సంఖ్యాకాండం Chapter 15 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 15:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ,

సంఖ్యాకాండం 15:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘యెహోవా మీకిస్తున్న ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళినప్పుడు,

సంఖ్యాకాండం 15:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా మందలోని పశువుల్లో, దహనబలిగానైనా, బలిగానైనా తెచ్చి, మొక్కుబడి చెల్లించడానికి గాని, స్వేచ్ఛార్పణగా గాని, నియామక కాలంలో అర్పించేదిగా గాని, దేనినైనా మీరు అర్పించాలనుకున్నారనుకోండి.

సంఖ్యాకాండం 15:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాకు ఆ అర్పణ అర్పించే వాడు ముప్పావు నూనెతో కలిపిన రెండున్నర కిలోల పిండిని నైవేద్యంగా తేవాలి.

సంఖ్యాకాండం 15:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి ముప్పావు లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి.

సంఖ్యాకాండం 15:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొట్టేలుతో పాటు ఒక పడి నూనెతో కలిపిన నాలుగు లీటర్ల పిండిని నైవేద్యంగా సిద్ధం చెయ్యాలి

సంఖ్యాకాండం 15:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.

సంఖ్యాకాండం 15:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మొక్కుబడి చెల్లించడానికైనా, యెహోవాకు సమాధానబలి అర్పించడానికైనా, నువ్వు దహనబలిగానైనా, బలిగానైనా లేత దున్నపోతును సిద్ధం చేస్తే,

సంఖ్యాకాండం 15:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానితో పాటు, లీటరున్నర నూనె కలిపిన ఏడున్నర కిలోల గోదుమపిండిని నైవేద్యంగా అర్పించాలి.

సంఖ్యాకాండం 15:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి.

సంఖ్యాకాండం 15:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లీటరున్నర ద్రాక్షారసం పానీయార్పణగా తేవాలి. ఒక్కొక్క కోడెతోపాటు, ఒక్కొక్క పొట్టేలుతోపాటు, గొర్రెల్లోనైనా, మేకల్లోనైనా ఒక్కొక్క పిల్లతో పాటు ఆ విధంగా చెయ్యాలి.

సంఖ్యాకాండం 15:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు సిద్ధపరిచే వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికీ ఆ విధంగా చెయ్యాలి.

సంఖ్యాకాండం 15:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పణ తెచ్చేటప్పుడు ఆ విధంగానే చెయ్యాలి.

సంఖ్యాకాండం 15:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దగ్గర నివాసం ఉన్న పరదేశిగాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు, మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి.

సంఖ్యాకాండం 15:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమాజానికి, అంటే మీకూ, మీలో నివాసం ఉన్న పరదేశికీ ఒకే కట్టడ. అది మీ తరతరాలకు ఉండే శాశ్వతమైన కట్టుబాటు. యెహోవా సన్నిధిలో మీరున్నట్టే పరదేశి కూడా ఉండాలి.

సంఖ్యాకాండం 15:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకూ, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికీ ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి’” అన్నాడు.

సంఖ్యాకాండం 15:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు,

సంఖ్యాకాండం 15:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత

సంఖ్యాకాండం 15:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు ప్రతిష్ట అర్పణ అర్పించాలి.

సంఖ్యాకాండం 15:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి.

సంఖ్యాకాండం 15:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ తరతరాలకు మీ మొదటి పిండిముద్దలోనుంచి ప్రతిష్ఠార్పణను యెహోవాకు అర్పించాలి” అన్నాడు.

సంఖ్యాకాండం 15:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో, అంటే

సంఖ్యాకాండం 15:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని ఆ తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే,

సంఖ్యాకాండం 15:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండడానికి దహనబలిగా ఒక లేత దున్నపోతును ఆజ్ఞప్రకారం దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధం చెయ్యాలి.

సంఖ్యాకాండం 15:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. తెలియక దాన్ని చేశారు గనక క్షమాపణ దొరుకుతుంది. వారు పొరపాటున చేసిన పాపాలను బట్టి తమ అర్పణ, అంటే యెహోవాకు చెందవలసిన దహనబలి, పాపపరిహారార్థబలి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.

సంఖ్యాకాండం 15:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి గాని, వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశికి గాని, క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే, ప్రజలందరూ తెలియక దాన్ని చెయ్యడం జరిగింది.

సంఖ్యాకాండం 15:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు పొరపాటున పాపం చేస్తే, అతడు పాపపరిహారార్థ బలిగా ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడమేక పిల్లను తీసుకురావాలి.

సంఖ్యాకాండం 15:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొరపాటుగా యెహోవా సన్నిధిలో దాన్ని చేశాడు గనక తెలియక పాపం చేసిన అతని కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అతడు క్షమాపణ పొందుతాడు.

సంఖ్యాకాండం 15:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడు గాని వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశి గాని పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, అతనికీ, మీకూ ఒక్కటే చట్టం ఉండాలి.

సంఖ్యాకాండం 15:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే,

సంఖ్యాకాండం 15:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు” అన్నాడు.

సంఖ్యాకాండం 15:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరడం గమనించారు.

సంఖ్యాకాండం 15:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు కట్టెలు ఏరడం చూసిన వారు మోషే అహారోనుల దగ్గరికి, సమాజం ఎదుటికి అతన్ని తీసుకొచ్చారు.

సంఖ్యాకాండం 15:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు.

సంఖ్యాకాండం 15:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత యెహోవా మోషేతో “ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి.

సంఖ్యాకాండం 15:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సర్వసమాజం శిబిరం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి” అన్నాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం శిబిరం బయటకు అతన్ని తీసుకెళ్ళి, రాళ్లతో కొట్టి చంపారు.

సంఖ్యాకాండం 15:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ,

సంఖ్యాకాండం 15:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి.

సంఖ్యాకాండం 15:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.

సంఖ్యాకాండం 15:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నా కోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి.

సంఖ్యాకాండం 15:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.”

Available Bible Translations

American Standard Version (ASV)
Numbers 15 (ASV) »
King James Version (KJV)
Numbers 15 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 15 (GW) »
Berean Bible (BSB)
Numbers 15 (BSB) »
World English Bible (WEB)
Numbers 15 (WEB) »
French Bible (LSG)
Nombres 15 (LSG) »
German Bible (LUTH1912)
Numeri 15 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਗਿਣਤੀ 15 (PANIRV) »
Bengali Bible (BENIRV)
গননা 15 (BENIRV) »
Marathi Bible (MARIRV)
गणना 15 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
ગણના 15 (GUJIRV) »
Hebrew Bible (HEB)
במדבר 15 (HEB) »
Portuguese Bible (BSL)
Números 15 (BSL) »
Vietnamese Bible (VIE)
Dân Số 15 (VIE) »
Spanish Bible (RVA)
Números 15 (RVA) »
Italian Bible (RIV)
Numeri 15 (RIV) »
Chinese Simplified (CUVS)
民 数 记 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
民 數 記 15 (CUVT) »
Albanian Bible (ALB)
Numrat 15 (ALB) »
Swedish Bible (SV1917)
4 Mosebok 15 (SV1917) »
Russian Bible (RUSV)
Числа 15 (RUSV) »
Ukrainian Bible (UKR)
Числа 15 (UKR) »
Hungarian Bible (KAR)
4 Mózes 15 (KAR) »
Bulgarian Bible (BULG)
Числа 15 (BULG) »
Japanese Bible (JPN)
民数記 15 (JPN) »
Norwegian Bible (NORSK)
4 Mosebok 15 (NORSK) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List