సంఖ్యాకాండం Chapter 10 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.

సంఖ్యాకాండం 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.

సంఖ్యాకాండం 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.

సంఖ్యాకాండం 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి.

సంఖ్యాకాండం 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి.

సంఖ్యాకాండం 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి.

సంఖ్యాకాండం 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు.

సంఖ్యాకాండం 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి.

సంఖ్యాకాండం 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.

సంఖ్యాకాండం 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.”

సంఖ్యాకాండం 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది.

సంఖ్యాకాండం 10:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలో తమ ప్రయాణం సాగించారు. మేఘం తిరిగి పారాను అరణ్యంలో నిలిచింది.

సంఖ్యాకాండం 10:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశాలను బట్టి వారు తమ మొదటి ప్రయాణం చేశారు.

సంఖ్యాకాండం 10:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా గోత్రం వారి ధ్వజం కింద ఉన్న సైన్యం మొదట శిబిరం బయటికి కదిలింది. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను ఆ సైన్యానికి నాయకుడు.

సంఖ్యాకాండం 10:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.

సంఖ్యాకాండం 10:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు.

సంఖ్యాకాండం 10:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోను, మెరారి తెగలవారు తమ బాధ్యత ప్రకారం మందిరాన్ని విప్పి దాన్ని మోస్తూ ముందుకు సాగారు.

సంఖ్యాకాండం 10:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. ఆ సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు.

సంఖ్యాకాండం 10:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను గోత్రం సైన్యానికి సూరీషదాయి కొడుకు షెలుమీయేలు నాయకుడు.

సంఖ్యాకాండం 10:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాదు గోత్రం సైన్యానికి దెయూవేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు.

సంఖ్యాకాండం 10:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతు తెగవారు ప్రయాణమయ్యారు. వారు పరిశుద్ధ స్థలంలోని పరిశుద్ధ పరికరాలను మోస్తూ వెళ్ళారు. తరువాతి శిబిరంలో కహాతు తెగవారు వచ్చేలోగా ఇతరులు మందిరాన్ని నిలబెడుతూ ఉన్నారు.

సంఖ్యాకాండం 10:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. ఈ సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు.

సంఖ్యాకాండం 10:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు.

సంఖ్యాకాండం 10:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు.

సంఖ్యాకాండం 10:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు.

సంఖ్యాకాండం 10:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు గోత్రం సైన్యానికి ఒక్రాను కొడుకు పగీయేలు నాయకుడు.

సంఖ్యాకాండం 10:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలి గోత్రం సేనలకి ఏనాను కొడుకు అహీరా నాయకుడు.

సంఖ్యాకాండం 10:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి.

సంఖ్యాకాండం 10:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే హోబాబుతో మాట్లాడాడు. ఈ హోబాబు మోషే భార్యకు తండ్రి అయిన రెవూయేలు కొడుకు. ఇతడు మిద్యాను ప్రాంతం వాడు. మోషే హోబాబుతో “యెహోవా మాకు చూపించిన దేశానికి మేము వెళ్తున్నాం. దాన్ని మీకు ఇస్తానని యెహోవా మాకు చెప్పాడు. నువ్వు మాతో రా. మా వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేస్తానని యెహోవా ప్రమాణం చేశాడు” అని చెప్పాడు.

సంఖ్యాకాండం 10:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి అతడు “నేను రాను. నేను నా స్వదేశానికీ, నా సొంత ప్రజల దగ్గరకీ వెళ్తాను” అన్నాడు.

సంఖ్యాకాండం 10:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు. “నువ్వు మమ్మల్ని దయచేసి విడిచి పెట్టవద్దు. అరణ్యంలో ఎలా నివసించాలో నీకు బాగా తెలుసు. నువ్వు మా కోసం కనిపెట్టుకుని ఉండాలి.

సంఖ్యాకాండం 10:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు మాతో వస్తే యెహోవా మాకు చేసిన మేలుని మేము నీకు చేస్తాం.”

సంఖ్యాకాండం 10:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు యెహోవా కొండ దగ్గర నుండి మూడు రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన మూడు రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్లకి ముందుగా కదిలింది.

సంఖ్యాకాండం 10:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది.

సంఖ్యాకాండం 10:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే “యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు” అనేవాడు.

సంఖ్యాకాండం 10:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిబంధన పెట్టె ఆగినప్పుడు మోషే “యెహోవా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తిరిగి రా” అనేవాడు.

Available Bible Translations

American Standard Version
Numbers 10 (ASV) »
King James Version
Numbers 10 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 10 (GW) »
World English Bible
Numbers 10 (WEB) »
Louis Segond 1910
Nombres 10 (LSG) »
Luther Bibel 1912
Numeri 10 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 10 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 10 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 10 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 10 (HEB) »
Bíblia Sagrada Português
Números 10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 10 (VIE) »
Reina Valera Antigua
Números 10 (RVA) »
La Sacra Bibbia
Numeri 10 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 10 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 10 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 10 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 10 (SV1917) »
Библия на русском
Числа 10 (RUSV) »
Українська Біблія
Числа 10 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 10 (KAR) »
Българска Библия
Числа 10 (BULG) »
聖書 日本語
民数記 10 (JPN) »
Biblia Takatifu
Hesabu 10 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 10 (SOM) »
De Heilige Schrift
Numberi 10 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List