సంఖ్యాకాండం 14:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు, ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బట్టలు చింపుకుని,

సంఖ్యాకాండం 14:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల సర్వజన సమూహంతో మాట్లాడుతూ “మేము సంచారం చేసి పరిశీలించి చూసిన ప్రదేశం ఎంతో మంచి ప్రదేశం.

సంఖ్యాకాండం 14:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మనలను బట్టి ఆనందిస్తే, ఆ ప్రదేశంలో మనలను చేర్చి, దాన్ని మనకు ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం.

సంఖ్యాకాండం 14:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు” అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.

సంఖ్యాకాండం 14:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సన్నిధి గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది.

సంఖ్యాకాండం 14:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు?

సంఖ్యాకాండం 14:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను వారి మీద తెగులుపంపిస్తాను. వారికి వారసత్వ హక్కు లేకుండా చేస్తాను. ఈ జనం కంటే మరింత గొప్ప బలమైన జనాంగాన్ని నీ వంశం ద్వారా పుట్టిస్తాను” అన్నాడు.

సంఖ్యాకాండం 14:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే యెహోవాతో “అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశ వాసులతో ఈ విషయం చెప్తారు.

సంఖ్యాకాండం 14:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావనీ, యెహోవా అనే నువ్వు ముఖాముఖిగా కనిపించినవాడివనీ, నీ మేఘం వారి మీద నిలిచి ఉన్నదనీ, నువ్వు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుస్తున్నావనీ, వారు విని ఉన్నారు గదా.

సంఖ్యాకాండం 14:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ కీర్తిని గురించి విన్న ప్రజలు

సంఖ్యాకాండం 14:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘ప్రమాణ పూర్వకంగా తాను ఈ ప్రజలకిచ్చిన దేశంలో వారినిచేర్చడానికి శక్తిలేక, యెహోవా వారిని అరణ్యంలో చంపేశాడు’ అని చెప్పుకుంటారు.

సంఖ్యాకాండం 14:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘యెహోవా దీర్ఘశాంతుడు, నిబంధన నమ్మకత్వం సమృద్ధిగా కలిగినవాడు.

సంఖ్యాకాండం 14:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దోషం, అతిక్రమం పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా, మూడు నాలుగు తరాల వరకూ తండ్రుల దోషాన్ని కొడుకుల మీదికి తెచ్చే వాడిగా ఉన్నాడు’ అని నువ్వు చెప్పిన మాట ప్రకారం నా ప్రభువు బలానికి ఘనత కలుగు గాక.

సంఖ్యాకాండం 14:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు” అన్నాడు.

సంఖ్యాకాండం 14:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా “నీ కోరిక ప్రకారం నేను క్షమించాను.

సంఖ్యాకాండం 14:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు,

సంఖ్యాకాండం 14:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు.

సంఖ్యాకాండం 14:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు.

సంఖ్యాకాండం 14:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను.

సంఖ్యాకాండం 14:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సంతానం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివాసం ఉంటున్నారు. రేపు మీరు తిరిగి ఎర్రసముద్రం మార్గంలో అరణ్యంలోకి ప్రయాణమై వెళ్ళండి” అన్నాడు.

సంఖ్యాకాండం 14:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ,

సంఖ్యాకాండం 14:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.

సంఖ్యాకాండం 14:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను.

సంఖ్యాకాండం 14:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు.

సంఖ్యాకాండం 14:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు.

సంఖ్యాకాండం 14:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు.

సంఖ్యాకాండం 14:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ విషయంలో మాత్రం, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి.

సంఖ్యాకాండం 14:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరుగులాడతారు. ఈ అరణ్యం మీ శరీరాలను చంపే వరకూ మీ తిరుగుబాటు వల్ల వచ్చిన పర్యవసానాలను వారు భరించాలి.

సంఖ్యాకాండం 14:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఆ ప్రదేశాన్ని సంచారం చేసి చూసిన నలభై రోజుల లెక్క ప్రకారం రోజుకు ఒక సంవత్సరం ప్రకారం నలభై సంవత్సరాలు మీ పాపశిక్షను భరించి, నేను మీకు శత్రువైతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి.

