సంఖ్యాకాండం Chapter 13 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 13 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 13 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 13:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.

సంఖ్యాకాండం 13:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతి వాడూ తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి.

సంఖ్యాకాండం 13:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యేలా వారిని పారాను అరణ్యం నుండి పంపించాడు. వెళ్ళిన వారంతా ఇశ్రాయేలు ప్రజల్లో నాయకులు.

సంఖ్యాకాండం 13:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి పేర్లు ఇవి. రూబేను గోత్రం నుండి జక్కూరు కొడుకు షమ్మూయ,

సంఖ్యాకాండం 13:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు,

సంఖ్యాకాండం 13:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా గోత్రం నుండి యెఫున్నె కొడుకు కాలేబు,

సంఖ్యాకాండం 13:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కొడుకు ఇగాలు.

సంఖ్యాకాండం 13:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడు హోషేయ.

సంఖ్యాకాండం 13:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను గోత్రం నుండి రాఫు కొడుకు పల్తీ,

సంఖ్యాకాండం 13:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు,

సంఖ్యాకాండం 13:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ,

సంఖ్యాకాండం 13:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు,

సంఖ్యాకాండం 13:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కొడుకు సెతూరు,

సంఖ్యాకాండం 13:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కొడుకు నహబీ,

సంఖ్యాకాండం 13:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు.

సంఖ్యాకాండం 13:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.

సంఖ్యాకాండం 13:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. “మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.

సంఖ్యాకాండం 13:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దేశం ఎలాంటిదో పరీక్షించండి. అక్కడ నివసించే ప్రజలను పరిశీలించండి. ఆ ప్రజలు బలవంతులా లేక బలహీనులా అన్నది చూడండి. అక్కడి ప్రజల జనాభా కొద్దిమందే ఉన్నారా లేక అధికంగా ఉన్నారా అనేది చూడండి.

సంఖ్యాకాండం 13:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా?

సంఖ్యాకాండం 13:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.” అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం.

సంఖ్యాకాండం 13:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు.

సంఖ్యాకాండం 13:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.

సంఖ్యాకాండం 13:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఎష్కోలు లోయ చేరుకున్నారు. అక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్న ఒక కొమ్మను కోశారు. దాన్ని ఒక కర్రకి కట్టి ఇద్దరు వ్యక్తులు మోశారు. అక్కడనుంచే కొన్ని దానిమ్మ పళ్ళనూ కొన్ని అంజూరు పళ్ళనూ తీసుకు వచ్చారు.

సంఖ్యాకాండం 13:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ ప్రాంతానికి “ఎష్కోలు లోయ” అనే పేరు పెట్టారు.

సంఖ్యాకాండం 13:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు.

సంఖ్యాకాండం 13:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పారాను అరణ్యంలో కాదేషులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికీ, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికీ వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు.

సంఖ్యాకాండం 13:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మోషేకి ఇలా చెప్పారు. “నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి.

సంఖ్యాకాండం 13:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం.

సంఖ్యాకాండం 13:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దక్షిణ ప్రాంతంలో అమాలేకు ప్రజలు నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో హిత్తీ, యెబూసీ, అమోరీ తెగల వారు నివసిస్తున్నారు. ఇక సముద్రం సమీపంలోనూ, యొర్దాను నదీ ప్రాంతంలోనూ కనాను ప్రజలు నివసిస్తున్నారు.”

సంఖ్యాకాండం 13:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. “మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకున్న బలం సరిపోతుంది” అన్నాడు.

సంఖ్యాకాండం 13:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని అతనితో వెళ్ళిన మిగతా వారు “అక్కడి ప్రజలపై మనం దాడి చేయలేం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు.” అన్నారు.

సంఖ్యాకాండం 13:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. “మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు.

సంఖ్యాకాండం 13:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం” అన్నారు.

Available Bible Translations

American Standard Version
Numbers 13 (ASV) »
King James Version
Numbers 13 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 13 (GW) »
World English Bible
Numbers 13 (WEB) »
Louis Segond 1910
Nombres 13 (LSG) »
Luther Bibel 1912
Numeri 13 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 13 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 13 (HEB) »
Bíblia Sagrada Português
Números 13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 13 (VIE) »
Reina Valera Antigua
Números 13 (RVA) »
La Sacra Bibbia
Numeri 13 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 13 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 13 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 13 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 13 (SV1917) »
Библия на русском
Числа 13 (RUSV) »
Українська Біблія
Числа 13 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 13 (KAR) »
Българска Библия
Числа 13 (BULG) »
聖書 日本語
民数記 13 (JPN) »
Biblia Takatifu
Hesabu 13 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 13 (SOM) »
De Heilige Schrift
Numberi 13 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List