సంఖ్యాకాండం Chapter 16 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 16:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి

సంఖ్యాకాండం 16:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి

సంఖ్యాకాండం 16:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. “మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?” అన్నారు.

సంఖ్యాకాండం 16:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో,

సంఖ్యాకాండం 16:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు.

సంఖ్యాకాండం 16:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.

సంఖ్యాకాండం 16:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు.

సంఖ్యాకాండం 16:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి,

సంఖ్యాకాండం 16:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?

సంఖ్యాకాండం 16:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు.

సంఖ్యాకాండం 16:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు” అన్నాడు.

సంఖ్యాకాండం 16:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.

సంఖ్యాకాండం 16:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?

సంఖ్యాకాండం 16:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము” అన్నారు.

సంఖ్యాకాండం 16:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ “నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు” అన్నాడు.

సంఖ్యాకాండం 16:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.

సంఖ్యాకాండం 16:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు.

సంఖ్యాకాండం 16:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు.

సంఖ్యాకాండం 16:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.

సంఖ్యాకాండం 16:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా “మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి.

సంఖ్యాకాండం 16:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,

సంఖ్యాకాండం 16:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు.

సంఖ్యాకాండం 16:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ,

సంఖ్యాకాండం 16:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి” అన్నాడు.

సంఖ్యాకాండం 16:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు.

సంఖ్యాకాండం 16:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు.

సంఖ్యాకాండం 16:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.

సంఖ్యాకాండం 16:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.

సంఖ్యాకాండం 16:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు.

సంఖ్యాకాండం 16:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు.

సంఖ్యాకాండం 16:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది.

సంఖ్యాకాండం 16:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.

సంఖ్యాకాండం 16:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు.

సంఖ్యాకాండం 16:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు.

సంఖ్యాకాండం 16:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.

సంఖ్యాకాండం 16:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.

సంఖ్యాకాండం 16:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ నిప్పుని దూరంగా చల్లు.

సంఖ్యాకాండం 16:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.”

సంఖ్యాకాండం 16:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి,

సంఖ్యాకాండం 16:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.

సంఖ్యాకాండం 16:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని చెప్పి,

సంఖ్యాకాండం 16:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది.

సంఖ్యాకాండం 16:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,

సంఖ్యాకాండం 16:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో “మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి,

సంఖ్యాకాండం 16:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను” అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు.

సంఖ్యాకాండం 16:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే “నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది” అని అహరోనుతో చెప్పాడు.

సంఖ్యాకాండం 16:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.

సంఖ్యాకాండం 16:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చనిపోయిన వారికీ, బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది.

సంఖ్యాకాండం 16:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14, 700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు.

సంఖ్యాకాండం 16:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు.

Available Bible Translations

American Standard Version
Numbers 16 (ASV) »
King James Version
Numbers 16 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 16 (GW) »
World English Bible
Numbers 16 (WEB) »
Louis Segond 1910
Nombres 16 (LSG) »
Luther Bibel 1912
Numeri 16 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 16 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 16 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 16 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 16 (HEB) »
Bíblia Sagrada Português
Números 16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 16 (VIE) »
Reina Valera Antigua
Números 16 (RVA) »
La Sacra Bibbia
Numeri 16 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 16 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 16 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 16 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 16 (SV1917) »
Библия на русском
Числа 16 (RUSV) »
Українська Біблія
Числа 16 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 16 (KAR) »
Българска Библия
Числа 16 (BULG) »
聖書 日本語
民数記 16 (JPN) »
Biblia Takatifu
Hesabu 16 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 16 (SOM) »
De Heilige Schrift
Numberi 16 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List