సంఖ్యాకాండం 14:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను, యెహోవాను మాట్లాడాను. నాకు విరోధంగా సమకూడిన ఈ దుర్మార్గపు సమాజం పట్ల నేను దీన్ని కచ్చితంగా జరిగిస్తాను. ఈ అరణ్యంలో వారు నాశనం అయిపోతారు. ఇక్కడే చనిపోతారు” అన్నాడు.

సంఖ్యాకాండం 14:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే పంపినప్పుడు ఆ దేశంలో సంచారం చేసి చూడడానికి వెళ్లి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పడం వల్ల సమాజం అంతా అతని మీద తిరుగుబాటు చేసిన మనుషులు,

సంఖ్యాకాండం 14:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంటే ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు వల్ల చనిపోయారు.

సంఖ్యాకాండం 14:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ దేశం సంచారం చేసి చూసిన మనుషుల్లో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బ్రతికారు.

సంఖ్యాకాండం 14:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రజలు చాలా దుఃఖపడ్డారు.

సంఖ్యాకాండం 14:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఉదయాన లేచి ఆ కొండ శిఖరం ఎక్కి “మనం నిజంగా పాపం చేశాం. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. యెహోవా మనకు వాగ్దానం చేసిన స్థలానికి వెళ్దాం” అన్నారు.

సంఖ్యాకాండం 14:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని మోషే “మీరు యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు?

సంఖ్యాకాండం 14:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని మీరు సాధించ లేరు. యెహోవా మీ మధ్య లేడు కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతం అవుతారు. మీరు వెళ్ళవద్దు.

సంఖ్యాకాండం 14:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరారు. మీరు ఖడ్గం చేత చనిపోతారు. మీరు యెహోవాను అనుసరించ లేదు గనక ఇంక యెహోవా మీకు తోడుగా ఉండడు” అని చెప్పాడు.

సంఖ్యాకాండం 14:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని వారు మూర్ఖంగా ఆ కొండ కొన మీదకు ఎక్కి వెళ్ళారు. కాని, యెహోవా నిబంధన మందసం గానీ, మోషే గానీ శిబిరం నుంచి బయటకు వెళ్ళలేదు.

సంఖ్యాకాండం 14:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిపై దాడి చేసి, హోర్మా వరకూ వారిని తరిమి హతం చేశారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Numbers 14 (ASV) »
King James Version (KJV)
Numbers 14 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 14 (GW) »
Berean Bible (BSB)
Numbers 14 (BSB) »
World English Bible (WEB)
Numbers 14 (WEB) »
French Bible (LSG)
Nombres 14 (LSG) »
German Bible (LUTH1912)
Numeri 14 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਗਿਣਤੀ 14 (PANIRV) »
Bengali Bible (BENIRV)
গননা 14 (BENIRV) »
Marathi Bible (MARIRV)
गणना 14 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
ગણના 14 (GUJIRV) »
Hebrew Bible (HEB)
במדבר 14 (HEB) »
Portuguese Bible (BSL)
Números 14 (BSL) »
Vietnamese Bible (VIE)
Dân Số 14 (VIE) »
Spanish Bible (RVA)
Números 14 (RVA) »
Italian Bible (RIV)
Numeri 14 (RIV) »
Chinese Simplified (CUVS)
民 数 记 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
民 數 記 14 (CUVT) »
Albanian Bible (ALB)
Numrat 14 (ALB) »
Swedish Bible (SV1917)
4 Mosebok 14 (SV1917) »
Russian Bible (RUSV)
Числа 14 (RUSV) »
Ukrainian Bible (UKR)
Числа 14 (UKR) »
Hungarian Bible (KAR)
4 Mózes 14 (KAR) »
Bulgarian Bible (BULG)
Числа 14 (BULG) »
Japanese Bible (JPN)
民数記 14 (JPN) »
Norwegian Bible (NORSK)
4 Mosebok 14 (NORSK) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List